Shocking Vide: ఇంటి బయట ఉంచిన షూలో, బయట పార్క్ చేసిన కార్లు, బైకులలో తరచుగా పాములు దూరుతాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి కూడా. తాజాగా ఇప్పుడు మరో వీడియో వెలుగులోకి వచ్చింది. బుసలు కొట్టే నాగుపాము ఏకంగా హెల్మెట్ లో చేరింది. బండికి తగిలించిన హెల్మెట్ కదలడంతో అనుమానం వచ్చిన యజమానికి దగ్గరికి వెళ్లి పరిశీలిస్తే నాగుపాము కనిపించింది. ఒక్కసారిగా భయంతో వణికిపోయాడు. వెంటనే స్నేక్ క్యాచర్ ను పిలిపించి పామును పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ షాకింగ్ ఇన్సిడెంట్ మహారాష్ట్రలోని నాగ్ పూర్ జిల్లాలో జరిగింది. మానవ్ సేవా నగర్ ప్రాంతంలో ఉండే మితాలి చతుర్వేది.. తాజాగా తన బైక్ ను ఇంటి బయట ఉంచాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో బయటకు వెళ్లాలని భావించాడు. అదే సమయంలో హెల్మెట్ కదలడంతో పాటు ఒక ప్రత్యేకమైన హిస్సింగ్ శబ్దం వినిపించింది. నెమ్మదిగా పరిశీలించగా, లోపల పాము కనిపించింది. ఒక్కసారిగా చతుర్వేది కుటుంబం షాక్ అయ్యింది.
వెంటనే, దగ్గరలోని వైల్డ్ యానిమల్స్ అండ్ నేచర్ హెల్పింగ్ సొసైటీకి సమాచారం అందించారు. వెంటనే అక్కడి నుంచి శుభమ్ జిఆర్ అనే స్నేక్ క్యాచర్ వచ్చాడు. హెల్మెట్ ను పరిశీలించి.. నెమ్మదిగా లోపల ఉన్నపామును బయటకు తీసుకొచ్చాడు. దాన్ని నెమ్మదిగా పట్టుకుని సంచిలో వేసి మూత కట్టాడు. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలాడు. నెమ్మదిగా అక్కడి నుంచి నాగుపాము వెళ్లిపోయింది.
Video: Cobra Tries To Hitch A Ride Inside Helmet In Maharashtra. Rescued
Read: https://t.co/dwrtwaTaTq pic.twitter.com/2rA9G99bxy
— NDTV (@ndtv) December 31, 2025
Read Also: ఇలాంటి వీడియోలు రేర్.. మొసలి దాడి నుంచి కోతిని కాపాడిన వానర సైన్యం.. ఇది కదా ఐక్యమత్యం అంటే…
అటు ఈ విషయం తెలిసి చుట్టు పక్కల వాళ్లంతా చతుర్వేది ఇంటికి వచ్చారు. శుభమ్ పామును ఎలా పట్టుకుంటున్నాడో చూశారు. పాముకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సింపుల్ గా పట్టుకోవడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. కాసేపు ఆ ప్రదేశం అంతా జనాలతో కిక్కిరిసిపోయింది. ప్రజలు బయట షూ, హెల్మెట్ లాంటి వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చెత్త చెత్తగా ఎక్కడ పడితే అక్కడ చెప్పులు, ఇతర వస్తువులను పెట్టడం వల్ల పాములు చేరే అవకాశం ఉంటుందన్నారు. పట్టించుకోకుండా అలాగే షూ వేసుకుంటే పాము కాటుతో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా నాగుపాము లాంటి డేజరస్ స్నేక్స్ కరిస్తే త్వరగా ప్రాణాపాయం కలుగుతుందంటున్నారు. వీలైనంత వరకు షూ, హెల్మెట్ల జాగ్రత్తగా భద్రపరుచుకోవాలంటున్నారు.
Read Also: అమ్మ పేరున ఆస్తులు.. భార్యకు గుండు సున్నా.. ‘దేశీ హకీమీ’ మాస్టర్ ప్లాన్!