E-Paper
Advertisement

Iran Conflict: ఇరాన్‌తో అమెరికా – ఇజ్రాయెల్ యుద్ధం.. భారత్ కొంప ముంచబోతోందా?

Iran Conflict: ఇరాన్‌తో అమెరికా – ఇజ్రాయెల్ యుద్ధం.. భారత్ కొంప ముంచబోతోందా?
Advertisement

Iran Conflict: మధ్యప్రాచ్యంలో చెలరేగిన తీవ్ర ఉద్రిక్తతలు.. భారత్ లో భయాందోళనకు దారితీశాయి. ఇరాన్ పై అమెరికా – ఇజ్రాయెల్ దేశాలు విరుచుకుపడుతుండటం, వాటిని ఎదుర్కొనేందుకు ఇరాన్ తీసుకోబోయే నిర్ణయాలు.. భారత్ పై పెను ప్రభావం చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భారత ఆర్థిక వ్యవస్థ, ఇంధన భద్రతను ఈ యుద్ధం తీవ్రంగా ప్రభావితం చేయవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ పై యుద్ధం.. భారత్ పై ఎలాంటి ప్రభావం చూపనుందో ఇప్పుడు పరిశీలిద్దాం.

‘హార్ముజ్ జలసంధి’ ముప్పు

భారత్ తన ముడి చమురు అవసరాల్లో దాదాపు 85-90 శాతం వరకూ దిగుమతులపైనే ఆధారపడుతూ వస్తోంది. ప్రపంచ చమురు రవాణాలో 20% వాటా కలిగిన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) ప్రస్తుతం ఇరాన్ ఆధీనంలోనే ఉంది. భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో దాదాపు 50% (రోజుకు 2.6 మిలియన్ బ్యారెళ్లు) ఈ మార్గం ద్వారానే వస్తోంది. ఒకవేళ ఇరాన్ ఈ జలసంధిని మూసివేస్తే సరఫరా నిలిచిపోయి అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటవచ్చు. దీనివల్ల భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.

ఆర్థిక వ్యవస్థపై ప్రభావం – ద్రవ్యోల్బణం

Advertisement

భారత్ లో చమురు ధరలు పెరిగితే అది నేరుగా సామాన్యుడిపై భారాన్ని పెంచుతుంది. ముడి చమురు ధర బ్యారెల్‌కు 10 డాలర్లు పెరిగితే భారత్ పై ఏటా అదనంగా రూ.10,000 నుండి రూ.15,000 కోట్ల భారాన్ని పెంచుతుంది. చమురు కొనుగోళ్లు డాలర్లలో జరుగుతున్నందున.. దిగుమతుల కోసం ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి రావొచ్చు. ఫలితంగా రూపాయి విలువ బలహీనపడే ప్రమాదముంది. మరోవైపు దేశంలో చమురు కారణంగా రవాణా ఖర్చులు పెరిగి పప్పులు, కూరగాయాలు వంటి నిత్యవసరాల ధరలు పెరిగిపోయే ప్రమాదముంది. దేశంలో ద్రవ్యోల్బణం తలెత్తవచ్చు.

స్టాక్ మార్కెట్ – ఎగుమతులపై ప్రభావం

ఇరాన్ పై యుద్ధం భారత ఎగుమతులపై ప్రతీకూల ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా బాస్మతీ బియ్యం, టీ, ఫార్మా, సుగంద ద్రవ్యాలు వంటి ఉత్పత్తులను ఇరాన్ తో పాటు గల్ఫ్ దేశాలకు భారత్ ఎగుమతి చేస్తోంది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఎగుమతులు దెబ్బతినే ప్రమాదం ఉంది. మరోవైపు ఇరాన్ పై వార్.. భారత స్టాక్ మార్కెట్ ను సోమవారం దెబ్బతీసింది. సెన్సెక్స్‌ దాదాపు 1500 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ దాదాపు 500 పాయింట్ల మేర కుంగింది.

Advertisement

Also Read: Harish Rao: మాటల మేధావి.. కాస్త చూసుకోవాలి కదా.. చూడు ఎలా పరువు పోయిందో?

చమురు నిల్వలపై ప్రభావం

భారత ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా తగినంత చమురు నిల్వలను తన వద్ద పెట్టుకుంది. ప్రస్తుతం భారత్ వద్ద సుమారు 74 రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయి. ఇందులో 9.5 రోజులకు సరిపడ నిల్వలు భూగర్బంలో ఉండగా.. మిగిలినవి చమురు కంపెనీ వద్ద ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇరాన్ నుంచి చమురు కొనుగోలును గతంలోనే ఆపేయడం.. ప్రస్తుతం రష్యా, వెనెజులా నుంచి భారత్ చమురును దిగుమతి చేసుకుంటూ ఉండటం నిల్వలపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read: Kodali Nani: కొడాలి ఈజ్ బ్యాక్.. టెన్షన్‌లో వైసీపీ.. ఏ నిమిషానికి ఏమి జరుగునో?

Related News

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

Big Stories

Advertisement
×