E-Paper
Advertisement

Ranabali Movie: రణబాలి షూటింగ్ అప్డేట్..మరీ ఇంత ఫాస్ట్ ఏంటి గురూ!

Ranabali Movie: రణబాలి షూటింగ్ అప్డేట్..మరీ ఇంత ఫాస్ట్ ఏంటి గురూ!
Advertisement

Ranabali Movie: విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika mandanna).. వివాహం తర్వాత కలిసి నటించబోతున్న చిత్రం రణబాలి(Ranabali ). ప్రముఖ దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ రచన, దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ నుండి కొత్త అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. వివరాలలోకి వెళ్తే.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకలు ఉదయపూర్ లో అత్యంత వైభవంగా ముగిసాయి. 100 మంది అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు అలా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారో లేదో 12 గంటల్లోనే రెండున్నర కోటికి పైగా లైక్స్ సాధించి రికార్డు సృష్టించాయి. ముఖ్యంగా పాన్ ఇండియా సెలబ్రిటీలుగా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఈ పెళ్లితో నేషనల్ వైడ్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు.

రిసెప్షన్ తర్వాత హనీమూన్ కి..

పైగా తమ వివాహ వేడుకల్లో సాంప్రదాయ దుస్తులు ధరించడమే కాకుండా దక్షిణాది భారతీయ కళలకు ప్రాణం పోస్తూ 10 నెలల పాటు అత్యంత శ్రమతో తయారుచేసిన జ్యూవెలరీని ధరించి అందరిని ఆకర్షించారు. ముఖ్యంగా ఇద్దరు ధరించిన నగల విలువ సుమారుగా 7 కోట్లకు పైగానే ఉంటుందని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. అలా హై ప్రొఫైల్ మ్యారేజ్ లలో ఒకటిగా ఈ పెళ్లి నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ఇక ప్రస్తుతం ఎంత ఎదిగినా మూలాలను మరిచిపోకుండా విజయ్ దేవరకొండ తన భార్య రష్మిక మందన్నను వెంటబెట్టుకొని నాగూర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలంలో ఉన్న తుమ్మన్ పేటకు చేరుకున్నారు. బంధువులు , గ్రామస్తులు, అత్యంత సన్నిహితుల ఆహ్వానంతో ఊరిలోకి అడుగుపెట్టిన ఈ జంట.. విజయ్ దేవరకొండ ఫామ్ హౌస్ లో నూతన గృహప్రవేశం చేసి, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించారు. మార్చి 4వ తేదీన సినీ సెలబ్రిటీలు , రాజకీయ ప్రముఖుల కోసం భారీ ఎత్తున రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఇక అనంతరం హనీమూన్ కోసం విదేశాలకు వెళ్లనుంది ఈ జంట.

రణబాలి మొదటి షెడ్యూల్ అప్పుడే..

Advertisement

ఇక హనీమూన్ నుంచి వచ్చిన తర్వాత మార్చి 20 నుంచి వీరిద్దరూ కలిసి నటిస్తున్న రణబాలి సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుండడం గమనార్హం. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ఈ భారీ షెడ్యూల్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న తమ పెళ్లి వేడుకలు అన్నింటిని పూర్తిచేసుకుని తిరిగి వచ్చిన వెంటనే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది అని తెలిసి అభిమానుల సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి జరిగిన తర్వాత కనీసం నెల కూడా జంటగా తమ వైవాహిక జీవితాన్ని ఆస్వాదించకుండానే సెట్లోకి అడుగుపెడుతున్నారా అని కామెంట్ చేస్తుంటే.. మరికొంతమంది సెట్లోనే కొత్త బంధానికి నాంది పలుకబోతున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

also read:Vijay -Rashmika: కొత్త కోడలికి ఆహ్వానం పలికిన విజయ్ సొంతూరు.. గృహప్రవేశం తో పాటు సత్యనారాయణ వ్రతం!

ముచ్చటగా మూడోసారి జంటగా..

Advertisement

ఇక ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో గీతాగోవిందం , ఇయర్ కామ్రేడ్ సినిమాలు వచ్చి మంచి విజయాన్ని అందుకోగా.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి.. పైగా వివాహం తర్వాత చేస్తున్న మొదటి సినిమా కావడంతో అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయని చెప్పాలి. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ చిత్రం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న లకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×