E-Paper
Advertisement

Big tv kissik Talks Promo: బాడీ షేమింగ్ కామెంట్స్… బయటకు రాలేకపోయాను టేస్టీ తేజ ఎమోషనల్!

Big tv kissik Talks Promo: బాడీ షేమింగ్ కామెంట్స్… బయటకు రాలేకపోయాను టేస్టీ తేజ ఎమోషనల్!
Advertisement

Big tv kissik Talks Promo: టేస్టీ తేజ పరిచయం అవసరం లేని పేరు. యూట్యూబ్ ద్వారా ఫుడ్ కి సంబంధించిన వీడియోలను చేస్తూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న టేస్టీ తేజ(Tasty Teja) యూట్యూబ్ ద్వారా ఎంతో మంది సబ్స్క్రైబర్లను సొంతం చేసుకొని సెలబ్రిటీగా మారిపోయారు. ఇక ఈయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ సీజన్ 7 రియాలిటీ షోలో పాల్గొని సందడి చేశారు. ఇలా బిగ్ బాస్ ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్న తేజ ప్రస్తుతం పెద్ద ఎత్తున బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. అదే విధంగా సినిమాలను తనదైన శైలిలో ప్రమోట్ చేస్తూ బిజీగా ఉన్నారు.

స్కూల్లోనే బాడీ షేమింగ్ కామెంట్స్..

ఏదైనా ఒక సినిమా విడుదల అవుతుంది అంటే స్టార్ హీరోలు సైతం టేస్టీ తేజతో కలిసి ఒక ఇంటర్వ్యూ చేస్తే తమ సినిమాకు మంచి బజ్ వస్తుందని భావించి తేజతో కలిసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న తేజ తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన కెరియర్ తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తేజ తనకు ఎదురైన బాడీ షేమింగ్ కామెంట్స్ గురించి మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు. తేజ జీవితంలో ఎవరైనా అమ్మాయి ఉన్నారా అంటూ వర్ష ప్రశ్నించడంతో ఈయన తనకు ఎదురైన చేదు సంఘటనల గురించి తెలిపారు.

Advertisement

ఎనిమిదేళ్లు అమ్మాయిలతో మాటల్లేవు..

చిన్నప్పటినుంచి నేను కాస్త లావుగా ఉండటంవల్ల నన్ను స్కూల్ టైం నుంచే చాలామంది చాలా విధాలుగా కామెంట్ చేశారు. నేను అలా నడుస్తూ ఉంటే నా కలర్ గురించి నా నడక గురించి అలాగే నా లావు గురించి చాలామంది కామెంట్లు చేశారు. దీంతో నేను ఎవరితోనూ సరిగా మాట్లాడలేకపోయే వాడినని ఎమోషనల్ అయ్యారు. ఇలాంటి కామెంట్స్ ఎదురుకోలేక కనీసం బయటకు కూడా వచ్చే వాడిని కాదని దాదాపు 8 సంవత్సరాల పాటు అమ్మాయిలతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంటూ తేజ ఈ సందర్భంగా తెలియజేస్తూ కాస్త ఎమోషనల్ అయ్యారు.

Advertisement

ఇక ఇప్పుడు కూడా తాను అమ్మాయిలతో మాట్లాడాలి అంటే కాస్త వెనకడుగు వేస్తానని తేజ తెలిపారు. ఇక టేస్టీ తేజ తన యూట్యూబ్ వీడియోల గురించి అలాగే ఫుడ్ వ్లాగ్స్ చేయటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొన్నట్టు ఈ సందర్భంగా తేజ తెలిపారు. ఇక తన పెళ్లి గురించి తన కెరియర్ గురించి కూడా తేజ ఈ కార్యక్రమంలో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే పూర్తి ఎపిసోడ్లో భాగంగా ఈయన ఎలాంటి విషయాలు గురించి మాట్లాడారనేది తెలియనుంది. ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్ ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు బిగ్ టీవీలో ప్రసారం కానుంది.

Also Read: Big tv kissik Talks Promo: టేస్టీతేజతో పెళ్లి షాకింగ్ కండిషన్ పెట్టిన నటి..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×