E-Paper
Advertisement

Virosh couple: పెళ్లి తర్వాత ఎయిర్‌పోర్టులో కనిపించిన విరోష్ జంట.. మరీ ఇలా అయితే ఎలా గురూ!

Virosh couple: పెళ్లి తర్వాత  ఎయిర్‌పోర్టులో కనిపించిన విరోష్ జంట.. మరీ ఇలా అయితే ఎలా గురూ!
Advertisement

Virosh couple: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ లవ్లీ కపుల్ గా పేరు సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ (vijay Deverakonda) , రష్మిక మందన్న(Rashmika mandanna) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 2018లో వచ్చిన ‘గీతాగోవిందం’ సినిమాతో తొలిసారి వెండితెరపై జంటగా కనిపించిన వీరు.. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక అప్పటినుంచి ప్రేమలో పడ్డ ఈ జంట ఎప్పటికప్పుడు చట్టాపట్టాలేసుకొని తిరుగుతూ.. అందరినీ ఆశ్చర్యపరిచారు. పైగా వీరు బహిరంగంగా కలిసి కనిపించలేదు. కానీ వీరు విడివిడిగా కనిపించినా.. వీరు షేర్ చేసిన ఫోటోలలోని బ్యాక్ గ్రౌండ్ వీరు ఒకే చోట ఉన్నారు అనే విషయాన్ని స్పష్టం చేసింది.

ఎనిమిదేళ్ల ప్రేమాయణానికి స్వస్తి..

దాదాపు 8 సంవత్సరాల పాటు తమ బంధాన్ని అత్యంత రహస్యంగా కొనసాగించిన ఈ జంట.. ఎప్పుడు ఒకటవుతారు అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. కానీ ఏ ఒక్క రోజు కూడా తమ బంధాన్ని ఈ జంట బయట పెట్టలేదు. కానీ ఎట్టకేలకు గత ఏడాది రహస్యంగా నిశ్చితార్థం చేసుకొని.. అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఇక ఈ ఏడాది అభిమానులు ప్రేమగా పెట్టిన విరోష్ అనే పదాన్ని చాలా సంతోషంగా స్వీకరిస్తూ.. ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అంటూ ఫిబ్రవరి 26 2026న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. డెస్టినేషన్ వివాహం చేసుకున్న ఈ జంట పెళ్లి వేడుకతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఉదయపూర్ లో ఉదయం హిందూ సాంప్రదాయం ప్రకారం, సాయంత్రం కొడవ పద్ధతిలో వివాహం చేసుకున్నారు ఈ జంట. ఇక వివాహం చేసుకోవడమే కాదు తమ పెళ్లి దుస్తులతో పాటు ధరించిన నగలతో కూడా అందరిని ఆకర్షించారు.

పెళ్లితో పాన్ ఇండియా క్రేజ్..

Advertisement

ఇక అంతేకాదు దాదాపు 23 ప్రధాన నగరాలతో పాటు 16 దేవాలయాల్లో స్వీట్స్, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి వార్తల్లో నిలిచిన ఈ జంట.. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు కూడా.. పైగా విజయ్ దేవరకొండ తమ సొంత ఊరు తుమ్మన్ పేటలో నూతన గృహ ప్రవేశం తో పాటు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తన భార్య రష్మికతో కలిసి ఆచరించారు. అనంతరం ఆ ఊరి అభివృద్ధికి పాటుపడతామని చెప్పిన ఆయన.. అదే ఊర్లో తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ వివాహం చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు అచ్చంపేట పరిధిలో ఉన్న 44 పాఠశాలల్లో 9, 10వ తరగతి చదివే విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేస్తామని తెలిపారు . అలా ఈ జంట తమ పెళ్లితో ఎన్నో వాగ్దానాలను చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

also read:Trisha-Vijay: త్రిష బై సెక్సువల్.. సంచలన కామెంట్లు చేసిన స్టార్ సింగర్!

ఎయిర్‌పోర్టులలో కనిపించిన విరోష్ జంట..

Advertisement

ఇకపోతే పెళ్లి తర్వాత తాజాగా ఈ జంట ఎయిర్‌పోర్టులో కనిపించడంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఈరోజు నుంచి వీరు రణబాలి సినిమా షూటింగ్ సెట్లో అడుగుపెట్టబోతున్నారు.. కర్నూల్ లో జరిగే ఈ షూటింగ్లో భాగంగా ఈ జంట తాజాగా ఎయిర్పోర్టులో కనిపించింది. ఇక్కడ చాలా క్యాజువల్ లుక్ లో కనిపించారు. రష్మిక షర్టు ప్యాంట్ తో చాలా సింపుల్ గా కనిపించగా.. అటు విజయ్ దేవరకొండ షర్టు ,షార్ట్ ధరించి మరింత క్యాజువల్ గా కనిపించారు . ఎంత పెళ్లయితే మాత్రం ఇంట్లో ఉన్నట్టు మరీ ఇంత క్యాజువల్ గా కనిపించడం ఏంటి గురు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం రణబాలి షూటింగ్లో భాగంగానే వీరు ఇలా ఎయిర్ పోర్ట్ లో కనిపించినట్లు తెలుస్తోంది.

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ=

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×