E-Paper
Advertisement

TamilNadu Crime: ఇంటర్ విద్యార్థినిని చంపి.. ఆ తర్వాత ముక్కలు చేసి, తూత్తుకుడి సమీపంలో జరిగిన ఘోరం

TamilNadu Crime: ఇంటర్ విద్యార్థినిని చంపి.. ఆ తర్వాత ముక్కలు చేసి, తూత్తుకుడి సమీపంలో జరిగిన ఘోరం
Advertisement

TamilNadu Crime: తమిళనాడులో దారుణం జరిగింది. మల విసర్జనకు వెళ్లిన ఇంటర్ విద్యార్థిని దారుణహత్యకు గురైంది. నిందితులు ఆమెని చంపి, శరీరాన్ని ముక్కలుగా నరికి వేశారు. సంచలనం రేపిన ఈ ఘటన తూత్తుకుడి జిల్లా విలాతికుళం పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఆ ప్రాంత ప్రజలు ఆందోళనకు దిగడం కలకలం రేపింది. అసలేం జరిగింది?

తూత్తుకుడి జిల్లాలో దారుణమైన ఘటన

Advertisement

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా విలాతికుళం పరిధిలోని వేదనాథం గ్రామంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థిని ఎప్పటి మాదిరగా కాలేజీకి వెళ్లింది. తిరిగి సాయంత్రం ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు. ఆ తర్వాత కూతురు కోసం వెతకడం ప్రారంభించారు.

చివరకు నిర్మానుష్య ప్రాంతంలోని ముల్ల పొదల్లో బాలిక మృత దేహం రక్తపు మడుగులో ఉంది. అది చూసి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాకయ్యారు. తమ కూతురు కనిపించలేదని అప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికపై లైంగిక దాడి జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

Advertisement

ఇంటర్ విద్యార్థినిని చంపి.. ఆ తర్వాత ముక్కలు చేశారు నిందితులు

బాలిక మృతదేహంపై గాయాలు ఉండటంతో చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. నివేదిక వచ్చిన తర్వాత వివరాలు తెలుస్తాయని చెప్పారు అధికారులు. ఈ ఘటన ఆ జిల్లా వ్యాప్తంగా పెను దుమారం రేపింది.

నిందితులను పట్టుకునేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దిగాయి. ఒక టీమ్ సీసీటీవీ ఫుటేజ్, మరొక టీమ్ బాలిక ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. అమానుష ఘటనకు నిరసనగా బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. సాయంత్రం వేళ నడిచేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిందని చెబుతున్నారు కుటుంబసభ్యులు.

ALSO READ: ఈ భారతీయుడ్ని పట్టుకుంటే 9 కోట్లు మీకే.. ఎఫ్‌బీఐ ప్రకటన, ఇంతకీ ఏం చేశాడు?

మహిళలకు రక్షణ లేదని ఆరోపిస్తూ తూత్తుకుడి జిల్లాలో ప్రజాప్రతినిధులు రోడ్డు దిగ్బంధం చేశారు. ఫలితంగా కొన్ని గంటలపాటు ఉద్రిక్తత నెలకొంది. ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో నిరసన తెలుపుతున్నవారిలో చర్చలు జరపడంతో వెనక్కి తగ్గారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×