E-Paper
Advertisement

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నుంచి బ్యూటీఫుల్ లవ్ సాంగ్.. ఎలా ఉందంటే?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నుంచి బ్యూటీఫుల్ లవ్ సాంగ్.. ఎలా ఉందంటే?
Advertisement

Vishnu Vinyasam: టాలీవుడ్‌లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో ఎవరయ్యా అంటే వెంటనే వినిపించే పేరు శ్రీవిష్ణు. ‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’గా పేరున్న శ్రీవిష్ణు (Sree Vishnu) ఇప్పుడు ఒకేసారి, ఒకే రోజు రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ రెండు సినిమాలు ఏవంటే ‘విష్ణు విన్యాసం’ (Vishnu Vinyasam), ‘మృత్యుంజయ్’. ఈ రెండు సినిమాల ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేసి, కంటెంట్‌ను వదులుతున్నారు. తాజాగా ‘మృత్యుంజయ్’ (Mruthyunjay) నుంచి వచ్చిన టీజర్ మంచి స్పందనను రాబట్టుకుంటుంటే, నూతన దర్శకుడు యదునాథ్ మారుతి రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విష్ణు విన్యాసం’ నుంచి సెకండ్ సింగిల్‌ను శుక్రవారం మేకర్స్ వదిలారు. ఈ సాంగ్ ఎలా ఉందంటే..

Also Read- Trivikram: త్రివిక్రమ్‌పై మరోసారి కాపీ ఆరోపణలు…హీరోయిన్ ఎక్స్ప్రెషన్‌తో సహా దించేసిన గురూజీ..!

ప్రేమికులకు బ్యూటీఫుల్ గిఫ్ట్

Advertisement

‘విష్ణు విన్యాసం’ నుంచి ఇప్పటి వరకు వచ్చిన టైటిల్ గ్లింప్స్, మాస్ సాంగ్ ‘దేఖో విష్ణు విన్యాసం’ మంచి స్పందనను రాబట్టుకుని సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ ‘మొదలే మొదలే’ పాటను మేకర్స్ విడుదల చేశారు. వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ పాట, ప్రేమికుల మనసు గెలుచుకుంటోంది. సంగీత దర్శకుడు రధన్ మరోసారి తన మెలోడీ మ్యాజిక్‌ను రిపీట్ చేశారు. ఒక స్వచ్ఛమైన ప్రేమ అనుభూతిని కలిగించేలా ఈ సాంగ్‌ను ఆయన కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ఈ పాటకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ‘తొలి వలపై తెర తీసే..’ వంటి పదాలతో మనసులోని ప్రేమ భావాలను ఎంతో చక్కగా ఆవిష్కరించారు. ఈ పాటను మధుశ్రీ, నరేష్ అయ్యర్ తమ మధురమైన కంఠంతో ఆలపించి, వినేవారికి ఒక కొత్త అనుభూతిని ఇచ్చారు. ముఖ్యంగా వారి గాత్రం ఈ లవ్ మెలోడీని మరో స్థాయికి తీసుకెళ్లిందని చెప్పవచ్చు.

Also Read- Director Krish: ఏడుగురు హీరోయిన్లతో సినిమా నిజం కాదు.. ఏసేశాడు.. బాగా ఏసేశాడు!

హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ అదుర్స్

Advertisement

ఈ పాటలో హీరో శ్రీ విష్ణు, హీరోయిన్ నయన సారిక మధ్య కెమిస్ట్రీ ఎంతో లవ్లీగా ఉంది. విజువల్స్ పరంగా కూడా పాట చాలా రిచ్‌గా కనిపిస్తోంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ పాటలోని ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో అందంగా తీర్చిదిద్దారు. వాలెంటైన్స్ డే వేళ.. ప్రియమైన వారికి అంకితం ఇవ్వడానికి ఇది ఒక పర్ఫెక్ట్ సాంగ్ అనేలా అప్పుడే ఈ పాటపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రంలో సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. ఇప్పటి వరకు ప్రమోషనల్ కంటెంట్‌లానే ఈ సెకండ్ సింగిల్ కూడా సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. త్వరలోనే ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. శ్రీవిష్ణు ఈసారి తన విన్యాసాలతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూద్దాం..

Also Read- Ikkis On OTT : ఓటీటీలో ధర్మేంద్ర చివరి చిత్రం స్ట్రీమింగ్ షురూ… కానీ చిన్న ట్విస్ట్

Related News

Poojitha Ponnada : గార్జీయస్ లుక్ లో మెరిసిపోతున్న పూజిత.. కుర్రాళ్ళు ఏమైపోతారమ్మా..!

HBD Pawan Kalyan : బర్త్ డే స్పెషల్.. ఆ ఒక్కటే పవర్ స్టార్ ను చేసిందా..?

కృష్ణుడిగా రామ్ చరణ్.. సూపర్ హిట్ సినిమా రీమేక్ చేయనున్నారా?

టాక్సిక్ సినిమాకు రేటింగ్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ రేటింగ్.. ఇంత రారుణమా?

మై లిటిల్ ప్యారడైజ్..కొడుకుతో క్యూట్ ఫోటోలను షేర్ చేసిన నాని..

యాంకర్ గా స్రవంతి ఉంటే సినిమా హిట్టే.. డైరెక్టర్ ప్రశంశలు..సుమ క్రేజ్ తగ్గిందా?

లెనిన్ హిట్.. మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన భాగ్య శ్రీ?

మధ్యం మానేశాను.. హృదయ విదారకమైన బాధ అంటున్న కొండన్న!

Big Stories

Advertisement
×