E-Paper
Advertisement

Actress Prema: ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు విడాకులు తర్వాత ఎలా అయిపోయిందంటే..!

Actress Prema: ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు విడాకులు తర్వాత ఎలా అయిపోయిందంటే..!
Advertisement

Actress Prema: తెలుగు ప్రేక్షకులకు ప్రేమ అనే పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రేమ, తన సహజ నటనతో ప్రేక్షకుల మనసులు గెలిచింది. తెలుగులో ఆమె చేసిన సినిమాలు ఇప్పటికీ గుర్తుండిపోయేలా ఉన్నాయి.

ప్రేమ సినిమాల్లోకి అడుగుపెట్టే ముందు కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది. 1995లో కన్నడలో విడుదలైన ‘సవ్యసాచి’ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత తెలుగులో వెంకటేష్ హీరోగా సురేశ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధర్మచక్రం’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఈ సినిమా ఆమె కెరీర్‌కు మంచి మలుపు ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో అనేక సినిమాల్లో నటించి నటిగా మంచి పేరు సంపాదించింది.

Advertisement

సినిమా జీవితంలో విజయాలు చూసిన ప్రేమ, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని ఆమె స్వయంగా వెల్లడించింది. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి మనసు విప్పి మాట్లాడింది. ప్రేమ 2006లో జీవన్ అప్పాచ్చుతో ప్రేమ వివాహం చేసుకుంది. మొదట అన్నీ బాగానే ఉన్నప్పటికీ, కాలక్రమేణా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. దాదాపు పది సంవత్సరాల పాటు కలిసి జీవించిన తర్వాత వారి మధ్య దూరం పెరిగింది.

వివాహ జీవితంలో తాను చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నానని ప్రేమ చెప్పింది. పెళ్లి తర్వాత ప్రతి మహిళకు ఉండే ఆశలు, అంచనాలు తన విషయంలో నెరవేరలేదని ఆమె భావన. స్వేచ్ఛగా జీవించే అవకాశం లేకపోయిందని, తన నిర్ణయాలపై నియంత్రణ లేకుండా పోయిందని చెప్పింది. ఈ పరిస్థితులు తట్టుకోలేక 2016లో కోర్టును ఆశ్రయించి విడాకులు తీసుకున్నట్లు వెల్లడించింది.

Advertisement

విడాకుల తర్వాత ప్రేమ తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించింది. ప్రస్తుతం తాను స్వేచ్ఛగా, ప్రశాంతంగా జీవిస్తున్నానని చెబుతోంది. సినిమా అవకాశాలు తగ్గినప్పటికీ, తనకు నచ్చిన పనులు చేసుకుంటూ సంతోషంగా ఉంటున్నానని తెలిపింది. అసలు ముందులాగా లేను అని ఇప్పుడు పూర్తిగా మారిపోయానని చెప్పకు వచ్చింది. జీవితంలో పెళ్లి అనేది నమ్మకం, బాధ్యత, పరస్పర అవగాహనపై ఆధారపడాలని ఆమె తన అభిప్రాయం ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో వ్యక్తం చేసింది.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగిన ప్రేమ, ఈరోజు తన అనుభవాలను ఓ పాఠంగా తీసుకొని ముందుకు సాగుతోంది. ఆమె జీవితం చాలా మందికి ఒక నేర్పు లాంటిదే అని చెప్పవచ్చు.

ALSO READ: Trivikram: త్రివిక్రమ్‌పై మరోసారి కాపీ ఆరోపణలు…హీరోయిన్ ఎక్స్ప్రెషన్‌తో సహా దించేసిన గురూజీ..!

Related News

పాయల్ రాజ్‌పుత్ గ్లామర్ డోస్.. ఒక్క ఫొటోతో సోషల్ మీడియా షేక్!

సంగీత సామ్రాజ్ఞి కథలో నేషనల్ క్రష్.. రష్మిక కొత్త అవతారం!

జాన్వీ, ఖుషీలకు నోటీసులు.. శ్రీదేవి ఆస్తి వివాదంలో సుప్రీం కీలక ఆదేశం

సెన్సార్ బోర్డు పునర్వ్యవస్థీకరణ.. CBFCలో చోటు దక్కించుకున్న సుప్రియ యార్లగడ్డ

‘కాంతారా’ బ్యూటీకి అవార్డు.. రుక్మిణీ వసంత్ స్పెషల్ పోస్ట్ వైరల్!

ఎల్లమ్మలో దేవిశ్రీకి జోడీ ఎవరో తెలుసా? ఆ హీరోయిన్ ఫిక్స్ అయినట్టే!

దేవికా రాణి నుంచి మోహన్‌లాల్ వరకు.. దాదాసాహెబ్ ఫాల్కే లిస్ట్ ఇదే!

బాలీవుడ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా.. వద్దు బాబోయ్ అంటున్న మెగా ఫ్యాన్స్!

Big Stories

Advertisement
×