E-Paper
Advertisement

Funky Trailer: అనుదీప్ స్టైల్లో ఆకట్టుకున్న విశ్వక్ సేన్.. ఈసారి నవ్వుల వర్షం ఖాయం..!

Funky Trailer: అనుదీప్ స్టైల్లో ఆకట్టుకున్న విశ్వక్ సేన్.. ఈసారి నవ్వుల వర్షం ఖాయం..!
Advertisement

Funky Trailer:  ఈరోజు విడుదలైన ఫంకీ సినిమా ట్రైలర్ చూస్తే మొదటి సీన్ నుంచే ఇది పూర్తిగా అనుదీప్ స్టైల్ సినిమా అని అర్థమైపోతుంది. “మీ అమ్మకి ఆపరేషన్ చేయాలి” అని డాక్టర్ అనగానే, అక్కడ ఉన్న వ్యక్తి “నాకు ఆపరేషన్ చేయడం రాదండి” అని చెప్పే సీన్‌తో ట్రైలర్ మొదలవుతుంది. ఈ ఒక్క డైలాగ్‌తోనే దర్శకుడు అనుదీప్ KV మార్క్ హ్యూమర్ ఈ సినిమా మొత్తం ఉండబోతుందని అర్థమైపోతుంది.

ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఒక ఫిల్మ్ డైరెక్టర్ పాత్రలో.. సినిమా దర్శకత్వం చేయాలనుకునే కోమలి పాత్రలో ఆయన నటించగా.. ఆ సినిమాకి నిర్మాతగా హీరోయిన్ కయాదు లోహర్ కనిపిస్తుంది. ఈ ప్రయాణంలో ఎదురయ్యే తమాషా సంఘటనలే ఈ సినిమాకు ప్రధాన బలం అని ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. ట్రైలర్ చూస్తే కథ కంటే ఎక్కువగా సిట్యుయేషన్ కామెడీ.. డైలాగ్స్ మీదే సినిమా నడుస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది.

Advertisement

ట్రైలర్ మొత్తం కూడా ఫంకీ, వెరైటీ డైలాగ్స్‌తో నిండిపోయి ఉంది. ముఖ్యంగా హీరో తల్లి ..2000 రూపాయిలో 5000 రూపాయలు చీర చూపించండి.. అని అనడం, ఆ తర్వాత “మాత వరుసగా అన్నాను” అంటే అయితే వరుసగా పడుకోండి రా.. అని చెప్పే డైలాగ్ అలానే టెన్త్ క్లాస్లో.. నువ్వు ఫస్ట్ క్లాస్ ఆ అంటే కాదు టెన్త్ క్లాస్.. అని వచ్చే డైలాగ్స్ అనుదీప్ స్టైల్‌తో ఈ సినిమా నిండిపోనుంది అని ఈ ట్రైలర్ స్పష్టంగా చూపించింది. ఇవన్నీ చూసినప్పుడు జాతి రత్నాలు ఫీల్ మళ్లీ గుర్తుకు వస్తుంది.

Advertisement

హీరోయిన్‌గా డ్రాగన్ ఫేమ్ కయాదు లోహర్ నటిస్తోంది. ఆమె పాత్ర కూడా కామెడీకి మంచి సపోర్ట్ ఇస్తుందని ట్రైలర్ చెబుతోంది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నది భీమ్స్ సిసిరోలియో, ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు మరింత ఎనర్జీ ఇచ్చింది.

ఫంకీ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ మరియు సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని శ్రీ రాములు థియేటర్ లో గ్రాండ్‌గా జరగక.. ట్రైలర్ యూట్యూబ్‌లో సాయంత్రం విడుదల అయింది.

ఫిబ్రవరి 13న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా, నవ్వులు పూయించే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

ALSO READ: Mirai Actor: మిరాయి నటుడు కన్నుమూత.. కారణమేమిటంటే..!

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×