E-Paper
Advertisement

Wet Wipes: ఈ వెట్ వైప్స్‌తో చర్మాన్ని క్లీన్ చేసుకుంటున్నారా? జాగ్రత్త, ఇవి ఒకరి ప్రాణం తీశాయ్!

Wet Wipes: ఈ వెట్ వైప్స్‌తో చర్మాన్ని క్లీన్ చేసుకుంటున్నారా? జాగ్రత్త, ఇవి ఒకరి ప్రాణం తీశాయ్!

ఈ మధ్య చాలామంది ముఖాన్ని నీటితో కడగడానికిబద్దకిస్తున్నారు. వాటికి బదులు.. సింపుల్‌గా ముఖాన్ని శుభ్రం చేసి.. డ్రై చేసే.. వెట్ వైప్స్ ఉపయోగిస్తున్నారు. పుట్టిన పిల్లలకు బేబీ వైప్స్.. పెద్దలు వివిధ రకాల వైప్స్‌ను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. అయితే, అవి ప్రాణాలను తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా యూకేలో ఓ వ్యక్తి వెట్ వైపర్స్ వల్ల ప్రాణాలు కోల్పోయాడు. పదుల సంఖ్యలో జనాలు అస్వస్థతకు గురయ్యారు. అలా ఎందుకు జరిగిందా అని ఆరా తీస్తే వెట్ వైపర్స్ ఉంటే బ్యాక్టీరియా కారణమని తెలిసింది.

వైప్స్‌లో బ్యాక్టీరియా

ఈ వెట్ వైప్స్‌లో భయానకమైన బ్యాక్టీరియాను కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. దానివల్ల యూకేలో ఒకరు చనిపోగా, 59 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. నాలుగు సంస్థలకు చెందిన ‘ఆల్కహాల్ ఫ్రీ క్లీనింగ్’ వైపర్లలో ఈ బ్యాక్టీరియాను గుర్తించారు. యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (UKHSA) మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (MHRA) సంయుక్తం దీనిపై పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ వైప్స్‌ల్లో బుర్ఖోల్డెరియా స్టెబిలిస్ (బి. స్టెబిలిస్) బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు.

మట్టిలో కనిపించే బ్యాక్టీరియా.. వైప్స్‌లో?

బుర్ఖోల్డెరియా స్టెబిలిస్ బ్యాక్టీరియా సాధారణంగా మట్టిలో, నీటిలో ఉంటుంది. సాధారణంగా ఇది అంత ప్రమాదకరమైనది కాదు. కానీ, కొంతమందికి మాత్రం తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు గురిచేస్తుంది. 2018 నుంచి ఈ ఏడాది వరకు సుమారు 59 మందిలో ఈ బ్యాక్టీరియాను గుర్తించారట. వీళ్లకు వెట్ వైప్ ఉపయోగించే అలవాటు ఉందని తెలుసుకున్నారు. నాలుగు కంపెనీలకు చెందిన వెట్ వైప్స్ నుంచే ఈ బ్యాక్టీరియా వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. ఈ ఇన్ఫెక్షన్ సోకినవారికి వెంటనే హాస్పిటల్‌లో చికిత్స అందించాలి. లేకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. కొన్ని కేసుల్లో ఈ బ్యాక్టీరియా వల్ల సెప్సిస్ ఏర్పడే ప్రమాదం ఉంది. దానివల్ల తీవ్రమైన శ్వాసకోస సమస్యలు ఏర్పడతాయి. కణాలు దెబ్బతింటాయి, చివరికి అవయవాలు ఫెయిలయ్యి.. ప్రాణాలు పోతాయి.

ప్రమాదకర వైప్స్‌ను ఎలా గుర్తించాలి?

UKHSAకు చెందిన డాక్టర్ జేమ్స్ ఎస్లాస్టాన్ ఓ యూకే మీడియా సంస్థకు తెలిపిన వివరాల ప్రకారం.. నాన్-స్టెరీల్(Non-Sterile) ఆల్కహాల్ ఫ్రీ వైప్స్‌ను ఉపయోగించకూడదు. అలాంటి ప్రొడక్ట్స్‌ను బయట విక్రయించకుండా నిలిపేయాలి. పొడిబారిన చర్మాన్ని, గాయాలను, కాలిన లేదా తెగిన ప్రాంతాల్లో ఆ వైప్స్‌తో క్లీన్ చేయొద్దు. అలా చేస్తే.. బ్యాక్టీరియా నేరుగా చర్మంలోకి వెళ్లి ఇన్ఫెక్షన్‌కు గురిచేస్తుంది.

నిషేదించిన బ్రాండ్స్ ఇవే: వైప్స్‌లో బ్యాక్టీరియాను గుర్తించిన తర్వాత నాలుగు సంస్థలకు చెందిన వైప్స్ ప్రొడక్ట్స్‌పై నిషేదం విధించారు. ValueAid Alcohol Free Cleansing Wipes, Micro safe Moist Wipe Alcohol Free, Steroplast Sterowipe Alcohol Free Cleansing Wipes, Reliwipe Alcohol Free Cleansing Wipes సంస్థలకు చెందిన వైప్స్ వాడొద్దని అధికారులు చెప్పారు. అయితే, బ్యాక్టీరియా వ్యాప్తికి ఇవే కారణమని చెప్పలేదు. కేవలం ఆయా సంస్థలు ‘Sterile’ అని పేర్కోకపోవడమే ప్రధాన కారణం. అంటే వారు పూర్తి స్థాయిలో శుభ్రం చేయకుండా వాటిని విక్రయిస్తున్నారని, దానివల్ల ఆ వైప్స్‌పై ఇంకా క్రిములు ఉంటాయని అర్థం.

Also Read: డెడ్ బాడీలనూ వదలని అమ్మాయిలు.. శవాల కొవ్వును, శరీరాల్లోకి ఎక్కించుకొని..

Related News

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

ఐటీ ఉద్యోగుల కోసం.. అదిరిపోయే ఆఫీస్ డెస్క్ వర్కవుట్స్

నరాల బలహీనతకు బై-బై! నరాలను ఇనుములా మార్చే 5 సూపర్ ఫుడ్స్..

మీ మూడ్ బాలేదా? అయితే ఈ ఫుడ్స్ తినండి

నాన్-స్టిక్ పాన్లకు గుడ్‌బై చెప్పి.. ఈ 3 రకాల పాత్రలను వాడండి!

ఏసీ గదిలో ఉంటే చర్మం పొడిబారుతోందా? ఈ చిన్న చిట్కాతో మీ చర్మాన్ని కాపాడుకోండి

బతికినంత కాలం రోగాల్లేకుండా ఉండాలా?.. ఈ అలవాట్లను మార్చుకోండి!

Big Stories

×