E-Paper
Advertisement

Funky Movie: ఖాళీ సీట్లుతో దర్శనమిస్తున్న విశ్వక్ ‘ఫంకీ’ సినిమా థియేటర్లు.. కారణం ఇదేనా!

Funky Movie: ఖాళీ సీట్లుతో దర్శనమిస్తున్న విశ్వక్ ‘ఫంకీ’ సినిమా థియేటర్లు.. కారణం ఇదేనా!
Advertisement

Funky Movie: విశ్వక్ సేన్ హీరోగా, ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో విడుదలైన ‘ఫంకీ’ (Funky) సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను ఎదుర్కొంటోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ వంటి భారీ నిర్మాణ సంస్థ నుండి వచ్చిన ఈ చిత్రంపై విడుదలకు ముందు భారీ అంచనాలే ఉన్నాయి. అయితే, థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ సినిమా తడబడుతున్నట్లు కనిపిస్తోంది. ఫిబ్రవరి 13, 2026న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మార్నింగ్ షోల నుండే ఆక్యుపెన్సీ ఆశించిన స్థాయిలో లేదు. గంటలు గడుస్తున్నా కనీసం ఒక్క థియేటర్ కూడా ‘హౌస్‌ఫుల్’ బోర్డు చూడకపోవడం చిత్ర యూనిట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. గత నెల సంక్రాంతి సీజన్‌లో ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో భారీ హిట్ అందుకున్న నిర్మాత నాగవంశీకి, ఈ సినిమా ఫలితం ఇప్పుడు సవాలుగా మారింది.

Read also-Sai Durga Tej: దర్శక ద్వయానికి మెగా హీరో గ్రీన్ సిగ్నల్.. బ్లాక్ బస్టర్ గ్యారంటీ?

ప్రేక్షకులు ముఖం చాటేయడానికి కారణాలు

Advertisement

సామాన్య ప్రేక్షకులకు సినిమా టికెట్ ధరలు భారంగా మారడం ప్రధాన కారణం. గత కొన్ని రోజులుగా టికెట్ రేట్ల పెంపుపై జరుగుతున్న చర్చలు, థియేటర్లకు వచ్చే జనాన్ని తగ్గిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం థియేటర్లలో పెద్ద సినిమాల సందడి లేకపోవడంతో, ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి అంతగా మొగ్గు చూపడం లేదు. ‘ఫంకీ’ ఒక యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ అయినప్పటికీ, దానిని వెండితెరపై చూడాలనే బలమైన కారణం ప్రేక్షకులకు కనిపించడం లేదన్నది వాస్తవం. విశ్వక్ సేన్ గత చిత్రం ‘లైలా’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడం, ఆ సినిమాపై వచ్చిన నెగటివ్ టాక్ ఇంకా జనాల్లో కొనసాగుతుండటం ‘ఫంకీ’ బుకింగ్స్‌పై ప్రభావం చూపింది. సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే తప్ప ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. కొద్ది రోజులు ఆగితే ఓటీటీలో చూసుకోవచ్చు అనే ధోరణి కూడా కలెక్షన్ల తగ్గుదలకు కారణమవుతోంది.

Read also-Ram Charan Twins: రామ్ చరణ్ దంపతులకు పుట్టిన ట్విన్స్ పేర్లు తెలుసా.. భలే ఉన్నాయి గురూ..

అనుదీప్ మార్క్ కామెడీ సరిపోలేదా?

Advertisement

అనుదీప్ సినిమాల్లో లాజిక్ కంటే కామెడీకే ప్రాధాన్యత ఉంటుంది. అయితే ‘ప్రిన్స్’ ప్లాప్ తర్వాత ఆయన నుండి వస్తున్న సినిమా కావడంతో, ప్రేక్షకులు మరింత జాగ్రత్తగా స్పందిస్తున్నారు. మౌత్ టాక్ బాగుంటే తప్ప వీకెండ్ లోపు కలెక్షన్లు పుంజుకోవడం కష్టమనిపిస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమాకు ప్రేక్షకులను రప్పించేందుకు చిత్ర యూనిట్ ఇకపై ఎలాంటి ప్రమోషన్స్ చేస్తుందో చూడాలి. వచ్చే రెండు రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు పుంజుకోకపోతే, విశ్వక్ సేన్ కెరీర్ లో మరో నిరాశ తప్పదు.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×