E-Paper
Advertisement

Vishwambhara: విశ్వంభర రిలీజ్ డేట్ పై ప్రొడ్యూసర్ క్లారిటీ..అందుకే ఆలస్యమైందా?

Vishwambhara: విశ్వంభర రిలీజ్ డేట్ పై ప్రొడ్యూసర్ క్లారిటీ..అందుకే ఆలస్యమైందా?
Advertisement

Vishwambhara: బింబిసార సినిమాతో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ వశిష్ట( Vassishta) తన రెండో సినిమా ఏకంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తో చేసే అవకాశాన్ని అందుకున్నారు. ఇలా మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట డైరెక్షన్లో విశ్వంభర(Vishwambhara) అనే సినిమాను ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ పనులు కూడా పూర్తి అయ్యాయి. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు రావలసిన ఈ సినిమా ఇప్పటివరకు విడుదల కాకపోవడంతో ఈ సినిమా విడుదల గురించి అభిమానులు కూడా ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా జూలై 9వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ సినిమా విడుదల గురించి వస్తున్నటువంటి వార్తలపై తాజాగా నిర్మాణ సంస్థతో అనుబంధం ఉన్నటువంటి వారిలో ఒకరైన అజయ్ రాజు క్లారిటీ ఇచ్చారు.

విశ్వంభర ఇప్పట్లో లేనట్టేనా..

యు.వీ నిర్మాణ సంస్థలో సంతోష్ శోభన్ హీరోగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ సినిమా ఫిబ్రవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా యువి నిర్మాణ సంస్థతో అనుబంధం ఉన్నటువంటి అజయ్ రాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయనకు విశ్వంభర సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది ఆలస్యం కావడానికి కారణాలు ఏంటి అనే ప్రశ్న ఎదురవడంతో అజయ్ మాట్లాడుతూ ఈ సినిమా మొత్తం సీజీ వర్క్ తో కూడుకున్నదని తెలిపారు. అయితే సినిమా నుంచి విడుదల చేసిన ఒక టీజర్ సిజి వర్క్ విషయంలో చాలా విమర్శలను ఎదుర్కొంది అందుకే ఈ సినిమా ఆలస్యమైందని తెలిపారు.

సీజీ వర్క్ కారణంగా ఆలస్యం..

Advertisement

ప్రస్తుతం ఈ సినిమాకు సీజీ వర్క్ జరుగుతోందని ఈసారి అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని అజయ్ రాజు ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సినిమా సమ్మర్లో విడుదల కాబోతోందా అనే ప్రశ్న ఎదురవడంతో ఈ సినిమా విడుదల గురించి నిర్మాత వంశి గారు త్వరలోనే క్లారిటీ ఇస్తారు అంటూ మాట దాటవేసారు గానీ ఈ సినిమా విడుదల గురించి సరైన స్పష్టత మాత్రం వెల్లడించలేదు. మరి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు అనుగుణంగానే ఈ సినిమాని జూలై 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతారా? లేదంటే మరింత ఆలస్యం చేస్తారా ?అనేది తెలియాల్సి ఉంది.

బాబీ సినిమాతో మెగాస్టార్ బిజీ..

Advertisement

ఇక ఈ సినిమా షూటింగ్ పనులన్నీ పూర్తి కావడంతో చిరంజీవి తన తదుపరి సినిమాలపై ఫోకస్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా మంచి విజయమైన నేపథ్యంలో తదుపరి డైరెక్టర్ బాబి డైరెక్షన్లో చిరంజీవి బిజీ కాబోతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి నెలలో పూజా కార్యక్రమాలు జరుపుకొని మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు జరుపుకోబోతుందని తెలుస్తోంది.

Also Read: Couple Friend Trailer: ఎంతమంది జీవితాలను నాశనం చేసావ్..  సంతోష్ శోభన్ కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్ రిలీజ్

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×