E-Paper
Advertisement

వామ్మో నరేష్ కొన్న కారు అన్ని కోట్లా ..!

వామ్మో నరేష్ కొన్న కారు అన్ని కోట్లా ..!

Naresh Porsche: టాలీవుడ్ సీనియర్ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న వీకే నరేశ్ సరికొత్త లగ్జరీ కార్ల కలెక్షన్‌తో వార్తల్లో నిలిచారు. తన టీనేజ్ కలని నిజం చేసుకుంటూ ఆయన అత్యంత ఖరీదైన లగ్జరీ స్పోర్ట్స్ కారును సొంతం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక వీడియోను నరేశ్ స్వయంగా తన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా అభిమానులతో పంచుకోవడంతో, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విజువల్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

మార్కెట్లో దాదాపు 2.70 కోట్లకు పైగానే

నరేశ్ కొన్న ఈ సరికొత్త ‘పోర్షే పనామెరా టర్బో జీ 3’ (Porsche Panamera Turbo G3) మోడల్ కారు విలువ మార్కెట్లో దాదాపు రూ.2.70 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. కేవలం 4.8 సెకన్లలోనే సున్నా నుండి వంద కిలోమీటర్ల టాప్ స్పీడ్‌ను అందుకోవడం ఈ స్పోర్ట్స్ కారు యొక్క ప్రత్యేకత. ఈ విలాసవంతమైన కారు తన ఇంటికి డెలివరీ అయిన క్షణాలను ఎంతో ఉత్సాహంగా షేర్ చేసిన నరేశ్, పోర్షే కారు కొనాలనేది తన చిన్ననాటి కల అని, అది ఇన్నాళ్లకు నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇది చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్నారు.

also read :మనం కనే కలల్లో 95 శాతం ఎందుకు డిలీట్ అవుతాయి? మెదడులో జరిగే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ అప్‌డేట్!

నరేశ్ ఆస్తుల విలువ కొన్ని కోట్ల రూపాయలకు పైగానే

టాలీవుడ్‌లోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ యాక్టర్స్‌గా కొనసాగుతున్న నరేశ్ ఆస్తుల విలువ కొన్ని కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ కామెంట్స్ అప్పట్లో ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారాయి. అందుకు తగ్గట్టుగానే ఆయన వద్ద ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన కోట్లాది రూపాయల విలువైన కార్లు ఉన్నాయి. వీటితో పాటు షూటింగ్స్ కోసం దాదాపు రూ.5 కోట్ల ఖర్చుతో ఒక ప్రత్యేక కారవాన్‌ను కూడా నరేశ్ స్పెషల్‌గా డిజైన్ చేయించుకోవడం విశేషం. ఆయన గ్యారేజీలో మెర్సిడెస్ బెంచ్, రేంజ్ రోవర్ వంటి టాప్ ఎండ్ లగ్జరీ వాహనాలు ఎన్నో ఉన్నాయి.

టాలీవుడ్‌లో మోస్ట్ బిజీయెస్ట్ క్యారెక్టర్ యాక్టర్‌

ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ బిజీయెస్ట్ క్యారెక్టర్ యాక్టర్‌గా దూసుకుపోతున్న నరేశ్, హీరోలకు తండ్రి పాత్రల్లో కామెడీ పండించడంలో కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ఇటీవలి కాలంలో విడుదలైన ‘సామజవరగమన’, ‘నారి నారి నడుమ మురారి’ వంటి చిత్రాల్లో ఆయన చేసిన కామెడీ టైమింగ్ థియేటర్లలో నవ్వుల పూయించింది. అలాగే ఈ 2026 ఏడాదిలో కూడా ‘బ్యూటీ’, ‘హే బల్వంత్’ వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన నరేశ్, రాబోయే రోజుల్లో మరికొన్ని భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు.మొత్తానికి  ఒకవైపు వరుస సినిమాలతో డిమాండ్ ఉన్న నటుడిగా రాణిస్తూనే, మరోవైపు తన పర్సనల్ లైఫ్‌ను కూడా ఫుల్ లగ్జరీగా ఎంజాయ్ చేస్తున్నాడన్న మాట.

also read :చిరంజీవి-విజయ్ ఫోన్ కాల్.. ఆ ఒక్క మాటతో కోలీవుడ్‌లో పెరిగిన జోష్!

Related News

వివాదాల్లో పెద్ది…రామ్ చరణ్ సినిమాపై ఈ రేంజ్ నెగెటివిటీనా?

నెట్టింట వైరల్ అవుతున్న మృణాల్ ‘ఐస్‌క్రీమ్ రైస్’.. అంతలా అడిక్ట్ అయిపోయిందా?

అర్ధరాత్రి ఆ వీడియో డిలీట్ చేయడానికి కారణం అదే….. నిజం చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ!

‘రైరై రారా’ సాంగ్‌కు థియేటర్లోనే పూనకాలు.. ‘పెద్ది’ లేడీ ఫ్యాన్ మాస్ అరాచకం!

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

Big Stories

×