E-Paper
Advertisement

తల్లి కోసం ఒక్కటయ్యే అక్కాచెల్లెళ్ళు… ఓటీటీలోకి వచ్చేసిన మరాఠీ ఫ్యామిలీ డ్రామా… ఐయండిబిలో 8.5 రేటింగ్

తల్లి కోసం ఒక్కటయ్యే అక్కాచెల్లెళ్ళు… ఓటీటీలోకి వచ్చేసిన మరాఠీ ఫ్యామిలీ డ్రామా… ఐయండిబిలో 8.5 రేటింగ్
Advertisement

Family Drama Movie on OTT : ఓటీటీలోకి ఒక మరాఠీ ఫ్యామిలీ డ్రామా స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇది ఒక చూడచక్కని మిడిల్ క్లాస్ రియలిస్టిక్ ఉమెన్ సెంట్రిక్ ఫ్యామిలీ డ్రామా సినిమా. ఎటువంటి కమర్షియల్ హంగులు, అతి లేకుండా.. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలోని ఇద్దరు అక్కాచెల్లెళ్ల మధ్య ఉండే ఇగో, చిన్ననాటి మనస్పర్థలతొ స్టోరీ తిరుగుతుంది. సినిమా మామూలుగా మొదలైనప్పటికీ, స్టోరీ ముందుకు సాగే కొద్దీ ఒక ఎమోషనల్ స్లో-బర్న్ మిస్టరీలా మారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ తో కలసి చూస్తే మరింత ఎంజాయ్ చెయ్యచ్చు ఈ సినిమాని. దీని పేరు ? ఏ ఓటీటీలోకి వచ్చింది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ మరాఠీ ఫ్యామిలీ డ్రామా మూవీ పేరు ‘తీఘీ’ (Tighee). ఇది 2026 మార్చి 6న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా థియేటర్లలో విడుదలై ప్రశంసలు పొందింది. జీజీవిషా కాలే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భారతి అచ్రేకర్, నేహా పెండ్సే బయాస్, సోనాలి కుల్కర్ణి ప్రధాన పాత్రలు పోషించారు. మే 15 నుంచి, అంటే ఈ రోజు నుంచి ఈ చిత్రం ZEE5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మధ్యతరగతి కుటుంబాలలోని ఎమోషన్స్ ను చాలా రియలిస్టిక్ గా చూపించినందుకు ఈ సినిమాకు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. నటీమణుల నటన, మిలింద్ జోగ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. దీనికి ఐయండిబిలో 8.5 రేటింగ్ ఉందంటే ఈ సినిమా ఏ పాటిదో ఇట్టే తెలుస్తోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ సినిమా కథ ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం చుట్టూ తిరుగుతుంది. కథలో ముగ్గురు మహిళలు ఉంటారు. తల్లి హేమలత (భారతి అచ్రేకర్), పెద్ద కూతురు స్వాతి (నేహా పెండ్సే), చిన్న కూతురు సారిక (సోనాలి కుల్కర్ణి). స్వాతి, సారిక ఇద్దరూ చిన్నప్పుడే మనస్పర్థల వల్ల ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా చాలా ఏళ్లుగా దూరంగా ఉంటారు. పెద్ద కూతురు స్వాతి వేరే నగరానికి వెళ్లి తన ఉద్యోగం, కెరీర్ ఒత్తిడిలో మునిగిపోతుంది. చిన్న కూతురు కూడా తన జీవితంలో బిజీగా ఉంటుంది. ఇలాంటి సమయంలో, ఊర్లో ఒంటరిగా ఉంటున్న వాళ్ళ తల్లి హేమలతకు హఠాత్తుగా తీవ్రమైన గుండె జబ్బు వస్తుంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిసి, ఇష్టం లేకపోయినా ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ తల్లి ఇంటికి తిరిగి రావాల్సి వస్తుంది.

చాలా ఏళ్ల తర్వాత ఒకే ఇంట్లో, తల్లి పక్కన చేరిన స్వాతి, సారికలకు మొదట్లో అస్సలు పడదు. చిన్నప్పటి పాత గొడవలు, ఈర్ష్యలు, కెరీర్ గురించిన ఇన్సెక్యూరిటీస్ వల్ల ఇద్దరి మధ్య మళ్లీ వాదనలు మొదలవుతాయి. అయితే తల్లి ఆరోగ్యం క్షీణిస్తున్న కొద్దీ.. ఆమెను చూసుకోవడం కోసం ఇద్దరూ కలిసి పని చేయక తప్పని పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో వారి తల్లి హేమలత గత కొన్ని సంవత్సరాలుగా ఎవరికీ చెప్పకుండా దాచిన ఒక పెద్ద కుటుంబ రహస్యం బయటపడుతుంది. దీంతో స్టోరీ మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ఆ రహస్యం ఏమిటి ? వీళ్ళ గోడవలకు దానికి లింకు ఏమిటి ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : హుండీ ఆదాయం కోసం నకిలీ దేవాలయం… ఓటీటీలో ఆకట్టుకుంటున్న మలయాళ డార్క్ కామెడీ థ్రిల్లర్

Tags

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×