E-Paper
Advertisement

చిరంజీవి-విజయ్ ఫోన్ కాల్.. ఆ ఒక్క మాటతో కోలీవుడ్‌లో పెరిగిన జోష్!

చిరంజీవి-విజయ్ ఫోన్ కాల్..  ఆ ఒక్క మాటతో కోలీవుడ్‌లో పెరిగిన జోష్!
Advertisement

Chiranjeevi Vijay: దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఇద్దరు దిగ్గజాలు.. ఒకరు వెండితెరను దశాబ్దాలుగా ఏలుతున్న ‘మెగాస్టార్’, మరొకరు ప్రజా క్షేత్రంలోకి అడుగుపెట్టి రికార్డు విజయాన్ని అందుకున్న ‘దళపతి’. తాజాగా వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఇప్పుడు సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్‌కి టాలీవుడ్ బాస్ చిరంజీవి ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయడం రాజకీయ, సినీ వర్గాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

చిరంజీవి  ఇంట్రెస్టింగ్ కామెంట్

Advertisement

ముఖ్యంగా ఈ సంభాషణలో చిరంజీవి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు.తమిళ ప్రజల ఆరాధ్య దైవం, సినీ రంగం నుండి వచ్చి రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన దివంగత నేత ఎం.జి. రామచంద్రన్ (MGR) తరహాలోనే, విజయ్ కూడా పేదల పక్షపాతిగా, ప్రజాదరణ పొందిన పాలనను అందించాలని కోరారు మెగాస్టార్ సూచనకి  అంతే గౌరవంగా  స్పందించిన సీఎం విజయ్, చిరంజీవికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. కేవలం రాజకీయాలే కాకుండా, వీరిద్దరి మధ్య సినిమాల గురించి కూడా ఆసక్తికర చర్చ సాగింది.

also read :బంగారం కొనాలంటే లక్షలు అక్కర్లేదు.. రూ.185 చాలు.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వీడియో

Advertisement

ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు విజయ్ ఆల్ ది బెస్ట్

చిరంజీవి ప్రస్తుతం ‘జన నాయగన్’ ఫేమ్ కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తన 158వ సినిమా (Mega 158) చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు విజయ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. అంతటితో ఆగకుండా, ఇటీవల విడుదలైన చిరంజీవి సెన్సేషనల్ మూవీ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాను తాను చూశానని, అందులో చిరు వింటేజ్ కామెడీ టైమింగ్, అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్ చూసి చాలా ఎంజాయ్ చేశానని విజయ్ కొనియాడటం మెగా అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది.

విజయ్ ముఖ్యమంత్రి అయ్యే వరకు

నిజానికి చిరంజీవికి, విజయ్ కుటుంబానికి మధ్య దశాబ్దాల అనుబంధం ఉంది. చిరు కెరీర్ తొలినాళ్లలో విజయ్ తండ్రి, దిగ్గజ దర్శకులు ఎస్.ఏ. చంద్రశేఖర్ దర్శకత్వంలో ‘చట్టానికి కళ్లు లేవు’ (1981), పల్లెటూరి మొనగాడు ,దేవాంతకుడు  వంటి పవర్‌ఫుల్ చిత్రాల్లో నటించారు. అప్పట్లో ఏర్పడిన ఆ స్నేహం నేడు విజయ్ ముఖ్యమంత్రి అయ్యే వరకు కొనసాగడం విశేషం.

ప్రస్తుతం ఈ ‘మెగా – దళపతి’ ముచ్చట సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. తెలుగు, తమిళ సినీ పరిశ్రమల మధ్య ఉన్న విడదీయరాని బంధానికి, పరస్పర గౌరవానికి ఈ ఫోన్ కాల్ ఒక నిలువెత్తు నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రిగా విజయ్ సంచలన నిర్ణయాలు, మరోవైపు చిరు ‘మెగా 158’ అప్డేట్స్.. వెరసి దక్షిణాది అభిమానులకు ఇదొక పెద్ద పండగలా మారింది.

also read :మనం కనే కలల్లో 95 శాతం ఎందుకు డిలీట్ అవుతాయి? మెదడులో జరిగే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ అప్‌డేట్!

Related News

‘రోమాంచకం’కు రెండో రోజే షాక్.. కలెక్షన్లు ఇలా పడిపోయాయేంటి?

డాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ.. సుమలతపై రఘు మాస్టర్ కౌంటర్!

డ్రాగన్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్…స్పీడుమీదున్న తారక్!

ఏంటి నాని.. ఇంత హైప్ అవసరమా? ‘ది ప్యారడైజ్’పై అప్పుడే డౌట్స్!

సినిమాలోనే మ్యాజిక్ ఉంది…ఆకట్టుకుంటున్న ఎపిక్ ట్రైలర్!

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

రైలులో శ్రేయా ఘోషల్‌కు పీరియడ్స్.. నాన్న చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు!

Big Stories

Advertisement
×