E-Paper
Advertisement

మనం కనే కలల్లో 95 శాతం ఎందుకు డిలీట్ అవుతాయి? మెదడులో జరిగే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ అప్‌డేట్!

మనం కనే కలల్లో 95 శాతం ఎందుకు డిలీట్ అవుతాయి? మెదడులో జరిగే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ అప్‌డేట్!
Advertisement

Dream Science: ప్రతి రోజూ రాత్రి మనం నిద్రలోకి జారుకోగానే మనకు తెలియకుండానే ఒక మాయా ప్రపంచంలోకి అడుగుపెడతాం. అదే కలల ప్రపంచం. అసలు మనం కళ్ళు మూసుకోగానే మెదడులో ఈ రంగుల లోకం ఎలా మొదలవుతుంది? పరిశోధకుల విశ్లేషణ ప్రకారం, మనం నిద్రపోతున్నప్పుడు మన మెదడు అస్సలు విశ్రాంతి తీసుకోదు, పైగా మనం మేల్కొని ఉన్నప్పటి కంటే కొన్ని సమయాల్లో అత్యంత వేగంగా, చురుకుగా పనిచేస్తుంది. దీనినే సైన్స్ భాషలో ‘రాపిడ్ ఐ మూవ్‌మెంట్’ (REM) స్టేజ్ అంటారు. ఈ దశలో మన కనుగుడ్లు రెప్పల వెనుక వేగంగా కదులుతూ ఉంటాయి. మన మెదడులోని జ్ఞాపకాల భాండాగారమైన హిప్పోకాంపస్, భావోద్వేగాలను నియంత్రించే అమిగ్డాలా అనే భాగాలు ఈ సమయంలో విపరీతమైన యాక్టివ్‌గా మారుతాయి.

మెదడు చేసే ఒక భారీ ‘డేటా ప్రాసెసింగ్’

Advertisement

అందుకే మనకు వచ్చే కలల్లో సంతోషం, భయం, ఆందోళన వంటి బలమైన ఎమోషన్స్ కనిపిస్తుంటాయి. నిజానికి కలలు అనేవి మన మెదడు చేసే ఒక భారీ ‘డేటా ప్రాసెసింగ్’ లాంటివి. రోజంతా మనం సేకరించిన సమాచారాన్ని, విన్న మాటలను, చూసిన దృశ్యాలను మెదడు చిన్న ముక్కలుగా విడగొట్టి, పాత జ్ఞాపకాలతో కలిపి ఒక కొత్త కథలా మనకు చూపిస్తుంది. అందుకే మనం ఎక్కువగా ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా ఏదైనా విషయం గురించి అతిగా ఆలోచిస్తున్నప్పుడు పీడకలలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడటానికి మెదడు చేసే ఒక సహజమైన ప్రయత్నం.

also read :బంగారం కొనాలంటే లక్షలు అక్కర్లేదు.. రూ.185 చాలు.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వీడియో

Advertisement

మరొక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే

అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా .., ఇంత కష్టపడి మెదడు సృష్టించిన కలలను మనం నిద్రలేవగానే కేవలం ఐదు నిమిషాల్లోనే మర్చిపోతాం. దీనికి మన శరీరంలోని రసాయన మార్పులే ప్రధాన కారణం. నిద్రలో మన మెదడులో జ్ఞాపకాలను స్థిరీకరించే ‘నోర్‌పినెఫ్రిన్’ అనే కెమికల్ స్థాయిలు పడిపోతాయి, దీనివల్ల కలలు మన దీర్ఘకాలిక జ్ఞాపకాల్లోకి వెళ్లవు. అంతేకాకుండా, మన మెదడు కలలను కేవలం తాత్కాలిక సమాచారంగానే పరిగణిస్తుంది కాబట్టి వాటిని సేవ్ చేయదు. ఒకవేళ మీరు కల కంటున్నప్పుడు అకస్మాత్తుగా ఎవరైనా లేపితే అది గుర్తుండే ఛాన్స్ ఉంటుంది కానీ, మళ్ళీ నిద్రలోకి జారుకుంటే ఆ సినిమా అక్కడితో ముగిసిపోతుంది.

మరొక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మన కలలో కనిపించే ముఖాలు ఏవీ కొత్తవి కావు. మన మెదడు సొంతంగా ముఖాలను సృష్టించలేదు. మీరు మీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒకచోట చూసిన వ్యక్తులనే మీ కలల్లోకి తెస్తుంది. కనీసం ఒక సెకను పాటు చూసిన ముఖాన్ని కూడా మెదడు స్టోర్ చేసుకుని కలల్లో వాడుకుంటుందన్న మాట .

ఇప్పుడు రంగుల ప్రపంచంలో ఉన్నాం కాబట్టి

పూర్వం రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఎక్కువగా ఉన్నప్పుడు, ప్రజలకు కలలు కూడా నలుపు-తెలుపులోనే వచ్చేవట. కానీ ఇప్పుడు రంగుల ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మెజారిటీ ప్రజలకు కలర్ ఫుల్ కలలే వస్తున్నాయి. ఒక సగటు మనిషి తన జీవితకాలంలో దాదాపు ఆరు సంవత్సరాల సమయాన్ని కేవలం కలలు కనడానికే కేటాయిస్తాడంటే ఈ ప్రక్రియ ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. మన మెదడు నిద్రలో మన కండరాలను తాత్కాలికంగా స్తంభింపజేస్తుంది (Sleep Paralysis), లేదంటే కలలో మనం చేసే పనులన్నీ నిజంగా మంచం మీద చేసే ప్రమాదం ఉంది.

also read :ఇంట్లో గృహిణి పడే నిశ్శబ్ద పోరాటం.. కళ్ళ చెమ్మగిల్లేలా చేస్తున్న శరణ్య ప్రదీప్ ‘నేను’!

అందుకే కలలు అనేవి కేవలం ఊహలు మాత్రమే కావు, అవి మన మెదడును రిపేర్ చేసి, మరుసటి రోజుకు మనల్ని తాజాగా సిద్ధం చేసే ఒక అద్భుతమైన జీవక్రియ. ఒకవేళ మీకు వచ్చిన కల గుర్తుండాలని అనుకుంటే, నిద్రలేవగానే అస్సలు కదలకుండా అలాగే పడుకుని ఆ విజువల్స్ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మనం చేసే చిన్న కదలిక కూడా ఆ కల తాలూకు జ్ఞాపకాన్ని తుడిచేయగలదు. అందుకే మనందరి లోపల ఒక గొప్ప ఫిల్మ్ మేకర్ దాగి ఉన్నాడని  సరదాగా చెబుతుంటారు సైంటిస్టులు.సో మనకి వచ్చే కలల వెనుక ఉన్న అసలు కథ ఇదన్న మాట.

Related News

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

Big Stories

Advertisement
×