Dharmasthala niyojakavargam Movie : దర్శకుడు జై జ్ఞానప్రభ దర్శకత్వంలో మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సుమన్, సాయికుమార్, నటరాజ్, వరుణ్ సందేశ్, వెతికా షేరు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ధర్మస్థల నియోజకవర్గం. ఈ సినిమా సెప్టెంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ (V.V. Vinayak)పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దర్శకుడు వినాయక్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. చంద్రబోస్ (Chandrabose) గారు కాల్ చేసి ఈ సినిమా గురించి నాకు చెప్పారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా డైరెక్టర్ జై జ్ఞాన ప్రభ అద్భుతమైన సినిమా చేశారని చెప్పారు. ఈ సినిమా కథ నాకు నచ్చడం వల్ల ఈ సినిమాలో పాటలు రాసినందుకుగాను తాను ఎలాంటి పారితోషికం తీసుకోకుండా అన్ని పాటలు రాశానని చంద్రబోస్ గారు చెప్పినట్లు వి. వి వినాయక్ తెలియజేశారు. ఈ సినిమా గురించి చంద్రబోస్ చెప్పిన మాటలు విన్న తర్వాత ఇదొక గొప్ప సినిమా అవుతుందని కచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయం అందిస్తుందని ఈ సినిమా ద్వారా దర్శక నిర్మాతలు హీరోకి కూడా మంచి పేరు వస్తుందని తెలిపారు.
నేను డైరెక్టర్ గా చేసిన నా మొదటి సినిమా ఆదిలో కూడా మొదటి పాట రాసింది చంద్ర బోస్ గారే. ఆది సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ధర్మస్థల నియోజకవర్గం సినిమా కూడా అంతే విజయం సాధించాలని కోరుకుంటున్నాను అంటూ వి. వి వినాయక్ ధర్మస్థల నియోజకవర్గ సినిమా గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతూ చిత్ర బృందానికి ముందస్తుగా అభినందనలు తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా లిరిక్ రైటర్ చంద్రబోస్ కూడా మాట్లాడుతూ పలు విషయాలను తెలిపారు.
లిరిక్ రైటర్ గా నాకు చాలా సంతృప్తిని సంతోషాన్ని కలిగించిన చిత్రం ధర్మస్థల నియోజక వర్గం సినిమా అని తెలిపారు. రంగస్థలం సినిమా తర్వాత అంత సంతోషంగా ఈ సినిమాకి తాను పాటలు రాశానని, ఈ సినిమాలో రాసిన ఐదు పాటలు తనకు ఎంతో సంతృప్తిని కలిగించాయి అంటూ చంద్రబోస్ మాట్లాడారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరొక నటుడు రాజీవ్ కనకాల కూడా మాట్లాడుతూ.. డైరెక్టర్ జ్ఞానప్రభ అద్భుతమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని తెలిపారు. ఈ సినిమాని యువత ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమై తెలిపారు. ప్రస్తుతం సమాజంలో డ్రగ్స్ పట్ల జరుగుతున్న, జరగబోయే విషయాలను ముందుగానే ఊహించి ఈ సినిమాలో రూపొందించారని రాజీవ్ కనకాల తెలియజేశారు. వరుణ్ సందేశ వితికా షేర్ వంటి తదితరులు కూడా ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడుతూ సినిమా పట్ల అంచనాలను పెంచేశారు. మరి ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఎలాంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాల్సింది.
Also Read: కావ్యతో రిలేషన్ కన్ఫర్మ్ చేసిన కాలభైరవ.. జీవితాంతం ఒకే ఇంట్లో అంటూ!