Anand Deverakonda:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రష్మిక మందన్న (Rashmika mandanna) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సినిమాలలో ఎంత అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో.. తన ఫ్యామిలీని అంతే ఆప్యాయంగా చూసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.. ఇకపోతే ఎప్పుడైతే విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తో ప్రేమలో పడిందో అప్పటి నుంచి ఆనంద దేవరకొండ తో ఆమె సాన్నిహిత్యం మరింత పెరిగింది అని చెప్పాలి. ఎన్నో ఈవెంట్లలో “నువ్వు నా ఫ్యామిలీ రా” అంటూ ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) తో ఆమె చెప్పిన మాటలు విజయ్ దేవరకొండ తో ఆమె రిలేషన్ ను బయటపెట్టాయి.
ఎట్టకేలకు అందరూ అనుకున్నట్టుగానే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఈ జంట చూడముచ్చటగా అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇకపోతే అన్న భార్యను ఎవరైనా సరే ‘వదిన’ అనే పిలుస్తారు. అటు ఆనంద్ దేవరకొండ కూడా అలాగే పిలుస్తారని అందరూ అనుకున్నారు . కానీ ఆయన రష్మికను వదినా అని పిలవను అని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు. మరి ఆయన మాటలు విన్న అభిమానులు.. రష్మికను వదినా అని పిలవకుండా.. మరి ఏమని పిలుస్తారు? అంటూ ప్రశ్నించగా ఈ విషయంపై కూడా ఆనంద్ దేవరకొండ స్పందించారు.
also read:ఈశ్వర్ సాయి గురించి లేఖ బయట పెట్టిన మాధురి రాథోడ్!
అసలు విషయంలోకి వెళ్తే.. బేబీ చిత్రంతో భారీ పాపులారిటీ అందుకున్న ఆనంద్ దేవరకొండ ఆ చిత్రంలో హీరోయిన్గా నటించిన వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) తో చేస్తున్న మరో చిత్రం ఎపిక్. సెప్టెంబర్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో వరుస ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక మందన్నతో బాండింగ్ పై ఆనంద్ దేవరకొండ ఇలా స్పందించారు. ” నేను రష్మికను వదిన అని పిలవాలి. కానీ రష్మిక వయసులో నాకంటే చాలా చిన్నది. అందుకే పేరుతోనే “రషీ” అని పిలుస్తుంటాను.. ఎవరూ తప్పుగా అనుకోవద్దు. రషీ చాలా పాజిటివ్, కైండ్ సోల్ అమ్మాయి. చాలా జోవియల్ గా ఉంటుంది. ఎప్పుడు అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను” అంటూ రష్మిక మందన్నతో తన రిలేషన్ గురించి బయటపెట్టి అందరిని సర్ప్రైజ్ చేశారు. ముఖ్యంగా వదిన అని పిలవక పోయినా రషీ అనే పేరు చాలా అందంగా, ముద్దుగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
బేబీ సినిమాతో బ్లాక్ బాస్టర్ విషయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా రాబోతున్న మరో కొత్త చిత్రం ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పథకాలపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆదిత్యగా ఆనంద్ దేవరకొండ ,కడలి పాత్రలో వైష్ణవి చైతన్య నటించారు. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రానికి హేషం అబ్దుల్ వహాబ్ దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు ఈ జంట.