E-Paper
Advertisement

ఒక్కసారి కాదు.. ఏకంగా 18 సార్లు లాటరీ గెలిచాడు.. అసలు అదృష్టం ఏంటో చెప్పి అందరినీ ఫిదా చేశాడు!

ఒక్కసారి కాదు.. ఏకంగా 18 సార్లు లాటరీ గెలిచాడు.. అసలు అదృష్టం ఏంటో చెప్పి అందరినీ ఫిదా చేశాడు!
Advertisement

Man Wins Lottery 18 Times: లాటరీ అంటేనే అదృష్టంతో ముడిపడిన విషయం. ఒక్కసారి లాటరీ తగిలితేనే చాలామంది జీవితాలు మారిపోతాయి. అలాంటిది ఒక వ్యక్తికి ఏకంగా 18 సార్లు లాటరీలు గెలిచాడు. ప్రపంచంలోనే అత్యంత లక్కీయెస్ట్ పర్సన్ గా గుర్తింపు పొందాడు. అతడు మరెవరో కాదు.. అమెరికాలోని ఐడహోకు చెందిన రాబర్ట్ బెవన్. ఇటీవల ఆయన ‘$1 మిలియన్ కింగ్ స్క్రాచ్’ అనే లాటరీ గేమ్‌ లో సుమారు రూ.41 లక్షలు గెలుచుకున్నారు. ఈ బహుమతిని తీసుకునేందుకు లాటరీ ఆఫీస్ కు వెళ్లినప్పుడు అధికారులు ఆయన పాత రికార్డులను పరిశీలించారు. అప్పుడే రాబర్ట్ గతంలో గెలిచిన లాటరీల  విషయం బయటపడింది.

1997లో మొదలైన అదృష్టం

రాబర్ట్‌ కు లాటరీ ద్వారా వచ్చిన అదృష్టం ఇప్పటిది కాదు. 1997లోనే ఆయన తొలిసారి ఓ పెద్ద బహుమతిని గెలుచుకున్నారు. అప్పట్లో నిర్వహించిన ప్రత్యేక ప్రమోషనల్ కార్యక్రమంలో ఆయనకు చేవ్రొలెట్ బ్లేజర్ కారు బహుమతిగా వచ్చింది. ఆ తర్వాత కూడా లాటరీ టికెట్లు కొనడం కొనసాగించారు. ఒక్కోసారి చిన్న మొత్తాలు గెలిచినా.. మరికొన్ని సందర్భాల్లో భారీ బహుమతులు కూడా ఆయన సొంతమయ్యాయి.

రూ.8.5 కోట్ల విలువైన లాటరీలు గెలుపు

Advertisement

రాబర్ట్ ఇప్పటివరకు గెలుచుకున్న బహుమతుల విలువ కోట్లల్లో ఉంది. సుమారు రూ.85 వేల నుంచి రూ.లక్షల వరకు బహుమతులు దక్కగా.. అత్యధికంగా రూ.8.5 కోట్లు విలువైన ప్రైజ్ కూడా గెలుచుకున్నడు. చిన్నా, పెద్దా బహుమతులు కలిపి మొత్తం 18 సార్లు అదృష్టం ఆయన తలుపు తట్టింది. దీంతో లాటరీ ప్రపంచంలో రాబర్ట్ పేరు ప్రత్యేకంగా నిలిచింది.

గెలుపు వెనుక సీక్రెట్ ఏంటంటే?

ఇన్ని సార్లు లాటరీ గెలవడంతో లాటరీ అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆయన గెలుపు వెనుక రహస్యం ఏంటో చెప్పాలన్నారు. దానికి రాబర్ట్‌ ఇచ్చిన సమాధానం లాటరీ డబ్బు కంటే ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షించింది. తన జీవితంలో నిజమైన అదృష్టం లాటరీ ద్వారా వచ్చిన డబ్బు కాదని.. దశాబ్దాలుగా తనకు తోడుగా ఉంటూ ప్రేమను పంచుతున్న భార్యే అసలైన అదృష్టమని చెప్పాడు. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చాలామంది నెటిజన్లు రాబర్ట్‌ ను కేవలం లక్కీ మ్యాన్‌గానే కాకుండా.. భార్యను ఇంతగా గౌరవించే వ్యక్తిగా ప్రశంసిస్తున్నారు.

సరదాగా మొదలైన అలవాటు

Advertisement

రాబర్ట్, ఆయన భార్య కలిసి సరదాగా లాటరీ టికెట్లు కొనేవారట. గ్యాస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు, కిరాణా సరుకులు కొనుగోలు చేసే సమయంలో అప్పుడప్పుడు టికెట్ తీసుకునేవారట. అలా మొదలైన చిన్న అలవాటు ఎన్నో విజయాలను తీసుకొచ్చింది. అయితే ఎన్ని సార్లు గెలిచినా డబ్బు కంటే తన భార్యే తనకు ముఖ్యమని రాబర్ట్ చెప్పడం అసలైన ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

Read Also: అందాల రాణి క్లియోపాత్రా ఎలా చనిపోయింది? ఇప్పటికీ మిస్టరీనే!

Tags

Related News

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

అజంతా To ఎల్లోరా.. 6 రోజుల క్రేజీ టూర్.. ధర మరీ ఇంత తక్కువా?

జపాన్‌కు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఢిల్లీ నుంచి ఒసాకాకు నాన్‌స్టాప్ విమానాలు!

సౌదీ అరేబియాకు వెళ్లే భారతీయులకు అలర్ట్.. అక్టోబర్ 24 వరకు ఫ్లైట్స్ క్యాన్సిల్!

ఇండియన్ పాస్‌పోర్ట్ ర్యాంక్ పెరిగింది.. కానీ, వీసా ఫ్రీ దేశాలు తగ్గాయ్!

రైలు ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. ఆఫ్‌లైన్ టిక్కెట్లకూ ఇన్సూరెన్స్.. రూ. 10 లక్షల బీమా కవరేజ్!

విమానాల్లో అగ్ని ప్రమాద ఘటనలు.. పవర్ బ్యాంకులపై DGCA నిషేధం! ఇంకా ఏంటంటే..

Big Stories

Advertisement
×