E-Paper
Advertisement

15 లక్షల బేరం … ఒక ఇండస్ట్రీ హిట్ దూరం! మెగాస్టార్ మిస్ చేసుకున్న గోల్డెన్ ఛాన్స్

15 లక్షల బేరం … ఒక ఇండస్ట్రీ హిట్ దూరం! మెగాస్టార్ మిస్ చేసుకున్న గోల్డెన్ ఛాన్స్
Advertisement

Baashha Remake: ‘బాషా’..నేనొక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే ..అన్నట్టుగా ఒక్క రూపాయి పెడితే వంద రూపాయల లాభాన్ని చూపించిన సినిమా ఇది.కానీ ఈ సినిమా చిరు చేజేతులా కాదు కాదు ..అల్లు అరవింద్ పిసినారి తనం వల్ల చిరు వదులుకున్నాడన్న సంగతి మీకు తెలుసా .. అది కూడా కేవలం 15 లక్షల బేరం కుదరక. మరింతకీ అల్లు వారు ఏం చేశారో, చిరుకి ఈ సినిమా ఎలా దక్కకుండా పోయిందో తెల్సుకుందామా !

ఎన్నో సినిమాలకి ఇదే కేరాఫ్

Advertisement

బాషా సినిమా విషయనికి వస్తే హీరో ఒక మామూలు ఆటో డ్రైవర్. కానీ నేను ఇది కాదు నా వెనుక అసలు కథ వేరే ఉంది అంటూ ఇంటర్వెల్ సీన్‌లో తన ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేస్తాడు. అదిగో అలా కామన్ మ్యాన్ గా కనిపించే వ్యక్తి వెనుక ఒక సాలిడ్ స్టోరీ ఉందన్న సంగతి రివీల్ అవడంతో మెస్మరైజ్ అయిపోయారు ఆడియన్స్. అప్పటిదాకా ఒక రకమైన సినిమాలు చూసి మొహం మొత్తేసిన ఆడియన్స్ కి బాషా సినిమా ఎడారిలో ఒయాసిస్ లా కనిపించింది .ఇంకేం 15 జనవరి 1995న రిలీజ్ అయిన ఈ సినిమాకి కాసుల వర్షం కురిపించారు ఆడియన్స్. నేనొక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే అన్న డైలాగ్ ప్రతీ ప్రేక్షకుడుకి ఊతపదం అయిపొయింది.ఇక ఇప్పుడు మనం చూసి జబ్బలు చరుచుకుంటున్న సమరసింహారెడ్డి’, ‘నరసింహానాయుడు’, ‘ఇంద్ర’, ‘సింహాద్రి’ నుంచి మొన్నటి ‘పుష్ప’, ‘కేజీఎఫ్’ వరకు ఎన్నో సినిమాలకి ఇదే కేరాఫ్ .

also read :అప్పుడు ‘ఆదిపురుష్’.. ఇప్పుడు ‘కల్కి 2’.. అదే తప్పు మళ్ళీ జరుగుతుందా?

Advertisement

అల్లు అరవింద్ 25 లక్షల దగ్గరే డీల్ క్లోజ్

ఇక అసలు విషయానికి వస్తే తమిళంలో సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాషా’ రషెస్ చూసిన నిర్మాత అల్లు అరవింద్, ఈ సినిమా కథ మన మెగాస్టార్ చిరంజీవికి సరిగ్గా సరిపోతుందని అనుకున్నారట . రజినీకాంత్, రఘువరన్ మధ్య వచ్చే ఆ పవర్ ఫుల్ సీన్లు చిరంజీవి చేస్తే బాక్సాఫీస్ షేక్ అయిపోతుందని గీతా ఆర్ట్స్ ద్వారా రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు కూడా.అయితే అప్పట్లో ‘బాషా’ తెలుగు రీమేక్ రైట్స్ కోసం తమిళ నిర్మాతలు 40 లక్షలు అడిగారట .

అయితే అల్లు అరవింద్ 25 లక్షల దగ్గరే డీల్ క్లోజ్ చేద్దామన్నాడట.కారణం అప్పటికి రజినీకాంత్‌కు మార్కెట్ ఉన్నా ఆ స్థాయిలో లేదని అల్లు వారి ఆలోచన. ఇంకేం వాళ్ళే దిగి వస్తారు అని అల్లు వారు చూడ్డటం, పెంచకపోతారా అని మేకర్స్ వెయిట్ చెయ్యడం. మొత్తానికి ఎటూ తెగేలా లేదని డిసైడ్ అయిన నిర్మాత ఆర్.ఎం. వీరప్పన్ కంటెంట్‌పై ఫుల్ కాన్ఫిడెన్స్ తో రీమేక్ రైట్స్ అమ్మకుండా డైరెక్ట్ గా సినిమాని డబ్ చేసి పెద్ద రిస్క్ నే చేశారు మేకర్స్.కానీ ఆ రిస్కే ఆ తర్వాత వాళ్లకి కాసుల వర్షం కురిపించింది.

తెలుగులో సుమారు 5 కోట్లు వసూలు

అలా 1995 జనవరి 15న ‘బాషా’ థియేటర్లలోకి వచ్చింది. అప్పటికే పోటీలో కృష్ణ గారి ‘అమ్మ దొంగ’, నాగార్జున ‘ఘరానా బుల్లోడు’ వంటి భారీ సినిమాలు ఉన్నప్పటికీ, ‘బాషా’ సునామీ ముందు ఏవీ నిలవలేకపోయాయ్.ఇక అప్పట్లోనే ఈ సినిమా తెలుగులో సుమారు 5 కోట్లు వసూలు చేసిందంటే సినిమా ఎంతటి విధ్వంసం స్ప్రుష్టించిందో అర్థమవుతుంది. ఇక తమిళ నాట అయితే ఏకంగా ఏడాదిన్నర పాటు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో రికార్డు సృష్టించింది కూడా.

పిసినారి తనం వల్ల చిరు  ఇండస్ట్రీ హిట్  మిస్

అయితే ఈ సినిమాను చిరంజీవి రీమేక్ చేసి ఉంటే, టాలీవుడ్ లెక్కలు మరోలా ఉండేవని ఇప్పటికీ బాధ పడిపోతుంటారు మెగా ఫ్యాన్స్ .అయితే ఆ లోటు భర్తీ చేద్దామంటూ  ఆ తర్వాత బాషా డైరెక్టర్ సురేష్ కృష్ణతో చిరంజీవి ‘మాస్టర్’ సినిమా చేశారు. అది కమర్షియల్ సక్సెస్ సాధించినా, ‘బాషా’ లాంటి కల్ట్ క్లాసిక్ ని మాత్రం భర్తీ చేయలేకపోయింది.మొత్తానికి అల్లు వారి 15 లక్షల పిసినారి తనం వల్ల చిరు ఒక ఇండస్ట్రీ హిట్ ని మిస్ చేసుకున్నాడన్న మాట !

also read :కోలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ సెన్సేషన్.. రజనీ-కమల్ మల్టీస్టారర్‌లో ‘సౌత్ క్వీన్’?

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×