E-Paper
Advertisement

విశ్వనాథన్ అండ్ సన్స్ విడుదల తేదీపై వెంకీ అట్లూరి క్లారిటీ.. రిలీజ్ అప్పుడేనా?

విశ్వనాథన్ అండ్ సన్స్ విడుదల తేదీపై వెంకీ అట్లూరి క్లారిటీ.. రిలీజ్ అప్పుడేనా?
Advertisement

Veera Bhadrudu pre Release: కోలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు సూర్య(Suriya) ఒకరు ఈయన తమిళ చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. సూర్య నటిస్తున్న సినిమాలన్నీ కూడా తెలుగులో విడుదలవుతాయి. ఇక్కడ మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. ఇక త్వరలోనే సూర్య నటించిన వీరభద్రుడు(Veera Bhadrudu) సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా మే 14వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

సూర్య వీరభద్రుడు..

ఆర్జె బాలాజీ డైరెక్షన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం తెలుగు తమిళ భాషలలో మే 14వ తేదీ విడుదల కానుంది. తమిళంలో కరుప్పు అనే పేరుతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది .ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదలవుతున్న నేపథ్యంలో హైదరాబాదులో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ వెంకీ అట్లూరి(Venky Atluri) కూడా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో వెంకీ అట్లూరి సూర్య గురించి వీరభద్రుడు సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

సూర్య విశ్వనాథన్ అండ్ సన్స్..

Advertisement

ఈ నేపథ్యంలోనే అభిమానులు విశ్వనాథన్ అండ్ సన్స్ (Vishwanathan and sons)సినిమా విడుదల గురించి అప్డేట్ అడగడంతో డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. మనం కూడా వద్దాం కానీ ఒక 50 రోజులు గ్యాప్ తీసుకుందాం.. కచ్చితంగా హిట్ కొడతాం అంటూ వెంకీ అట్లూరి ఈ సందర్భంగా విశ్వనాథన్ అండ్ సన్స్ సినిమా విడుదల తేదీ గురించి అప్డేట్ ఇచ్చారు. ఇలా ఈయన ఒక 50 రోజులు గ్యాప్ తీసుకుందామంటూ మాట్లాడటంతో ఈ సినిమా జూలై మూడో వారం లేదా జులై చివరి వారంలో విడుదల కాబోతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక టీజర్ వీడియో విడుదల చేయగా ఈ టీజర్ వీడియోకి ఎంతో మంచి ఆదరణ లభించింది.

ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా..

Advertisement

విశ్వనాథన్ అండ్ సన్స్ సినిమాలో సూర్యని మరో సంజయ్ రామస్వామి లాగా చూడబోతున్నాము అంటూ ఇదివరకు వెంకీ అట్లూరి తెలియజేశారు .ఇక వీరభద్రుడు సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా హీరో కార్తి కూడా ఇదే విషయం గురించి మాట్లాడుతూ అచ్చం సంజయ్ రామస్వామిని చూసినట్టే ఉందంటూ మాట్లాడటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక వీరభద్రుడు సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా గ్రామీణ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో సూర్య జోడిగా త్రిష హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి.

Also Read: అసలైన లేడీ సూపర్ స్టార్ ఆమెనే.. నేను కాదు.. శ్రీలీల కామెంట్స్ వైరల్!

Related News

రీ రిలీజ్ కి సిద్ధం అవుతున్న ‘ఉపేంద్ర’ మూవీ!

ఈ స్పీడ్ ఏంటి రవితేజా.. ఇరుముడి తర్వాత జోరు పెంచాడుగా !

67 ఏళ్లకే ప్రెగ్నెన్సీ అంటూ ట్రోలింగ్.. నీనా గుప్తా దిమ్మతిరిగే కౌంటర్!

నా భార్య నన్ను నమ్మింది… సైమా అవార్డుతో మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

సెప్టెంబర్ 18న వచ్చేస్తున్న’పిఠాపురంలో అలా మొదలైంది’!

బేబీబంప్ తో రష్మిక మందన్న…రణబాలి నుంచి స్పెషల్ వీడియో!

తారక్ నెక్ట్స్ సినిమాలు ఇవేనా.. ఒక్కొక్కటి మామూలు కాంబో కాదుగా !

సూరితో పోటీగా సుహాస్ క్రేజ్.. తమిళనాట మండాడి హంగామా!

Big Stories

Advertisement
×