E-Paper
Advertisement

Suspens Thriller OTT : దృశ్యం సినిమాను తలపించే తమిళ మూవీ… కూతురు లాంటి అమ్మాయితోనే ఆ పని… మతిపోగోట్టే సస్పెన్స్

Suspens Thriller OTT : దృశ్యం సినిమాను తలపించే తమిళ మూవీ… కూతురు లాంటి అమ్మాయితోనే ఆ పని… మతిపోగోట్టే సస్పెన్స్
Advertisement

Suspens Thriller OTT : సస్పెన్స్ థ్రిల్లర్‌లకు ఈ రోజుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు, సిరీస్‌లు విడుదలవుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా దృశ్యం సినిమాను తలపిస్తుంది. కథ క్రమంగా మిస్సింగ్ అయ్యే అమ్మాయిల చుట్టూ తిరుగుతుంది. ఊహించని ట్విస్ట్లు ఉంటాయి ఇందులో. ఇది 69వ ఫిల్మ్‌ఫేర్ లో ఏడు అవార్డులను కూడా గెలుచుకుంది. మరి ఈ కథలో ఎంతగా ఏముంది ? ఈ సినిమాను ఎక్కడ చూడచ్చు అనే వివరాల్లోకి వెళ్తే …

ఈ సినిమాను ఎక్కడ చూడచ్చు అంటే

ఈ తమిళ సస్పెన్స్ థ్రిల్లర్‌ సినిమా పేరు ‘చిత్త’ (Chithha). ఏషియన్ మూవీస్, ఈటాకీ ఎంట‌ర్‌టైన‌మెంట్స్ బ్యానర్‌పై సిద్ధార్థ్ నిర్మించిన ఈ సినిమాకు ఎస్‌.యూ. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. సిద్ధార్థ్, నిమిషా సజయన్, అంజలీ నాయర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో 2023 సెప్టెంబర్ 28న విడుదల చేశారు. అయితే తెలుగులో ఈ సినిమాను అక్టోబర్‌ 06న తెలుగులో విడుదల చేశారు. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ ఫామ్ జియో హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. ₹5 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం 13 కోట్లు వసూలు చేసింది. IMDbలో 8.2 రేటింగ్ తో ఇది టాప్ థ్రిల్లర్‌గా నిలిచింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈశ్వర్ (సిద్ధార్థ్) ను అందరూ ప్రేమగా ‘చిన్నా'(Chithha) అని పిలుస్తారు. తన అన్న చనిపోవడంతో, తన వదినను, తన మేనకోడలు సుందరిని తనే చూసుకుంటూ ఉంటాడు. సుందరి అంటే చిన్నాకు చాలా ఇష్టం, ఆ పాప కోసం ఏదైనా చేస్తాడు. వాళ్ళ జీవితం సంతోషంగా సాగుతున్న సమయంలో, అనుకోకుండా ఒక రోజు సుందరి కిడ్నాప్ అవుతుంది. దీంతో చిన్నా ప్రపంచం తల్లకిందులవుతుంది. పోలీసులు ప్రయత్నించినా సుందరి ఆచూకీ దొరక్కపోవడంతో, చిన్నానే స్వయంగా తన మేనకోడలిని వెతకడానికి బయలుదేరుతాడు.

ఈ ప్రయాణంలో అతను సమాజంలో పిల్లల పట్ల జరిగే కొన్ని దారుణాలను చూస్తాడు. ఒక తండ్రిలాంటి బాబాయ్ పడే ఆవేదనను ఈ సినిమా గుండెను పిండేటట్లు చూపిస్తుంది. చివరికి ఆ దారుణానికి పాల్పడిన వ్యక్తిని చిన్నా ఎలా పట్టుకున్నాడు ? తన మేనకోడలిని క్షేమంగా ఎలా కాపాడుకున్నాడు ? అనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Advertisement

Read Also : దెయ్యంతో డీల్ మాట్లాడే తండ్రి… చెలరేగిపోయే పిశాచి…కూతురి ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ హారర్

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×