E-Paper
Advertisement

Akhanda 2 : ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా లాగా, బాలకృష్ణ అభిమానులు డబ్బులు ఇస్తే బాగుంటుంది

Akhanda 2 : ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా లాగా, బాలకృష్ణ అభిమానులు డబ్బులు ఇస్తే బాగుంటుంది
Advertisement

Akhanda 2 : బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన సినిమా అఖండ 2. కొద్దిసేపట్లో ప్రీమియర్ షోస్ మొదలవుతాయి అనుకునే టైంలో అన్ని షోలు క్యాన్సిల్ అయిపోయాయి. దీనికి కారణం సినిమాకి ఉన్న లావాదేవీలు. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన నేనొక్కడినే సినిమా ఊహించిన సాయి సక్సెస్ సాధించలేకపోయింది. అలానే శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆగడు సినిమా కూడా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఈ రెండు సినిమాలను 14 రీల్స్ సంస్థ నిర్మించింది.

ఈ రెండు సినిమాలకి కూడా యారోస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ తో పాటు కొంత ఫైనాన్సియల్ సపోర్ట్ ఇచ్చింది. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడం వలన యారోస్ ఎంటర్టైన్మెంట్ సంస్థకు విపరీతమైన నష్టాలు వచ్చాయి. అయితే అవి 14 రీల్స్ సంస్థ వలన వచ్చిన సమస్యలు కాబట్టి వీళ్లు అఖండ 2 సినిమా విడుదలను కాకుండా కోర్టు నుంచి స్టే తీసుకొచ్చారు.

ఆంధ్ర కింగ్ తాలూకా రిపీట్ అవుద్దా?

Advertisement

కొద్దిసేపట్లో ప్రీమియర్ షోలు పడతాయి అనుకునే తరుణంలో దాదాపు 50 కోట్ల వరకు లావాదేవీలు క్లియర్ చేస్తే గాని ఆ షోలు పడవు అని ఒక టాపిక్ నడుస్తుంది. అయితే ఆంధ్ర కింగ్ తాలుక సినిమా లాగా నిజ జీవితంలో ఎవరైనా బాలకృష్ణ అభిమానులు వాటిని క్లియర్ చేసి బాలకృష్ణ సినిమా రిలీజ్ ఆగిపోకుండా చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన చాలామందికి మొదలవుతుంది.

అయితే అలాంటివన్నీ కూడా కేవలం సినిమాల్లో మాత్రమే జరుగుతాయి. అయితే దీనివలన పెద్దగా హీరోకు వచ్చిన నష్టం ఏమీ లేదు. కేవలం సినిమా రిలీజ్ ఆగిపోవడం వలన నిర్మాతలు విపరీతంగా నష్టపోవాల్సిన పరిస్థితి.

Advertisement

ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో తన అభిమాన హీరో సినిమా కేవలం మూడు కోట్లు వలన ఆగిపోతుంది కాబట్టి అభిమాని వాటిని కడతాడు. ఇప్పుడు అలా బాలకృష్ణ కోసం ఎవరైనా సినిమా రిలీజ్ ఆగిపోకుండా ఆదుకుంటారా?

కలెక్షన్లు ఖాయం 

మరోవైపు ఈ సినిమా రిలీజ్ అయితే అద్భుతమైన కలెక్షన్లో రావడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలేవి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ కాలేదు. అంతేకాకుండా ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తుంది అని విపరీతమైన నమ్మకాలు కూడా చాలామందికి ఉన్నాయి. బాలకృష్ణ కెరియర్ లో అత్యధిక కలెక్షన్లు ఈ సినిమా రాబడుతుంది అనేది విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read: Akhanda 2 : అఖండ సినిమా ఆగిపోవడం వెనక బ్యాక్ స్టోరీ, మహేష్ బాబు ఆ రెండు సినిమాలే కారణం

Related News

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

Big Stories

Advertisement
×