Akhanda 2 : బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 సినిమా కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది అనుకునే తరుణంలో కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. కాసేపట్లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేస్తారు అని అందరూ ఊహించరు. కానీ ఎవరి ఊహకు అందని విధంగా సినిమా ప్రీమియర్ షోలను కంప్లీట్ గా క్యాన్సిల్ చేశారు. అసలు ఈ షోలు క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఏంటంటే మహేష్ బాబు సినిమాలు తీసుకొచ్చిన నష్టాలు.
సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సినిమా వన్ నేనొక్కడినే. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా తీవ్రమైన నష్టాలను తీసుకువచ్చింది. ఈ సినిమాకు ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ మరియు ఫైనాన్సింగ్ లో హెల్ప్ చేసింది. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్. ఆ సినిమా ఫీల్ అవ్వడంతో ఆ సినిమాకు విపరీతమైన నష్టాలు వచ్చాయి. అప్పట్లో ఈ రెండు సంస్థల మధ్య రెవెన్యూ షేరింగ్, సెటిల్‌మెంట్ విషయంలో భారీ తగదాలు వచ్చాయి.
నేనొక్కడినే సినిమాకు వచ్చిన నష్టాలను పూడ్చడానికి శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆగడు సినిమాను కూడా ఇచ్చారు. ఆ నష్టాలు కవర్ చేస్తుంది అని అందరూ ఊహించుకున్నారు. ఆ నష్టాలు బ్యాలెన్స్ అవుతాయి అని ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఆగడు సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. రెండు సినిమాల విషయంలో యారోస్ ఎంటర్టైన్మెంట్ సంస్థకు ఊహించిన స్థాయిలో డబ్బులు రికవరీ కాలేదు.
ఈ క్రమంలో యారోస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ 14 వీల్స్ సంస్థ పైన ఆర్బిట్రేషన్ కేసు వేసింది. 14 రీల్స్ సంస్థ యారోస్ ఎంటర్టై 27–28 కోట్ల వరకు డ్యూస్ చెల్లించాలి. ఇవి పూర్తిగా చెల్లించకపోవడం వలన వడ్డీలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. డబ్బు చెల్లించకుండా 14 Reels “14 Reels Plus” అనే కొత్త కంపెనీ పేరుతో సినిమాలు రిలీజ్ చేయడం మొదలు పెట్టింది.
డ్యూస్ ఇచ్చే కంపెనీ పేర్లను మార్చి సినిమాలు రిలీజ్ చేస్తూ, డబ్బు ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని కంప్లైంట్ ఇవ్వడంతో మద్రాస్ హైకోర్టు అఖండ 2 మీద స్టే విధించింది.
అయితే ఈ విషయాలు ఏవి బయటకు చెప్పకుండా కేవలం టెక్నికల్ ఇష్యూస్ వల్లనే సినిమా ఆగిపోయింది అంటూ ప్రచారం జరుగుతుంది. మొత్తానికి ఈ లావాదేవీలు పూర్తి అయిన తరువాతే సినిమా విడుదల అవ్వడం జరుగుతుంది.
Also Read: SPIRIT : సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాకి బ్రేక్, జపాన్ వెళ్తున్న ప్రభాస్