E-Paper
Advertisement

OTT Movie : గర్ల్ ఫ్రెండ్ ఉండగానే మరో అమ్మాయితో… వద్దు వద్దంటూనే ముద్దు… ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీతో సింగిల్స్ కు పండగే

OTT Movie : గర్ల్ ఫ్రెండ్ ఉండగానే మరో అమ్మాయితో… వద్దు వద్దంటూనే ముద్దు… ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీతో సింగిల్స్ కు పండగే
Advertisement

OTT Movie : కొన్ని సినిమాలు, సిరీస్ లను ఒక్కసారి మొదలెడితే ఆపలేము. చూసేకొద్ది చూడాలనిపిస్తుంటుంది. ఇక ట్రయాంగిల్ లవ్ స్టోరీల గురించి చెప్పనవసరమే లేదు. ఈ కంటెంట్ ని చూడటానికి ఆడియన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఒక హిందీ వెబ్ సిరీస్ రొమాంటిక్ రివేంజ్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ని అలరించింది. రెండు సీజన్లతో ఈ సిరీస్ ట్రయాంగిల్ లవ్ తో కేక పెట్టిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే, ఇందులో ఒక అమ్మాయి పిచ్చి ప్రేమ వల్ల హీరో లైఫ్ నరకం అవుతుంది. చివరికి రివెంజ్ తీర్చుకున్నా ఏమీ మిగలదు. ఈ సిరీస్ రెండు సీజన్లతో ఓటీటీలో  స్ట్రీమింగ్ అవుతుంది ? దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

2022లో వచ్చిన ఈ హిందీ రొమాంటిక్ డార్క్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘యే కాలీ కాలీ అంఖైన్’.  సిద్ధార్థ్ సేన్‌గుప్తా దర్శకత్వంలో ఇది రూపొందింది.
ఇందులో తాహిర్ రాజ్ భసిన్, శ్వేతా త్రిపాఠి శర్మ, ఆన్‌చల్ సింగ్, సౌరభ్ శుక్లా లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సిరీస్ సీజన్ 1 (8 ఎపిసోడ్స్) 2022 జనవరి 14న, సీజన్ 2 (8 ఎపిసోడ్స్) 2024 నవంబర్ 14న నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఐయండిబిలో 7.0/10 రేటింగ్ పొందింది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

విక్రాంత్ అనే మిడిల్ క్లాస్ యువకుడు సింపుల్ లైఫ్ స్టైల్ తో జీవిస్తుంటాడు. చాలా హ్యాండ్సమ్ గా కూడా ఉంటాడు. అతను శిఖా గుప్తా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా ప్లాన్ చేస్తారు. కానీ కాలేజీ టైంలో విక్రాంత్‌ని ఒక్కసారి చూసిన పూర్వా అతని మీద పిచ్చి ప్రేమలో పడుతుంది. పూర్వా తండ్రి అఖిలేష్ అహ్లావత్ ఉత్తరప్రదేశ్‌లో బలమైన పాలిటీషియన్. ఆమె కాస్త రెబల్ టైప్. అతను వద్దంటున్నా నువ్వే ముద్దంటూ తిరుగుతుంది. ఎంతకీ విక్రాంత్ లొంగక పోయేసరికి తన ఫాదర్ పవర్ యూజ్ చేసి విక్రాంత్ లైఫ్‌ని ఇబ్బందుల్లో పెడుతుంది. శిఖా ఫాదర్ జాబ్ పోగొట్టిస్తుంది, బ్లాక్‌మెయిల్ చేస్తుంది, బెదిరిస్తుంది. విక్రాంత్ శిఖాని వదిలేసి తనని పెళ్లి చేసుకుంటేనే శిఖా సేఫ్ అని బెదిరిస్తుంది. విక్రాంత్ ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ పూర్వా గూండాలు శిఖాని కిడ్నాప్ చేస్తారు. ఫైనలీ విక్రాంత్ పూర్వాని పెళ్లి చేసుకుంటాడు. అయితే సీజన్ 1 ఎండింగ్ లో పెళ్లి రోజు విక్రాంత్ పూర్వాని గన్ తో షూట్ చేస్తాడు. రక్తపు మరకలతో ఈ సీజన్ షాకింగ్ ట్విస్ట్ ఇస్తుంది.

Read Also : ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కు వెళ్తే అరాచకం… ఆ ఒక్క మందుతో మనిషి మృగంలా.. మతిపోగొట్టే మూవీ మావా

Advertisement

సీజన్ 2లో పూర్వా బతికే ఉంటుంది. అయితే ఆమె కోమాలోకి వెళ్తుంది. విక్రాంత్ ఇప్పుడు పూర్వా హస్బెండ్‌గా, ఆమె ఫాదర్ పాలిటికల్ పవర్‌లో భాగమైపోతాడు. శిఖా కోమాలో నుంచి బయటపడి విక్రాంత్‌ పై రివెంజ్ తీర్చుకోవడానికి ప్లాన్ వేస్తుంది. పూర్వా ఇప్పుడు మరీ డేంజరస్, సైకోపాతిక్‌గా మారిపోతుంది. ఈ సమయంలో విక్రాంత్ శిఖాతో మళ్ళీ కలవడానికి ట్రై చేస్తాడు కానీ పూర్వా గూండాలు, పాలిటికల్ గేమ్స్ అడ్డుపడతాయి. చివరి ఎపిసోడ్‌లో పూర్వా మళ్లీ విక్రాంత్‌ తో ఫైట్ చేస్తుంది. షాకింగ్ ట్విస్ట్ ఏమిటంటే విక్రాంత్ పూర్వాని మళ్లీ చంపేస్తాడు. ఈ సారి పూర్వా నిజంగానే చనిపోతుందా ?  శిఖా ఎలాంటి లైఫ్ ఎంచుకుంటుంది.  విక్రాంత్ ఎవరితో జీవిస్తాడు ? ఈ క్లైమాక్స్ ఎలా ఉంటుంది ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తలుసుకోండి.

 

 

 

 

 

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×