Film industry:నవీన్ పోలిశెట్టి (Naveen Polisetty).. జాతిరత్నాలు సినిమాలో అద్భుతమైన కామెడీ కనబరిచి ప్రేక్షకులలో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న ఈయన.. ఆ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత ఆక్సిడెంట్ కావడంతో కొంతకాలం ఇంటికే పరిమితమైన నవీన్.. ఏడాదికి పైగా విరామం తీసుకొని ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జనవరి 14వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదల కాబోతోంది.
నవీన్ పోలిశెట్టి హీరోగా వస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. కామెడీ రొమాంటిక్ థ్రిల్లర్ జానర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన ట్రైలర్ చూస్తుంటే ఇందులో నవీన్ పోలిశెట్టి కామెడీ మార్క్ కనిపించడం లేదనే వార్తలు వ్యక్తం అవుతున్నాయి. విషయంలోకి వెళ్తే.. నిర్మాత నాగ వంశీ ఎప్పటిలాగే ఈ సినిమా ప్రమోషన్స్లో తన స్టైల్ చూపిస్తున్నాడు. కానీ నవీన్ పోలిశెట్టి మార్క్ కామెడీ మాత్రం ఈ సినిమాలో లేనట్టు తెలుస్తోంది. కారణం ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ లో అంతా రొటీన్ కామెడీ కనిపించడమే..
ముఖ్యంగా జాతిరత్నాలు లాంటి సినిమాలో నవీన్ ని చూశాక ఇప్పుడు అలాంటి హీరోని ఇలాంటి కథలో చూడడానికి బహుశా సెట్ అవ్వకపోవచ్చు అనే విధంగా ట్రైలర్ చూసిన తర్వాత కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా కామెడీ డైలాగ్స్, రైటింగ్ కూడా కాస్త డల్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ సినిమాలో పోలిశెట్టి కామెడీ మార్క్ సినిమాలో ఉంటే కొంతవరకు సేఫ్ అవ్వొచ్చు. ఒకవేళ అలా లేకుంటే మాత్రం సినిమాపై భారీ ఎఫెక్ట్ పడే అవకాశాలు కూడా లేకపోలేదు.
also read:MSVPG Movie: చిరు రూట్ మార్చడానికే ఈ సినిమా… అయితే అనిల్ మార్క్ ఉండదా?
ఇకపోతే మరోవైపు ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 30 కోట్ల వరకు ఉంటుంది. అందులో నాన్ థియేట్రికల్ రైట్స్ (ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్) వల్ల సుమారుగా 25 కోట్ల వరకు వచ్చింది. థియేట్రికల్ రైట్స్ వల్ల మిగతా 5 కోట్లు కూడా వచ్చేస్తాయి. అయితే కమర్షియల్ గా ఈ సినిమాకు ఎటువంటి డోకా లేదు. కానీ కథ పరంగా ప్రేక్షకులను మెప్పించ లేకపోతే మాత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటుంది అనడంలో సందేహం లేదు. కమర్షియల్ గా సక్సెస్ అయినా కథపరంగా సక్సెస్ కాకపోతే మాత్రం అభిమానులు పూర్తిస్థాయిలో నిరాశ చెందుతారు. మరి ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. మొత్తానికైతే కమర్షియల్ గా ఈ మూవీకి పర్లేదు కానీ టాక్ పరిస్థితి ఏంటి అన్నదే ప్రశ్నార్ధకంగా మారింది.