E-Paper
Advertisement

Redmi Soundbar 2 Pro: బడ్జెట్‌లోనే వైర్‌లెస్ సబ్‌వూఫర్‌తో రెడ్‌మి సౌండ్‌బార్ 2 ప్రో.. ధర, ఆధునిక ఫీచర్ల వివరాలివే!

Redmi Soundbar 2 Pro: బడ్జెట్‌లోనే వైర్‌లెస్ సబ్‌వూఫర్‌తో రెడ్‌మి సౌండ్‌బార్ 2 ప్రో.. ధర, ఆధునిక ఫీచర్ల వివరాలివే!
Advertisement

Redmi Soundbar 2 Pro: ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ షియోమీ నుంచి Redmi Soundbar 2 Pro విడుదలైంది. అద్భుతమైన సౌండ్ క్వాలిటీ స్పీకర్స్‌ను కలిగి ఉన్న ఈ సౌండ్ సిస్టమ్‌ను పుట్టినరోజు వేడుకలు, ప్రైవేట్ పార్టీలు లేదా పండగలకు కూడా ఉపయోగించుకోవచ్చు. తాజాగా చైనా మార్కెట్‌లోకి వచ్చిన ఈ రెడ్‌మీ సౌండ్‌బార్ స్పీకర్ 2 ప్రో వినియోగదారుల్లో ఆసక్తిని పెంచింది.

ప్రీమియం అనుభూతి:

Redmi Soundbar 2 Pro సిస్టమ్.. వైర్‌లెస్ సబ్ వూఫర్‌తో లభిస్తుంది. మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ సౌండ్‌బార్ RGB లైటింగ్ వంటి విజువల్ ఫీచర్లను కలిగి ఉంది. షియోమీ సంస్థ ఈ స్పీకర్‌ను ప్రత్యేకంగా కాంపాక్ట్ స్పేస్‌లు, డెస్క్ సెటప్‌లు, హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే రూపొందించినట్లు తెలుస్తోంది.

Advertisement

Also Read: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలా? జనవరిలో మోస్ట్ ట్రెండ్ అవుతున్న ఆండ్రాయిడ్ మొబైల్స్ లిస్ట్ ఇదే!

ధర వివరాలు(అంచనా):

ఈ రెడ్‌మీ సౌండ్‌బార్ 2 ప్రోలో రెండు స్పీకర్లు, రెండు పాసివ్ రేడియేటర్‌లను అమర్చారు. అలాగే ఈ సౌండ్ సిస్టమ్ కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.3కి సపోర్ట్ ఇస్తుంది. Redmi Soundbar 2 Proలో ప్రధాన సౌండ్‌బార్ యూనిట్‌లో వైర్‌లెస్ సబ్‌ వూఫర్‌ను ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఈ సబ్‌వూఫర్‌కు ప్రత్యేక పవర్ సోర్స్ అవసరం అయినప్పటికీ.. వైర్‌లెస్ కనెక్షన్ దానిని గదిలోని ఏ మూలన అయినా సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక ధర విషయానికి వస్తే.. ఈ సౌండ్‌బార్ సుమారు రూ.6,500గా నిర్ణయించారు. అయితే దీనిని ఇంకా గ్లోబల్ లేదా భారత్‌లో విడుదల చేయలేదు.

ప్రత్యేక ఫీచర్లు:

Advertisement

అద్భుతమైన సౌండ్ క్వాలిటీతో వచ్చిన ఈ సౌండ్‌బార్‌లో రెండు స్పీకర్లు, రెండు పాసివ్ రేడియేటర్‌లతో సహా 4 డ్రైవర్లు కూడా ఉన్నాయి. వీటిని 53-డిగ్రీల కోణంలో ట్యూన్ చేశారు. వైర్‌లెస్ సబ్‌ వూఫర్ 96mm డ్రైవర్‌ను కలిగి ఉండగా.. 60Hz వరకు బాస్ ఫ్రీక్వెన్సీలను అందించగలదని కంపెనీ చెబుతోంది. ఈ Redmi Soundbar 2 Pro ముఖ్య లక్షణం RGB లైటింగ్ సిస్టమే. ఇకపోతే కనెక్టివిటీ కోసం.. ఈ సౌండ్‌బార్ సిస్టమ్‌ బ్లూటూత్ 5.3కి మద్దతు ఇస్తుంది. అలాగే USB పోర్ట్, హెడ్‌ఫోన్ జాక్‌ను సైతం కలిగి ఉంటుంది.

Also Read: యాపిల్ iOS 26.3ను ఎప్పుడు రిలీజ్ చేస్తుంది? ఏయే ఐఫోన్లకు సపోర్ట్ ఇస్తుంది? పూర్తి వివరాలు ఇవిగో!

 

 

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×