MSVPG Movie:అనిల్ రావిపూడి (Anil Ravipudi).. చేసింది తక్కువ సినిమాలే అయినా తన సినిమాలతో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. అనిల్ రావిపూడి అంటే… ఫ్యామిలీ ఆడియన్స్ డైరెక్టర్ అని… అసలైన ఫ్యామిలీ మ్యాన్ అని అందరి చేత నిరూపించుకున్నారు. అలాంటి ఈయన ప్రస్తుతం చిరంజీవి(Chiranjeevi)తో ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) కూడా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా సాధారణంగా అనిల్ రావిపూడి సినిమా విడుదలవుతోంది అంటే ఆయన తన సినిమా ఇలా ఉంటుందని, ఆయన మార్క్ ఉంటుందని అందరూ అంచనాలు పెట్టుకుంటారు. కానీ, ఈ సినిమాలో ఆయన మార్క్ ఎక్కడా కనిపించదని తెలుస్తుంది.
దీనికి తోడు లేడీ సూపర్ స్టార్ నయనతారతో ప్రమోషన్ వీడియో అంటూ ఒక వీడియో చేయించారు. అందులో మీరు ప్రమోషన్ కి రావడమే గొప్ప అంటూ ఆ ఒక్క వీడియోతో సరిపెట్టుకున్నారు అనిల్ రావిపూడి. కానీ ఇప్పటివరకు తనదైన మార్క్ ప్రమోషన్స్ కనిపించలేదు. దీనికి తోడు అటు తెలంగాణలో ఈ సినిమాకి ప్రీమియర్స్ షో వేయడానికి అనుమతి లభించింది. పైగా ఒక్కో టికెట్ ధర 600 పెంచుకునే అవకాశం కల్పించారు. ఇక అంతా బాగానే ఉన్నా సినిమాపై సీరియల్ అంటూ ట్రోల్స్ వస్తూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా అనిల్ రావిపూడి సినీ కెరియర్లో తన సినిమాకు ఇలాంటి ట్రోల్స్ రావడం ఇదే మొదటిసారి.
దీన్ని బట్టి చూస్తే ఈ సినిమాలో అనిల్ మార్కు లేదా? కేవలం ఆయన చిరంజీవి కోసమే ఈ సినిమా చేస్తున్నాడా? తన స్టైల్ ఆఫ్ మేకింగ్ ను పక్కనపెట్టి చిరంజీవిని ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేయాలని ఈ సినిమా చేస్తున్నాడా? అనే అనుమానాలు కూడా అటు నెటిజన్స్ లో వ్యక్తం అవుతున్నాయి. నిజానికి అనిల్ రావిపూడి సినిమాలు అంటే పక్కా కామెడీ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా మనకు కనిపిస్తుంది. అనిల్ రావిపూడి “కామెడీ కింగ్” అనే బిరుదు కూడా సొంతం చేసుకున్నారు. అలాంటి ఈయన కామెడీ ఎంటర్టైనర్ గా చిరంజీవితో మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా చేస్తున్నప్పటికీ అందులో అనిల్ రావిపూడి మార్క్ కనిపించకపోవడం ఏదో వెలితిగా అనిపిస్తోంది.
also read:Toxic Glimpse: కార్ సీన్ పై నెటిజన్స్ పెదవి విరుపు.. డైరెక్టర్ దిమ్మతిరిగే క్లారిటీ!
ఇదిలా ఉండగా.. వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేసినప్పుడు ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలుగా ఉన్న నాగార్జున, వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణ నలుగురితో సినిమాలు చేయడం నా ధ్యేయమని చెప్పారు. అందులో భాగంగానే ఇప్పటికే బాలకృష్ణ, వెంకటేష్ లతో సినిమా చేశారు. ఇప్పుడు చిరంజీవితో సినిమా చేస్తున్నారు. ముఖ్యంగా తన కోరికను నెరవేర్చుకోవడానికి ఈ సినిమా చేస్తున్నారా? అనే కోణంలో కూడా నెటిజన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉండడం గమనార్హం.
ఏది ఏమైనా అనిల్ రావిపూడి సినిమా సంక్రాంతికి వస్తోంది అంటే బ్లాక్ బాస్టర్ అని అందరూ ఫిక్స్ అవుతారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా ట్రోల్స్ ఎదుర్కొంటుంది. మరి ఈ సినిమా ఫలితం ఎవరికి ఆపాదిస్తారు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి అనిల్ రావిపూడి మార్క్ కనిపించని ఈ సినిమా సంక్రాంతి బరిలో అసలు సక్సెస్ అవుతుందా? లేదా? అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.