E-Paper
Advertisement

Ustaad Bhagat Singh : సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ, మరి ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఏంటి?

Ustaad Bhagat Singh : సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ, మరి ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఏంటి?
Advertisement

Ustaad Bhagat Singh: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న టాప్ హీరోయిన్స్ లో శ్రీ లీల ఒకరు. కొంతమందికి సరైన హిట్ సినిమాలు పడకపోయినా కూడా అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఇంకొంతమందికి మాత్రం మొదటి సినిమా సూపర్ హిట్ అయినా కూడా అవకాశాలు రావడం అనేది జరగదు. ఉపన సినిమాతో అద్భుతమైన సక్సెస్ అందుకుంది కృతి శెట్టి. కానీ కృతికి ఊహించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.

పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శ్రీ లీల. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. కానీ శ్రీ లీల కు వరుసగా అవకాశాలు వచ్చాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి సినిమా హీరోల సరసన కూడా నటిస్తుంది. శ్రీ లీల కు మంచి క్రేజ్ ఉంది అనే మాట వాస్తవమే. కానీ ఆవిడకు హిట్ సినిమాలు కంటే ఫెయిల్ అయిన సినిమాలే ఎక్కువ ఉన్నాయి.

ఫెయిల్ అయిన సినిమాలే ఎక్కువ 

Advertisement

శ్రీ లీల ఎంట్రీ ఇచ్చిన పెళ్లి సందడి సినిమా ఊహించిన స్థాయి సక్సెస్ అందుకోలేదు. అయితే ఇప్పటికీ శ్రీ లీలా కెరియర్ లో చెప్పుకోదగ్గ హిట్ సినిమా అంటే ధమాకా అని చెప్పాలి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసింది. రవితేజ ఎనర్జీ తో పాటు, శ్రీ లీలా డాన్స్ పర్ఫామెన్స్ ఈ సినిమాకి మంచి ప్లస్ అయ్యాయి.

రవితేజ సరసన రీసెంట్ గా నటించిన మాస్ జాతర సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. గుంటూరు కారం,ధమాకా సినిమాలు మినహాయిస్తే శ్రీలీలా చేసిన సినిమాలేవి పెద్దగా తెలుగులో వర్కౌట్ కాలేదు.

ఉస్తాద్ భగత్ సింగ్ ఏమవుతుంది 

Advertisement

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. అందుకే ఈ సినిమా మీద భారీ అంచనాలు.

ఈ సినిమాలో శ్రీ లీల నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాతో ఈవిడకి సక్సెస్ వస్తుంది అని చాలామంది నమ్ముతున్నారు. అప్పట్లో వరుస ప్లాప్స్ లో ఉన్న శృతిహాసన్ కు గబ్బర్ సింగ్ సినిమాతో మంచి సక్సెస్ లభించింది. ఇప్పుడు శ్రీ లీలా విషయంలో అదే రిపీట్ అవుద్ది అని కొంతమంది భావిస్తున్నారు. ఈ సినిమాను 2026లో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు.

Also Read: Anupama Paraneswaran : బైసన్ బాగా కలిసి వచ్చింది, వైజయంతి బ్యానర్ లో అనుపమ సినిమా

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×