OTT Movie : థియేటర్లలో కంటే ఆన్లైన్ లోనే సినిమాలు చూడటానికి అలవాటు పడుతున్నారు ప్రేక్షకులు. ఎలాంటి కంటెంట్ కావాలన్నా క్షణాల్లో కళ్ళముందు వాలిపోతుండటంతో వీటిని చూస్తూ ఆనందిస్తున్నారు. ఇక వీటిలో థ్రిల్లర్ సినిమాలకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే. థ్రిల్లర్ ఫ్యాన్స్ ని పరుగులు పెట్టించే సినిమాలు ఓటీటీలో చాలానే ఉన్నాయి. వీటిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక లెస్బియన్ జంట చుట్టూ తిరుగుతుంది. ఈ జంట ఒక అడవిలో హంటర్స్ చేతికి చిక్కుతారు. ఆ తరువాత అసలు థ్రిల్ మొదలవుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
ఈ థ్రిల్లర్ మూవీ పేరు “ది రిట్రీట్” (The Retreat). పాట్ మిల్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో టామీ-అంబర్ పిరీ, సారా అలెన్, రోసిఫ్ సదర్లాండ్ నటించారు. ఈ సినిమా 2021 మే 21న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం Amazon Prime Video లో అందుబాటులో ఉంది.
రెనీ, వాలెరీ అనే ఒక లెస్బియన్ జంట, తమ సంబంధంలోని సమస్యలను పరిష్కరించుకోవడానికి స్నేహితులతో కలిసి ఒక వీకెండ్ ట్రిప్ కి ప్లాన్ చేస్తారు. విడిది కోసం అడవుల్లోని ఒక మారుమూల ప్రాంతానికి వెళతారు. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత వారి స్నేహితులు ఒక్కొక్కరూ హత్యకి గురవుతారు. ఆ జంట ఒంటరిగా ఉన్నప్పుడు, ఒక హంటర్స్ బృందం వారిని వేటాడటం ప్రారంభిస్తుంది. ఈ హంటర్స్ స్వలింగ సంపర్కులను లక్ష్యంగా చేసుకుని, వారిని చిత్రహింసలు పెట్టి, ఆ హత్యలను ఆన్‌లైన్‌లో లైవ్‌స్ట్రీమ్ చేస్తూ డబ్బు సంపాదిస్తారు. ఇప్పుడు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి, ఆ జంట హంటర్స్ తో పోరాడాల్సి వస్తుంది.
హంటర్స్ కి దొరక్కుండా ఇద్దరూ అడవిలో దాక్కుంటారు. వాళ్ళు తమ స్నేహితుల శవాలను చూసి చాలా బాధపడతారు. రెనీ, వాల్ ఇద్దరూ ఒకరినొకరు క్షమించుకుని, తమ సంబంధాన్ని మళ్లీ బలపరుచుకుంటారు. ఈ హంటర్స్ కి వాళ్ళు ఎక్కడున్నది తెలిసిపోతుంది. అక్కడ ఒక భయంకర ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ లో రెనీ, వాల్ హంటర్స్ ను ఓడిస్తారా ? వీళ్ళు అడవి నుంచి బయటపడతారా ? అనే విషయాలను, ఈ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోండి.