E-Paper
Advertisement

Anupama Parameswaran : బైసన్ బాగా కలిసి వచ్చింది, వైజయంతి బ్యానర్ లో అనుపమ సినిమా

Anupama Parameswaran : బైసన్ బాగా కలిసి వచ్చింది, వైజయంతి బ్యానర్ లో అనుపమ సినిమా
Advertisement

Anupama Parameswaran : తెలుగు ప్రేక్షకులు మలయాళం లో రిలీజ్ అయిన ప్రేమమ్ సినిమాకు విపరీతమైన ఆదరణ చూపించారు. అదే సినిమా తెలుగులో కూడా రీమేక్ చేశాడు చందు. నాగచైతన్య ఈ సినిమాలో నటించాడు. ప్రేమం సినిమాలో అనుపమ పరమేశ్వరన్ మంచి గుర్తింపు సాధించుకుంది. తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఆమె గురించి కనుక్కొని సోషల్ మీడియాలో కూడా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.

మొత్తానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఆ ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయిపోయింది. ఆ సినిమాలో నాగవల్లి అనే పాత్రలో కనిపించింది. వెంటనే ప్రేమం సినిమాలో కూడా నటించింది. అయితే అనుపమ పరమేశ్వరానికి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా శతమానంభవతి. సంక్రాంతి కానుకగా విడుదలైన ఆ సినిమా ఆ సీజన్లో రిలీజ్ అయిన అన్ని సినిమాలు కంటే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. గౌతమీపుత్ర శాతకర్ణి, ఖైదీ నెంబర్ 150 వంటి సినిమాలను మించి ఈ సినిమా రెస్పాన్స్ సాధించుకుంది.

వైజయంతి మూవీస్ లో సినిమా

Advertisement

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వైజయంతి బ్యానర్ కి విశిష్టమైన ప్రత్యేకత ఉంది. శక్తి సినిమా తర్వాత ఈ బ్యానర్ పని అయిపోయింది అనుకునే తరుణంలో, అశ్విని దత్ కుమార్తెలు స్వప్న మరియు ప్రియాంక ఈ బ్యానర్ను చాలా సక్సెస్ఫుల్ గా నడిపారు. ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ బ్యానర్స్ లో వైజయంతి అంటే మూవీస్ ఒకటి.

ఈ బ్యానర్లో అనుపమ పరమేశ్వరన్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాతో రమేష్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.

బైసన్ సక్సెస్ కారణం 

Advertisement

మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధ్రువ విక్రం నటించిన సినిమా బైసన్. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ నటించింది. అనుపమ పరమేశ్వరన్ పాత్రకు విపరీతమైన పేరు వచ్చింది. అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చిన పరదా సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది.

పరదా సినిమా మీద విపరీతమైన నమ్మకాలు పెంచుకుంది అనుపమ. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా ఊహించిన సక్సెస్ ఇవ్వలేదు. ఇప్పుడు వైజయంతి మూవీస్ లో చేయబోయే సినిమా పైన తనకి మంచి అంచనాలు ఉన్నాయి. బైసన్ , కిష్కిందపురి వంటి సినిమాలు మంచి టాక్ సాధించుకోవడంతో అనుపమ ప్రస్తుతం ఫామ్ లోనే ఉంది అని చెప్పాలి.

Also Read: Naveen Polishetty: సింగర్ గా మారిన నవీన్ పోలిశెట్టి, మామ ఎక్కడ తగ్గట్లేదు

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×