E-Paper
Advertisement

With love Trailer:‘విత్ లవ్’ ట్రైలర్.. హీరోగా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ డైరెక్టర్.. అనస్వరతో కలిసి అదరగొట్టాడుగా!

With love Trailer:‘విత్ లవ్’ ట్రైలర్.. హీరోగా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ డైరెక్టర్.. అనస్వరతో కలిసి అదరగొట్టాడుగా!
Advertisement

With love Trailer: ఇటీవల కాలంలో ప్రేమకథా సినిమాలకు ఎంతో మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే .ఇలా ఎన్నో ప్రేమకథ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. అతి త్వరలోనే మరో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.. టూరిస్ట్ ఫ్యామిలీతో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అభిషన్ (Abishan)హీరోగా వెండితెరపై ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. తెర వెనుక సినిమాని ముందుకు నడిపించిన ఈయన ఇప్పుడు హీరోగా ‘విత్ లవ్’ (with Love)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

లవ్ రొమాంటిక్ సినిమాగా ‘ విత్ లవ్’..

మదన్ దర్శకత్వంలో తెరకెక్కిన విత్ లవ్ సినిమాలో అభిషన్ కు జోడిగా ఛాంపియన్ బ్యూటీ అనస్వర (Anaswara)హీరోయిన్ గా సందడి చేశారు. ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే మాత్రం ఈ సినిమా మొత్తం కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఫీల్ గుడ్ లవ్ అండ్ రొమాంటిక్ సినిమాగా ఈ సినిమా విడుదల కానుందని ట్రైలర్ చూస్తేనే స్పష్టమవుతుంది. ఈ లవ్ రొమాంటిక్ సినిమాని సౌందర్య రజనీకాంత్ మాగేష్ నిర్మించారు. ఇక తెలుగులో ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై దగ్గుబాటి రానా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

చాంపియన్ తో హిట్ కొట్టిన అనస్వర..

Advertisement

ఛాంపియన్ బ్యూటీతో టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ అద్భుతంగా ఉండబోతుందని ట్రైలర్ ద్వారా చూపించారు. మరి ఫిబ్రవరి 6వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే అనస్వర రాజన్ హీరోయిన్గా ఛాంపియన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విత్ లవ్ సినిమా పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Advertisement

ఇక దర్శకుడిగా తెరవెనక ఉంటూ సినిమాని ముందుకు నడిపించి మంచి సక్సెస్ అందుకున్న అభిషన్ లిటిల్ హార్ట్ సినిమాతో అందరి హృదయాలను కొల్లగొట్టారు. మరి తెర వెనుక మ్యాజిక్ చేసిన అభిషన్ తెరపై ఎలా ప్రేక్షకులను మెప్పించబోతున్నారో తెలియాలి అంటే ఫిబ్రవరి 6 తేదీ వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ఈ సినిమాని తెలుగులో సురేష్ ప్రొడక్షన్ బ్యానర్స్ విడుదల చేయబోతున్న నేపథ్యంలో సినిమా పట్ల కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇక సౌందర్య రజనీకాంత్ ఇటీవల దర్శకురాలిగా నిర్మాతగా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. తన భర్త ధనుష్ నుంచి విడిపోయిన ఈమె తిరిగి ఇండస్ట్రీలోకి వచ్చి కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. విత్ లవ్ సినిమాకు కూడా ఐశ్వర్య రజినీకాంత్ నిర్మాతగా వ్యవహరించటం విశేషం .

Also Read: Prabhas: నీ గొంతు నా మనసును తాకింది.. హీరోయిన్ పై ప్రభాస్ ప్రశంసలు..

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×