E-Paper
Advertisement

Tamil Nadu State Film Awards 2016-2022 : తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు 2016-2022 అందుకున్న సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసా ?

Tamil Nadu State Film Awards 2016-2022 : తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు 2016-2022 అందుకున్న సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసా ?
Advertisement

Tamil Nadu State Film Awards 2016-2022 : ఎట్టకేలకు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులను, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగా ప్రకటించింది. 2016 నుండి 2022 వరకు వచ్చిన సినిమాలకు ఈ అవార్డులను ప్రధానం చేయనున్నారు. గురువారం అధికారికంగా ఇచ్చిన ప్రకటనలో అవార్డుల జాబితాను కుడా ప్రకటించారు. ఈ విజేతలను సత్కరించే కార్యక్రమం ఫిబ్రవరి 13న సాయంత్రం 4.30 గంటలకు చెన్నైలోని కలైవానర్ అరంగంలో జరగనుంది. ఇక ఎవరికి ఏ అవార్డులు వచ్చాయో తెలుసుకుందాం పదండి.

2016 నుండి 2022 వరకు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకున్న వాళ్ళు ?

2016కి గాను లోకేశ్ కనగరాజ్ తొలి సినిమా ‘మానగరం’ ఉత్తమ చిత్రంగా అత్యున్నత పురస్కారాలను అందుకుంది. లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాకి ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. ‘పురియత పుతిర్’ చిత్రానికి గాను విజయ్ సేతుపతి ఉత్తమ నటుడి అవార్డును సొంతం చేసుకున్నారు. పాంబు సత్తై చిత్రానికి కీర్తి సురేష్ ఉత్తమ నటిగా గెలుపొందారు.

Advertisement

2017లో నయనతార ‘అరమ్’ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. నయనతార ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ‘తీరన్ అధిగారమ్ ఒండ్రు’ సినిమాకి కార్తీ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. విక్రమ్ వేద చిత్రానికి గాను పుష్కర్-గాయత్రి జంటకు ఉత్తమ దర్శకుడి అవార్డు లభించింది.

2018లో మరి సెల్వరాజ్ రూపొందించిన ‘పరియేరుమ్ పెరుమాల్’ అనే సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు అవార్డును గెలుచుకుంది. ధనుష్ ‘వడ చెన్నై’ చిత్రానికి ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నాడు. ఇదిలా ఉంటే ‘చెక్క చివంత వానం’ చిత్రానికి గాను జ్యోతిక ఉత్తమ నటిగా ఎంపికైంది.

Advertisement

2019లో వెట్రిమారన్ ధనుష్‌ల ‘అసురన్’ సినిమా ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. ఉత్తమ నటిగా మంజు వారియర్ అవార్డును గెలుచుకున్నారు. ‘ఒత్త సెరుప్పు సైజ్ 7’ కి ఆర్ పార్తిబన్ కి ఉత్తమ దర్శకుడితో పాటు, ఉత్తమ నటుడి అవార్డులు వరించాయి.

2020లో వచ్చిన ‘కూజంగల్’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ‘సూరరై పొట్రుకు’ సూర్య ఉత్తమ నటుడిగా, అదే చిత్రానికి ఉత్తమ నటిగా అపర్ణ బాలమురళి ఎంపిక అయ్యారు. ఇక ఈ సినిమాకి దర్శకత్వం వహించిన సుధా కొంగర ఉత్తమ దర్శకురాలిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా జివి ప్రకాష్‌ అవార్డులు అందుకున్నారు.

2021లో సూర్య నటించిన మరో సినిమా ‘జై భీమ్’ ఉత్తమ చిత్ర అవార్డును అందుకోగా, అదే చిత్రానికి లిజోమోల్ జోస్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన టిజె జ్ఞానవేల్ ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నారు. ‘సర్పట్ట పరంబరై’ చిత్రంలో బాక్సర్ పాత్రకు ఆర్య ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు.

2022లో సాయి పల్లవి నటించిన ‘గార్గి’ ఉత్తమ చిత్రంగా, సాయి పల్లవి ఉత్తమ నటిగా ఎంపికైంది. ‘గార్గి’ చిత్రానికి దర్శకత్వం వహించిన గౌతం రామచంద్రన్‌కు ఉత్తమ దర్శకుడిగా అవార్డు లభించింది. ఇదిలా ఉంటే, ‘తానక్కరన్’ చిత్రానికి గాను విక్రమ్ ప్రభు ఉత్తమ నటుడిగా నిలిచారు. ‘పొన్నియిన్ సెల్వన్ 1’ చిత్రానికి గానూ ఏఆర్ రెహమాన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్నారు.

Read Also : 25 ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న విజయ్ సేతుపతి మూవీ… ఈ సైలెంట్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×