E-Paper
Advertisement

Mexican Parota Rolls: నోరూరించే మెక్సికన్ పరోటా రోల్స్.. హెల్దీగా, ఈజీగా ఇలా తయారు చేసుకోండి!

Mexican Parota Rolls: నోరూరించే మెక్సికన్ పరోటా రోల్స్.. హెల్దీగా, ఈజీగా ఇలా తయారు చేసుకోండి!

Mexican Parota Rolls: పిల్లలు కూరగాయలు తినడానికి మారాం చేస్తున్నా లేదా సాయంత్రం పూట ఏదైనా స్పైసీగా తినాలనిపించినా ఈ ‘మెక్సికన్ పరోటా రోల్స్’ ఓసారి ట్రై చేయండి. బ్రకోలీ, స్వీట్ కార్న్, చీజ్ కాంబినేషన్‌లో చేసే ఈ రోల్స్‌కు ఇంటిల్లిపాది ఫిదా అయిపోవాల్సిందే. ఈ రోల్స్ తినడానికి టేస్టీగానే కాదు.. ఆరోగ్యానికి కూడా మంచిదే. మరి ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్‌లో వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా..

కావాల్సిన పదార్థాలు:

కప్పు బ్రకోలీ ముక్కలు, పావు కప్పు సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పావు కప్పు క్యాప్సికం ముక్కలు, పావు కప్పు చిన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు, ఒక కప్పు చీజ్‌ తురుము, రెండు టేబుల్‌ స్పూన్ల ఉడికించిన స్వీట్‌కార్న్‌, అర టీస్పూన్‌ మిరియాల పొడి, ఒక టీస్పూన్‌ కారం, తగినంత ఉప్పు, ఒక టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం, ఒక కప్పు గోధుమపిండి, ఒక కప్పు మైదాపిండి, అర కప్పు నూనె తీసుకోండి.

Also Read: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ హెల్దీ సొరకాయ చపాతీ ట్రై చేయండి!

తయారీ విధానం:

ఒక గిన్నెలో మైదాపిండి, గోధుమపిండి, ఒక టేబుల్‌ స్పూన్‌ నూనె, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. దానిలో తగినన్ని నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా మెత్తగా కలుపుకుని, దానిపై మూత పెట్టి పావుగంట పాటు పక్కన నానబెట్టుకోవాలి. ఈలోపు బ్రకోలీ ముక్కల్ని 10 నిమిషాల పాటు ఉప్పునీళ్లలో ఉడికించి, ఆ తర్వాత వాటిని వీలైనంత చిన్న ముక్కలుగా తరగాలి.

ఇప్పుడు ఓ వెడల్పాటి గిన్నెలో తరిగిన బ్రకోలీ, టమాట, క్యాప్సికం, ఉల్లిగడ్డ ముక్కలు, చీజ్‌ తురుము, ఉడికించిన స్వీట్‌ కార్న్‌, కారం, మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేయాలి. తర్వాత స్టవ్‌ మీద పెనం పెట్టి వేడి చేయాలి. కలిపి పెట్టుకున్న పిండిని చిన్న ఉండలుగా తీసుకుని చపాతీల్లా ఒత్తుకోవాలి. ఈ చపాతీలను పెనంపై వేసి కొద్దిగా నూనె రాస్తూ రెండు వైపులా నిమిషం పాటు కాల్చుకోవాలి.

ఇలా కాలిన చపాతీని తీసుకుని.. దాని మధ్యలో ముందుగా సిద్ధం చేసుకున్న బ్రకోలీ మిశ్రమాన్ని ఉంచి పరోటాలా గట్టిగా చుట్టాలి. ఇలా చుట్టిన రోల్స్‌ను పెనంపై ఉంచి నిమిషం పాటు మూత పెడితే, లోపల ఉన్న చీజ్ కరిగి ముక్కలన్నీ చక్కగా సెట్ అవుతాయి. అంతే.. వేడివేడి మెక్సికన్‌ పరోటా రోల్స్‌ రెడీ.

Also Read: నాన్‌వెజ్‌ను తలదన్నే పుట్టగొడుగుల కూర.. ఈ స్టైల్లో చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!

Related News

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

వెజ్ ఓట్స్ ఉప్మా.. డయాబెటిస్ ఉన్నవారికి, డైట్ చేసేవారికి పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్!

కేవలం 3 వస్తువులతో కమ్మని వెనీలా ఐస్‌క్రీమ్.. పిల్లల ఫేవరెట్ డిజర్ట్ అయిపోద్ది!

Big Stories

×