E-Paper
Advertisement

GlobeTrotter Event : వారణాసి సినిమాలో ఆ డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్, బాహుబలి మ్యాజిక్ రిపీట్

GlobeTrotter Event : వారణాసి సినిమాలో ఆ డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్, బాహుబలి మ్యాజిక్ రిపీట్
Advertisement

GlobeTrotter Event : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రత్యేకమైన దర్శకులలో దేవకట్ట ఒకరు. తెలుగులో కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే వస్తాయి అని అనుకుంటున్న తరుణంలో, ఒక ప్రత్యేకమైన స్టైల్లో సినిమా తీయడం మొదలుపెట్టాడు దేవకట్ట. విపరీతంగా చదువుకోవటం వలన తన సినిమాలు ద్వారా ఎప్పుడు సమాజాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాడు.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రత్యేకమైన రైటర్స్ లో దేవకట్ట ఒకరు. దేవకట్ట రైటింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కొన్ని డైలాగ్ లు అయితే మాత్రం బుల్లెట్ల దిగుతుంటాయి. ఇప్పుడు విన్న కూడా ప్రస్థానం సినిమాలో సాయికుమార్ చెప్పిన డైలాగ్స్ ఎంత పవర్ఫుల్ గా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

వారణాసి సినిమాలో ఇన్వాల్వ్మెంట్ 

Advertisement

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు వారణాసి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమాలో దేవకట్ట ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని అర్థమవుతుంది. కదా స్క్రీన్ ప్లే మాటలు విషయంలో దేవకట్ట బాగా ఇన్వాల్వ్ అయ్యారు. గతంలో ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాల్లో కూడా డైలాగ్స్ రాశారు దేవకట్ట.

Advertisement

మాహిష్మతి సామ్రాజ్యం మీద కాలకేయులు దాడికి వస్తున్నప్పుడు ఏది మరణం అని ప్రభాస్ చెప్పే డైలాగ్స్ పార్ట్ అంతా కూడా దేవకట్ట రాశాడు. ఆ డైలాగ్స్ ఆ సీన్ కి ఒక హై తీసుకువచ్చాయి. అయితే ఈ సినిమాకి కూడా మంచి ప్లస్ అవుతుంది అని దేవకట్టాను స్క్రిప్ట్ లో ఇన్వాల్వ్ చేశాడు రాజమౌళి.

బాహుబలి మ్యాజిక్ రిపీట్

బాహుబలి సినిమాలో దేవకట్ట డైలాగులు ఎలా వర్కౌట్ అయ్యాయో ఇదే సినిమాలో కూడా ఆ స్థాయిలో మ్యాజిక్ రిపీట్ అవుతుంది అని చాలామంది ఊహిస్తున్నారు. దేవకట్ట మాట్లాడుతూ ” ఎవడి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో” ఆ డైలాగ్ నాకు ఇష్టం అని చెప్పారు. కానీ ఈ సినిమాలో డైలాగ్ చెప్పమంటే మాత్రం చెప్పలేదు. నాకు చాలా ఎథిక్స్ ఉన్నాయి రాజమౌళి పర్మిషన్ ఇస్తే, నేను ఏ డైలాగ్ చెప్పమంటే ఆ డైలాగ్ చెప్తానని చెప్పారు.

Also Read: GlobeTrotter Event : 15 సంవత్సరాల క్రితం ప్రాజెక్టు ఇప్పుడు పట్టాలెక్కింది, నిర్మాత ఎమోషనల్

Related News

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

రజినీ జైలర్ 2 కథ ఇదేనా? ఈసారి టార్గెట్ ఎవరో తెలిస్తే షాక్!

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

Big Stories

Advertisement
×