Yash Mother Pushpa: ప్రముఖ కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) కేజీఎఫ్ 1,2 చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఇప్పుడు ఈయన తాజాగా నటించిన చిత్రం టాక్సిక్. మలయాళం లేడీ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ (Geethu Mohan Das) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ సినిమాపై నెటిజన్లు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి తోడు గతంలో నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravindh) కూడా యశ్ ను ఉద్దేశిస్తూ కేజీఎఫ్ సినిమా వల్లే యశ్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అనడం ఇండస్ట్రీలో వివాదాస్పదంగా మారింది. ఇన్ని రోజుల తర్వాత ఇప్పటికే దీనిపై యశ్ స్పందించగా.. ఇప్పుడు ఆయన తల్లి పుష్ప అరుణ్ కుమార్ (Pushpa Arun Kumar) కూడా స్పందిస్తూ సంచలన కామెంట్లు చేశారు.
యశ్ తల్లి పుష్ప తన కుమారుడి గురించి మాట్లాడుతూ.. “మీరందరూ అనుకుంటున్నట్టు యశ్ రాత్రికి రాత్రే పాన్ ఇండియా స్టార్ అయిపోలేదు. ఈ విజయం వెనుక ఎన్నో ఏళ్ల తరబడి కష్టం ఉంది. ముఖ్యంగా కేజీఎఫ్ కంటే ముందే కన్నడ సినీ పరిశ్రమలో వరుసగా ఐదు భారీ హిట్ సినిమాలు అందించి తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను సొంతం చేసుకున్నారు. పైగా అందరిలా నా కొడుక్కి ఎలాంటి సినీ నేపథ్యం, వారసత్వంగా వచ్చిన కోట్ల ఆస్తిపాస్తులు లేవు. ఒక ప్రభుత్వ బస్ డ్రైవర్ కొడుకుగా సినీ పరిశ్రమ లోకి అడుగుపెట్టాడు. తన సొంత కష్టంతో, తెలివితేటలతో ఈ స్థాయికి చేరుకున్నాడు.
also read:రేర్ పిక్.. గౌతమ్ కి స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపిన మహేష్ బాబు!
ముఖ్యంగా నా కొడుకు ఉగ్రవాది కాదు. అలాంటప్పుడు ఆయన ఎదుగుదలను చూసి ఎందుకు కొందరు ఓర్వలేకపోతున్నారో నాకు అర్థం కావడం లేదు” అంటూ ఆమె కామెంట్లు చేసింది. శ్రమనే నమ్ముకుని పైకి వచ్చిన వ్యక్తిని ఇలా బాధ పెట్టడం సరికాదు. ఒక తల్లిగా నా కొడుకు సాధించిన ఈ గొప్ప విజయాన్ని చూసి నేను గర్వంతో ఉప్పొంగిపోతున్నాను” అంటూ యశ్ తల్లి కామెంట్ చేశారు.
ఇకపోతే ఈ విషయంపై అటు యశ్ కూడా స్పందించిన విషయం తెలిసిందే. ఇటీవల ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యశ్ మాట్లాడుతూ.. ఒక సినిమా సక్సెస్ కి కేవలం హీరో మాత్రమే కారణం కాదు.. ఒక సినిమా వెనుక దర్శకుడు, రచయితలు, సాంకేతిక నిపుణులు , ఇతర నటీనటులు ఇలా ఎంతోమంది కష్టపడతారు. అందరి సమిష్టి కృషితోనే సినిమా విజయం సాధిస్తుంది. సినిమాలో ప్రధాన పాత్ర పోషించే నటుడు తన పాత్రను సరిగ్గా చేయలేకపోతే మాత్రం ఆ సినిమా విజయం సాధించడం కష్టం అంటూ తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. మొత్తానికైతే ఇటు యశ్ అటు యశ్ తల్లి పుష్ప ఇద్దరు పేరును ప్రస్తావించక పోయినా .. గతంలో అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలకు, అప్పట్లో ఆయనపై కొంతమంది చేసిన నెగిటివ్ ట్రోల్స్ కి.. ఇప్పుడు వీరు స్పందించారు అనే రేంజ్ లో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.