E-Paper
Advertisement

గాలిలో వేలాడుతున్న ట్రాక్.. షిమ్లా టాయ్ ట్రైన్లకు బ్రేక్!

గాలిలో వేలాడుతున్న ట్రాక్.. షిమ్లా టాయ్ ట్రైన్లకు బ్రేక్!
Advertisement

Shimla Toy Train Cancelled: హిమాచల్‌ ప్రదేశ్‌ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొండ ప్రాంతాల్లో మట్టి జారిపడటంతో రైలు మార్గాలు, రోడ్లు దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా పొందిన కల్కా–షిమ్లా నారో గేజ్ రైల్వే లైన్‌పై టాయ్ ట్రైన్ సర్వీసులను రద్దు చేశారు.

గాలిలో వేలాడుతున్న రైల్వే ట్రాక్

సోలన్ జిల్లాలోని కోటి, గుమ్మన్ స్టేషన్ల మధ్య భారీగా మట్టి కొట్టుకుపోయింది. దీంతో రైల్వే ట్రాక్‌లో ఒక భాగం గాలిలో వేలాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పరిస్థితి ప్రయాణికుల భద్రతకు ప్రమాదకరంగా మారడంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.  కోటి–గుమ్మన్ మధ్య బ్రిడ్జ్ నంబర్ 57 సమీపంలో ట్రాక్ చుట్టుపక్కల ఉన్న మట్టి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ట్రాక్ పరిస్థితిని పూర్తిగా పరిశీలించి, అవసరమైన మరమ్మతులు చేసిన తర్వాతే సేవలను తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది.

ఆదివారం 10 రైళ్లు రద్దు

Advertisement

ఈ ఘటన కారణంగా ఆదివారం కల్కా నుంచి షిమ్లా, షిమ్లా నుంచి కల్కా మధ్య నడవాల్సిన మొత్తం 10 టాయ్ ట్రైన్ సర్వీసులను రద్దు చేశారు. ఈ విషయాన్ని షిమ్లా రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ సంజయ్ గేవర్ వెల్లడించారు. ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఈ నిర్ణయంతో నిరాశకు గురవుతున్నారు. సాధారణంగా వీకెండ్ లో పర్యాటకులతో సందడిగా కనిపించే షిమ్లా రైల్వే స్టేషన్.. రైళ్లు రద్దు కావడంతో ఆదివారం జనసంచారం లేకుండా నిశ్శబ్దంగా కనిపించింది.

వర్షాకాలంలో తరచూ అంతరాయాలు

కల్కా–షిమ్లా హెరిటేజ్ రైల్వే లైన్‌కు వర్షాకాలం పెద్ద సవాలుగా మారింది. భారీ వర్షాలు, మట్టి జారిపడటం, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలతో ఈ మార్గంలో ఈ సీజన్‌లో పలుమార్లు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు 96 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే మార్గం కొండ ప్రాంతాల్లోని క్లిష్టమైన పరిస్థితుల మధ్య నిర్మించారు. ఇందులో 102 సొరంగాలు, 800 వంతెనలు, 919 మలుపులు ఉన్నాయి. అందుకే ఈ మార్గాన్ని భారత రైల్వే ఇంజినీరింగ్‌లో ఓ అద్భుతంగా, అదే సమయంలో ప్రముఖ పర్యాటక ఆకర్షణగా భావిస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మూసివేత

Advertisement

వర్షాల ప్రభావం రైలు మార్గానికే పరిమితం కాలేదు. ఆదివారం ఉదయం నాటికి హిమాచల్‌ప్రదేశ్‌లోని 64 రోడ్లను రాకపోకలకు మూసివేశారు. మండిలో అత్యధికంగా 24 రోడ్లు మూసివేయగా, కుల్లులో 16, కాంగ్రా, సిర్మౌర్ జిల్లాల్లో ఏడేసి రోడ్లు మూసివేశారు. ఉనాలో నాలుగు, షిమ్లాలో మూడు, చంబాలో రెండు, లాహౌల్–స్పితి జిల్లాలో ఒక రహదారి మూసివేశారు.

సెప్టెంబర్ 3 వరకు భారీ వర్షాల హెచ్చరిక

రాష్ట్రంలో వర్షాల పరిస్థితి ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని షిమ్లా వాతావరణ కేంద్రం హెచ్చరించింది. జూన్ 30న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి హిమాచల్‌ప్రదేశ్‌లో వర్షాలు, కొండచరియలు, ఇతర వర్ష సంబంధిత ఘటనల్లో సుమారు 103 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రానికి సుమారు రూ.1,184 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.

Read Also: వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్.. ఈ రెండు రైళ్ల టైమింగ్స్‌ మారాయ్!

Tags

Related News

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

అజంతా To ఎల్లోరా.. 6 రోజుల క్రేజీ టూర్.. ధర మరీ ఇంత తక్కువా?

జపాన్‌కు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఢిల్లీ నుంచి ఒసాకాకు నాన్‌స్టాప్ విమానాలు!

సౌదీ అరేబియాకు వెళ్లే భారతీయులకు అలర్ట్.. అక్టోబర్ 24 వరకు ఫ్లైట్స్ క్యాన్సిల్!

ఇండియన్ పాస్‌పోర్ట్ ర్యాంక్ పెరిగింది.. కానీ, వీసా ఫ్రీ దేశాలు తగ్గాయ్!

రైలు ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. ఆఫ్‌లైన్ టిక్కెట్లకూ ఇన్సూరెన్స్.. రూ. 10 లక్షల బీమా కవరేజ్!

విమానాల్లో అగ్ని ప్రమాద ఘటనలు.. పవర్ బ్యాంకులపై DGCA నిషేధం! ఇంకా ఏంటంటే..

Big Stories

Advertisement
×