E-Paper
Advertisement

ప్రభుత్వం నిర్వహించే కైలాస యాత్రకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ‘ప్రైవేట్‌‌’తో పోల్చితే ఏది బెటర్?

ప్రభుత్వం నిర్వహించే కైలాస యాత్రకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ‘ప్రైవేట్‌‌’తో పోల్చితే ఏది బెటర్?
Advertisement

కైలాస మానస సరోవర యాత్రకు ఇప్పుడు ప్రైవేట్ టూర్ ఆపరేటర్స్ ద్వారా కూడా ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా నేపాల్-టిబెట్ సరిహద్దులో నెలకొన్న రాకాసి వరద నేపథ్యంలో ఆ మార్గంలో ప్రయాణించేందుకు యాత్రికులు వెనకాడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం నిర్వహించే కైలాస సరోవర యాత్రకు మొగ్గుచూపుతున్నారు. అయితే, చాలామంది ప్రభుత్వం ఈ యాత్ర నిర్వహిస్తుందనే సంగతి తెలీదు. అలాగే ప్రాసెస్ మీద కూడా అవగాహన లేదు. వారి కోసం.. ఈ పూర్తి వివరాలు.

ప్రభుత్వమే ఎందుకు?

కైలాస మానస సరోవారిని వెళ్లడమంటే అంత ఈజీ కాదు. పైగా ఆ పర్వతం ఇండియాలో లేదు. ఇందుకు చైనా వెళ్లాల్సి ఉంటుంది. అందుకే.. భారత విదేశాం మంత్రిత్వ శాఖ (MEA) ఈ బాధ్యతలను తీసుకుంది. ఏటా 2000 వేల మందికి పైగా భక్తులను 18 బ్యాచ్‌లుగా కైలాస మానస సరోవర యాత్రకు తీసుకెళ్తోంది. విపరీతమైన శీతోష్ణ పరిస్థితుల్లో ఈ యాత్ర సాగే యాత్ర చాలా రిస్క్. అందుకే ప్రభుత్వం దీన్ని ఎంతో జాగ్రత్తగా నిర్వహిస్తోంది.

ఎవరు అర్హులు? నిబంధనలు ఏమిటీ?

Advertisement

ఈ యాత్ర చేయాలంటే మీకు తప్పకుండా ఇండియన్ పాస్‌పోర్ట్ ఉండాలి. OCI లేదా PIO కార్డులు చెల్లవు. దరఖాస్తు చేసుకొనేవారి వయస్సు ఆ ఏడాది జనవరి 1 నాటికి 18 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండాలి. బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 25 లేదా అంతకంటే తక్కువ ఉండాలి. బీపీ, ఊపిరితీత్తులు, గుండె సంబంధిత సమస్యలు ఉండకూడదు. ఈ యాత్రకు అర్హులైనవారికి ఢిల్లీ హార్ట్ అండ్ లంగ్ ఇనిస్టిట్యూట్‌లో, ITBP ఆసుపత్రుల్లో నిర్వహించే కఠినమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అక్కడ ఫిట్ అని తేలితేనే యాత్రకు పంపిస్తారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎలా ఎంపిక చేస్తారు?

కైలాస మానస సరోవర యాత్రకు భారత ప్రభుత్వ అధికారిక పోర్టల్ (kmy.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే ధరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వానికి వచ్చిన దరఖాస్తుల నుంచి కంప్యూటరైజ్డ్ ర్యాండమ్ లాటరీ ద్వారా యాత్రికులను ఎంపిక చేస్తారు. యాత్రకు ఎంపికైన తర్వాత రూ.5000 నాన్-రిఫండబుల్ కన్ఫర్మేషన్ ఫీజు చెల్లించి పేరు నమోదు చేసుకోవాలి.

లాటరీకి ఎంపికైతే కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్లవచ్చా?

Advertisement

ఈ లాటరీని వ్యక్తిగత యాత్రకు మాత్రం ధరఖాస్తు చేసుకుంటారు. లాటరీకి ఎంపికైనవారు వేరొకరిని తీసుకెళ్లలేరు. అయితే.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నప్పుడే అందులో పెయిరింగ్ ఆప్షన్ ఉంటుంది. కేవలం ఒకరిని మాత్రమే యాడ్ చేసుకోవడం కుదురుతుంది. ఉదాహరణకు మీరు మీ భార్యతో కలిసి వెళ్లాలి అనుకుంటే దరఖాస్తులో ఆమె పేరు యాడ్ చేయాలి.

అయితే.. ఆమె కూడా వేరేగా దరఖాస్తు చేసుకోవాలి. ఫారంలో ఇద్దరి అప్లికేషన్ నెంబర్లను లింక్ చేయాలి. దానివల్ల ఏ ఒక్కరికి లాటరీ వచ్చినా ఇద్దరూ కలిసి వెళ్లవచ్చు. ఇద్దరికీ ఒకే బ్యాచ్ కేటాయిస్తారు. ఇద్దరు కంటే ఎక్కువ మందికి పెయిరింగ్‌కు అనుమతి ఇవ్వరు. ఇద్దరూ మెడికల్ టెస్టులో పాసైతేనే యాత్రకు వెళ్లనిస్తారు. ఒక వేళ ఇద్దరిలో ఒకరు ఫెయిలైతే. పాస్ అయిన వ్యక్తికి మాత్రమే యాత్రకు వెళ్లేందుకు అనుమతి ఉంటుంది.

ఈ యాత్రకు ఎంత ఖర్చవుతుంది?

భారత ప్రభుత్వం రెండు మార్గాల్లో ఈ యాత్రను నిర్వహిస్తోంది. వాటిలో ఒకటి లిపులేఖ్ పాస్ మార్గం (ఉత్తరాఖండ్ మీదుగా), ఇంకొకటి నాథు లా పాస్ మార్గం (సిక్కిం మీదుగా). ఉత్తరాఖండ్ మీదుగా వెళ్లే మార్గంలో వెళ్లి రావడానికి 22 రోజులు పడుతుంది. సిక్కిం మార్గం నుంచి వెళ్లి రావడానికి 21 రోజులు పడుతుంది. ఉత్తరాఖండ్ మార్గంలో వెళ్లేందుకు ఒక్కొక్కరికి రూ.2.09 లక్షలు వరకు ఖర్చు కావచ్చు.

సిక్కిం మార్గంలో వెళ్లి రావడానికి రూ.3.31 లక్షలు ఒక్కొక్కరికి ఖర్చు కావచ్చు. ఈ మొత్తంలో చైనా వీసా, పర్మిట్ ఫీజు, రవాణా, వసతి, భోజన సదుపాయాలు కలిపి ఉంటాయి. వ్యక్తిగత ఖర్చులు, షాపింగ్, మెడికల్ టెస్టుల కోసం ప్రత్యేకంగా నగదు ఉంచుకోవాలి. గుర్రం, హెల్పర్‌ కావాలంటే రూ.25వేలు నుంచి రూ.35 వేలు చెల్లించాల్సి రావచ్చు. ఒక వేళ గుర్రం ఎక్కినా.. పర్వతంపై కొన్ని ప్రమాదకరమైన దారుల్లో నడవాల్సి ఉంటుంది.

రెండు మార్గాల్లో ఏది బెటర్?

ఉత్తరాఖండ్ మీదుగా వెళ్లే లిపులేఖ్ పాస్ మార్గలో ట్రెక్కింగ్ ఎక్కువ. ఇందుకు శారీరక దారుఢ్యం చాలా అవసరం. ఈ ప్రయాణం ఢిల్లీ నుంచి ఫ్రారంభమై.. ధార్చుల, లిపులేఖ్ పాస్, పురంగు (చైనా సరిహద్దు) నుంచి మానస సరోవరానికి చేరుతుంది. అక్కడి నుంచి నడుస్తూ కైలాసగిరి ప్రదక్షిణ చేయాలి. సిక్కిం మీద నుంచి లా పాస్ మార్గం మీదుగా వెళ్లేవారికి నడక తక్కువ. వృద్ధులకు అనుకూలం కూలంగా ఉంటుంది. ఈ యాత్ర ఢిల్లీ నుంచి ప్రారంభమై.. గ్యాంగ్‌టక్, నాథూ లా పాస్, షిగాట్సే, మానస సరోవరానికి చేరుతుంది. అక్కడ నడుస్తూ కైలాస పర్వతం చుట్టూ గిరి ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది.

ఎలా తీసుకెళ్తారు?

ఈ యాత్రకు ఎంపికైనవారు ఢిల్లీకి చేరకోవాలి. అక్కడ 3 నుంచి 4 రోజులు వైద్య పరీక్షలు జరుగుతాయి. కైలాస గిరి ప్రదక్షిణకు ఫిట్‌గా ఉండేందుకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. కైలాస పర్వతం వద్ద ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. దాన్ని మీ శరీరం తట్టుకోగలదా లేదా అని పరీక్షిస్తారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్ మార్గంలో కుమాన్ మండల్ వికాశ్ నిగం (KMVN), సిక్కిం మార్గంలో టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (STDC) రవాణా, వసతి ఏర్పాట్లు చూసుకుంటాయి.

యాత్రికులకు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) బలగాలు పూర్తి భద్రతను అందిస్తాయి. టిబెట్ (చైనా) సరిహద్దు దాటిన తర్వాత చైనా అధికారులు టిబెట్ టూరిజం బ్యూరో బస్సులు, ఇతరాత్ర వాహనాల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 52 కిమీలు నడుస్తూ 3 రోజుల్లో కైలాస పర్వత ప్రదక్షిణ పూర్తి చేయాల్సి ఉంటుంది. నడవలేని వారు సొంత ఖర్చులతో గుర్రాలు లేదా పోర్టర్ల సాయంతో ప్రదక్షిణ పూర్తి చేయొచ్చు.

తినడానికి ఏం దొరకుతాయి?

యాత్రలో భాగంగా ప్రభుత్వమే స్వయంగా బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తుంది. హోటళ్లు, టిబెట్ సైడ్ క్యాంపుల్లో రోజూ శాఖహార బోజనం, టీ, కాఫీలను నిర్వాహకులే ఏర్పాటు చేస్తారు. ప్రదక్షిణ చేసే మార్గంలో చిన్న చిన్న టిబెటన్ టీ షాపులు ఉంటాయి. అక్కడ వేడి నీళ్లు, టీ, ఇన్‌స్టంట్ నూడుల్స్, సూప్స్ దొరుకుతాయి. అక్కడ వారికి చైనా కరెన్సీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, మీరు కూడా ఎనర్జీ బార్లు, గ్లూకోజ్, చాక్లెట్లు, ఎలక్ట్రోలైట్ ఫౌడర్లను వెంట తీసుకెళ్లడం మంచిది. టిబెట్ ప్రాంతంలో చైనీస్ యువాన్, అమెరికన్ డాలర్లు మాత్రమే చెల్లుతాయి. ఇండియన్ మనీ స్వీకరించరు.

అందుకే మీరు ఢిల్లీలోనే RBI గుర్తింపు పొందిన ఫారెక్స్ ఏజెంట్లు లేదా థామస్ కుక్, బుక్ మై ఫారెక్స్ ద్వారా డాలర్లు, యువాన్లను మార్చుకోవాలి. అక్కడ కుదరకపోతే గుంజి (నాథూ లా సరిహద్దు) వద్ద భారత సరిహద్దు దాటే ముందు చివరి బేస్ క్యాంపుల వద్ద ప్రభుత్వ గుర్తింపు పొందిన మనీ ఎక్స్ఛేంజర్లు అందుబాటులో ఉంటారు. లేదా టాక్లాకోట్, పురంగ్ వద్ద కూడా ఇండియన్ రూపీస్ ఇచ్చి యువాన్లు పొందవచ్చు. నేపాల్‌లోని ఖాట్మండు మీదుగా వెళ్తే సిమికోట్, హిల్సా వద్ద మనీ ఎక్స్ఛేంజ్ సెంటర్లు అందుబాటులో ఉంటాయి. ఈ యాత్ర పూర్తి చేయడానికి మీ వద్ద 3 వేల నుంచి 5 వేలు యువాన్లు (రూ.35 వేలు నుంచి రూ.60 వేలు) ఉంటే బెటర్.

ప్రభుత్వం నిర్వహించే యాత్ర బెటరా? ప్రైవేట్ టూర్ ఆపరేటర్లతో వెళ్తే బెటరా?

ప్రభుత్వం నిర్వహించే యాత్ర పూర్తి భద్రతతో ఉంటుంది. టిబెట్ (చైనా) అధికారుల నుంచి తక్షణ స్పందన లభిస్తుంది. ప్రైవేట్ టూర్ ఆపరేటర్స్ నుంచి అవన్నీ ఆశీంచకూడదు. అయితే, ప్రభుత్వ యాత్ర కంటే ప్రైవేట్ ఆపరేటర్స్ ద్వారా మానస సరోవరం చేరుకోవడం సులభం. ఇద్దరు కంటే ఎక్కువ మందిని అనుమతిస్తారు. ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యులతో గ్రూపులుగా వెళ్లవచ్చు. అయితే, వీరు కూడా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఫిట్‌గా ఉంటేనే సరిహద్దు దాటిస్తారు. ఒక వేళ అందులో ఉపసమనం కల్పించినా.. టిబెట్‌లో అధికారికంగా నిర్వహించే టెస్టుల్లో ఫెయిలైతే.. అక్కడే ఆపేస్తారు.

ఈ రిపోర్టులు తప్పనిసరి

అయితే, ప్రభుత్వ యాత్ర తరహాలో ఢిల్లీలో వైద్య పరీక్షలు అవసరం లేదు. యాత్రకు టికెట్లు బుక్ చేసుకొనే సమయానికి ముందు ఎంబీబీఎస్ లేదా ఎండీ నుంచి మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తెచ్చుకుని ఆపరేటర్‌కు ఇస్తే చాలు. అయితే అందులో మీకు ఎలాంటి ఊపిరితీత్తులు, గుండె జబ్బులు, హైబీపీ లేవని కన్ఫార్మ్ చేసి ఉండాలి. పరీక్షలకు సంబంధించిన ECG, ట్రెడ్‌మిల్ స్ట్రెస్ టెస్ట్, ఇతరాత్ర వైద్య పరీక్షల రిపోర్టులను తప్పకుండా సమర్పించాలి. ఎందుకంటే కైలాస పర్వతం వద్ద ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. అలాగే ప్రదక్షిణ మూడు రోజులపాటు జరుగుతుంది. 52 కిమీలు నడవాలి. కాబట్టి.. అందుకు ఫిట్‌గా ఉండటం తప్పనిసరి.

Also Read: కైలాస పర్వతం.. ఇక్కడన్నీ అంతుచిక్కని మిస్టరీలే? ఇవి తెలిస్తే.. గూస్‌బంప్స్ పక్కా!

ప్రైవేట్‌గా వెళ్లేందుకు లాటరీ అవసరం ఉండదు. వీళ్లు రెండు మార్గాల్లో యాత్ర నిర్వహిస్తారు. ఒకటి కఠ్మండు – రసువాగధి (నేపాల్ సరిహద్దు నుంచి కైరోంగ్ (టిబెట్), డాగా నియాంగ్ మీదుగా మానస సరోవరం తీసుకెళ్తారు. ఈ మార్గంలో 13 నుంచి 15 రోజుల్లోనే యాత్ర పూర్తి చేయొచ్చు. దీనికి ఒక్కొక్కరికి రూ.1.80 లక్షలు నుంచి రూ.2.20 లక్షలు ఖర్చు కావచ్చు. అయితే, ఇటీవల వరద వల్ల ఈ మార్గం ఆనవాళ్లు లేకుండా పోయింది.

Also Read: మానస సరోవరానికి ఇండియా నుంచి ఎన్నో రూట్లు.. కానీ, నేపాల్ మీదుగానే ప్రయాణమెందుకు?

ఇంకొకటి సిమికోట్ – హిల్సా హెలికాప్టర్ మార్గం. కఠ్మండు నుంచి నేపాల్ గంజ్‌కు వెళ్లాలి. అక్కడి నుంచి ఫ్లైట్‌లో సమికోట్ చేరుకోవాలి. హిల్సా నుంచి హెలికాప్టర్‌లో పురంగ్ చేరుకోవాలి. అక్కడి నుంచి మానస సరోవరానికి వెళ్లాలి. ఇందుకు 9 నుంచి 10 రోజులు మాత్రమే పడుతుంది. తక్కువ సమయంలో యాత్ర ముగుస్తుంది. కానీ, ఖర్చు ఎక్కువ. దీనికి ఒక్కొక్కరికి రూ.2.70 లక్షల నుంచి రూ.3.50 లక్షలు ఖర్చు కావచ్చు. కానీ, నేపాల్ హెలికాప్టర్ మార్గంలో వర్షాలు, పొగమంచు వల్ల విమానాలు, హెలికాప్టర్లు రద్దు కావచ్చు. ఈ యాత్రకు ఐటీబీపీ బలగాల భద్రత ఉండదు.

Tags

Related News

గాలిలో వేలాడుతున్న ట్రాక్.. షిమ్లా టాయ్ ట్రైన్లకు బ్రేక్!

వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్.. ఈ రెండు రైళ్ల టైమింగ్స్‌ మారాయ్!

శతాబ్దానికి పైగా చరిత్ర.. ఇప్పటికీ వన్నె తగ్గని నిజామీ వైభవం.. కాచిగూడ రైల్వే స్టేషన్ గొప్పదనం ఇదే!

ఒక్కసారి కాదు.. ఏకంగా 18 సార్లు లాటరీ గెలిచాడు.. అసలు అదృష్టం ఏంటో చెప్పి అందరినీ ఫిదా చేశాడు!

పగలు చెట్టు కొమ్మలా.. రాత్రి దెయ్యంలా.. ఈ పక్షి అరుపు వింటే వెన్నులో వణుకుపుట్టాల్సిందే!

ఏడు కొండల మధ్య 750 ఏళ్ల ఖిల్లా.. చారిత్రక కోటకు ఇక కొత్త కళ!

హిమాలయాల్లో రైల్వే అద్భుతం.. 2029 నాటికి మంచు కొండలను చీల్చుకుంటూ రైలు ప్రయాణం!

Big Stories

Advertisement
×