E-Paper
Advertisement

యశ్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. మళ్ళీ వాయిదా పడనున్న ‘టాక్సిక్’? 250 కోట్ల డీలే కొంపముంచుతోందా!

యశ్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. మళ్ళీ వాయిదా పడనున్న ‘టాక్సిక్’? 250 కోట్ల డీలే కొంపముంచుతోందా!
Advertisement

Yash Toxic : ఒక్క హిట్టు పడగానే అంచనాలని పెట్టేసుకుంటున్నారా..? అంటే యష్ పరిస్థితి చూస్తుంటే అలానే అనిపిస్తుంది మరి. గత సినిమా KGF వెయ్యి కోట్లని కొట్టడంతో టాక్సిక్ సినిమాపై ఎక్కడ లేని ఆశలు పెట్టేసుకోవడం ఇపుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. ఇంతకీ KVN ప్రొడక్షన్స్ పై గీతూ మోహన్ డైరక్షన్ లో ఇంకా షూటింగ్ కూడా పూర్తి చేసుకోని ఈ సినిమా ఎందుకు విమర్శల పాలవుతుంది చూసేద్దాం.

అడ్రస్ లేని షూటింగ్.. అస్తవ్యస్తంగా ప్లానింగ్

Advertisement

నిజానికి టాక్సిక్ మార్చిలో రావాలి. కాని కారణాలేవైనా సినిమా జూన్ 10 కి వెళ్ళిపోయింది. కానీ వాలకం చూస్తుంటే ఈ సినిమా ఇపుడు జూన్ 10 కి రావడం కూడా కష్టమే అనిపిస్తుంది. దీనికి కారణం ఏంటో తెలుసా.. రిలీజ్ విషయంలో మేకర్స్ సరైన ప్లానింగ్ చేయకపోవడమే. అసలు సినిమా సగం కూడా కంప్లీట్ కాలేదని, పైగా సినిమా అవుట్‌పుట్ విషయంలో ప్రొడ్యూసర్స్ చాలా డిసప్పాయింట్ అవడంతో సినిమాని కావాలని పోస్ట్ పోన్ చేస్తున్నారన్నది ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్.

also read :కరాటే క్వీన్ టు ఐటమ్ బాంబ్.. తెలుగు వెండితెరపై ఆమెదో అరుదైన రికార్డ్!

Advertisement

110 కోట్లు ఎక్కువంటే.. రూ. 250 కోట్లు అడగడమా?

ఇక సినిమా విషయంలో వినిపిస్తున్న మరో నెగెటివ్ టాక్ ఓటీటీ డీల్. అవును. ప్రస్తుతం యష్ కున్న మార్కెట్ బట్టి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ దాదాపు 110 కోట్లు ముట్టజెపుతామంటే.. అబ్బే మాకు 250 కోట్లు అయితే కాని గిట్టుబాటు కాదంటూ మెలిక పెడుతున్నారట మేకర్స్. అసలు ఇప్పటి వరకు వదిలిందే ఒక టీజర్. ఇంకా సినిమాపై బజ్ ఏ మాత్రం క్రియేట్ అవుతుందో తెలీదు. కానీ వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా KGF పేరు చెప్పి అంత భారీగా డిమాండ్ చేయడం ఏమీ బాగోలేదు అన్నది ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. ఇక ప్రస్తుతం ఈ ఓటీటీ రైట్స్ విషయంలోనే పీట ముడి పడిందని, ఇది తేలితే కాని ప్రొడక్షన్ ముందుకు వెళ్ళేలా లేదట.

హీరో యశ్ ‘ఈగో’ దెబ్బకొడుతోందా?

ఇక మరో వైపు ఈ డైలమా అంతటికి ప్రధాన కారణం హీరో యష్ ప్రవర్తిస్తున్న తీరే అని ఇన్‌సైడ్ టాక్. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ప్రతినిధులు సినిమా ఎలా ఉందో చూపించమంటే నో చెబుతున్నాడట యష్. ఎవరైనా సినిమా చూడాలంటే అది థియేటర్లోనే తప్ప స్పెషల్‌గా చూపించడం కుదరదు అంటూ ఖరాఖండిగా చెప్పేస్తున్నాడట మన రాఖీ బాయ్. దీంతో కంటెంట్ పై కాన్ఫిడెన్స్ ఉంటే తప్పక చూపించే వాళ్లని, అది లేకే ఇలా సాకులు చెబుతున్నారంటూ బ్యాక్ స్టెప్ వేస్తున్నాయట స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్. ఇక యష్ పడుతున్న ఈ పంతం వల్లే సినిమా ఫైనాన్షియర్ల దగ్గర ఇబ్బందుల్లో పడుతుందని తెలుస్తుంది.

టీజర్ లో బోల్డ్ సీన్స్.. విమర్శల వెల్లువ

ఇక ఇవన్నీ ఇలా ఉంటే ఆ మధ్య టాక్సిక్ నుండి వదిలిన టీజర్ లో బోల్డ్ సీన్స్ ఎక్కువై పోయాయని, దాని వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ నుండి సినిమా పట్ల రిజెక్షన్ వస్తుందన్న టాక్ కూడా వినిపించింది. KGF తర్వాత యష్ సాలిడ్ సబ్జెక్ట్ పై ఫోకస్ చేయాల్సిందిపోయి ఇలాంటి అడల్ట్ టచ్ ఉన్న కంటెంట్ ఎంచుకోవడం ఎంటన్న క్వశ్చన్స్ గట్టిగానే రైజ్ అవుతున్నాయ్. అటు కంటెంట్ పరంగా ట్రోల్స్, ఇటు బిజినెస్ పరంగా కాంట్రవర్సీస్.. కట్ చేస్తే సినిమా ఒక టాక్సిక్ స్టేజ్ లోకి వెళ్ళిపోయిందని చెడుగుడు ఆడేస్తున్నారు నెటిజన్లు.

చూడాలి మరి వీటన్నింటికి ఆన్సర్ ఇస్తూ సినిమాని జూన్ 10కే వదులుతారా లేక రూమర్స్ బూస్టప్ ఇస్తూ మరో తేదీకి మారిపోతారా!

also read :దిల్ రాజు మాస్టర్ ప్లాన్.. రవితేజ బలి? ఆ టైటిల్ వెనుక అసలు కథ తెలిస్తే షాక్ అవుతారు!

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×