E-Paper
Advertisement

దిల్ రాజు మాస్టర్ ప్లాన్.. రవితేజ బలి? ఆ టైటిల్ వెనుక అసలు కథ తెలిస్తే షాక్ అవుతారు!

దిల్ రాజు మాస్టర్ ప్లాన్.. రవితేజ బలి? ఆ టైటిల్ వెనుక అసలు కథ తెలిస్తే షాక్ అవుతారు!
Advertisement

Ravi Teja : ఇప్పుడుమాస్ మహారాజ రవితేజ టైమ్ అస్సల్ బాగోలేదు. ‘ధమాకా’ తర్వాత చేసిన టైగర్ నాగేశ్వరరావు, ఈగిల్, మిస్టర్ బచ్చన్, రావణాసుర, మాస్ జాతర.. ఇలా చేసిన సినిమా చేసినట్టే డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో, ఆశలన్ని ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’ మీదే పెట్టుకున్న పరిస్థితి. కానీ పొంగల్ బరిలోకి దిగిన ఈ సినిమా కూడా హిట్టుకి ప్లాపుకి మధ్యలో ఉండిపోవడంతో, ఈసారైనా మా మాస్ మహారాజ్ సాలిడ్ హిట్ కొడితే బాగుండు అని ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు.

మరో పరాజయానికి పరుగులు తీస్తున్నాడా?

Advertisement

కాని రవితేజ నెక్స్ట్ సినిమాల విషయంలో వేస్తున్న అడుగులు చూస్తుంటే మరో పరాజయానికి పరుగులు తీస్తున్నాడా అన్న డౌట్ వస్తుంది. విషయంలోకి వెళ్తే.. అప్పుడెప్పుడో ‘భద్ర’, ‘రాజా ది గ్రేట్’ అంటూ సాలిడ్ హిట్స్ ఇచ్చిన దిల్ రాజు బ్యానర్లో మరో సినిమా చేయనున్నారట రవితేజ. ‘రాజ రాజ చోర’ సినిమా తీసిన హసిత్ గోలి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. అంతా బాగానే ఉంది కానీ, ఈ సినిమాకి పెడుతున్న టైటిలే ఇపుడు సినిమా చుట్టూ నెగెటివ్ వైబ్స్ పెంచేస్తుంది.

ALSO READ:పుష్ప 2 రేంజ్ హైప్.. కానీ ప్రమోషన్లు సున్నా! పెద్ది టీమ్ ప్లానింగ్ ఇంతేనా?

Advertisement

ఆ టైటిల్ ఏంటి సామీ? 

మాములుగా రవితేజ సినిమా అంటేనే పవర్‌ఫుల్ టైటిల్స్ మరియు హైలీ యాక్షన్ ఎంటర్ టైనింగ్ సీన్స్ గెస్ చేస్తాం. కానీ హసిత్ గోలి దర్శకత్వంలో రానున్న ఈ సినిమాకి ‘అక్కాయిలు బాగున్నారా?’ అనే టైటిల్ పెట్టబోతున్నారన్న టాక్ వినిపిస్తుంది. దీంతో మాస్ మహారాజ్ సినిమాకి ఇలాంటి క్లాస్ టైటిల్స్ పెట్టడం ఏంటి? అసలు రవితేజకి, ఈ టైటిల్స్ కి ఏమైనా సంబంధం ఉందా? అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలెట్టేశారు నెటిజన్లు.

ఇక డైరెక్టర్ హసిత్ గోలి అంటేనే క్లాస్ డైరెక్టర్ అన్న పేరుంది. ఆయన తీసిన ‘రాజ రాజ చోర’, ‘స్వాగ్’ వంటి సినిమాలే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. మరి అలాంటి సెన్సిబుల్ డైరెక్టర్, మాస్ మహారాజ్ తో ఇలాంటి టైటిల్ పెట్టి ఎలాంటి సినిమా తీస్తాడా అంటూ అందరూ క్యూరియస్ గా వాచ్ చేస్తున్నారు. అసలు రవితేజ ఇమేజ్ కి, హసిత్ టేకింగ్ కి ఎలా సింక్ అవుతుందనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఇలాగే ఎక్స్పరిమెంట్స్ అంటూ గతంలో రవితేజ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలు రాబట్టాయో చెప్పక్కర్లేదు. ఇక ఈసారి కూడా ఈ ప్రయోగం వికటిస్తే మాత్రం రవితేజ కెరీర్ ఇబ్బందుల్లో పడ్డట్టే.

ఫ్లాపుల భయం.. రూటు మారుస్తున్నారా?

అయితే వినిపిస్తున్న మరో టాక్ ఏంటంటే.. గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేకపోవడంతో, కనీసం మాస్ ఫార్ములాని పక్కన పెట్టి ఇలా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ జానర్ వైపు ఫోకస్ చేశాడని వినిపిస్తుంది. ఇప్పటికే అందులో భాగంగా శివ నిర్వాణతో ‘ఇరుముడి’ని సెట్స్ పై పెట్టేసిన రవితేజ, ఇపుడు ‘అక్కాయిలు బాగున్నారా?’ అనే మరో కామెడీ ఎంటర్ టైనర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇన్ సైడ్ టాక్. అయితే సినిమా వెనుక సినిమాలని ఇలా అనౌన్స్ చేసేముందు స్టోరీలపై ఫోకస్ పెడితే హిట్స్ ఆటోమేటిక్ గా వస్తాయని విశ్లేషిస్తున్నారు ట్రేడ్ పండిట్స్.

చూడాలి మరి, రవితేజ ఇమేజ్ కి భిన్నంగా భారీ బడ్జెట్ తో చేస్తున్న ఈ రిస్కీ ప్రాజెక్ట్ దిల్ రాజుకి ఏమేరకి కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందో!

ALSO READ:టాలీవుడ్ బిగ్గెస్ట్ మిస్టరీ.. బాలయ్య, శ్రీదేవి కాంబినేషన్లో ఆగిన ‘మెగా’ ప్రాజెక్ట్ వెనుక అసలు కథ ఇదే!

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×