E-Paper
Advertisement

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా?  దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!
Advertisement

How to sell old phone online for cash: ప్రతి ఇంటా అల్మారాలో ఎవరికీ ఉపయోగపడకుండా పడి ఉన్న పాత ఫోన్లు కచ్చితంగా ఉంటాయి. కొత్త మోడల్ కొన్న తర్వాత పాత మొబైల్‌ను ఎక్కడ పడేయాలో తెలియక అలాగే వదిలేస్తుంటాం. కానీ మీకు తెలుసా? ఆ పనికిరానిదనుకునే.. పాత ఫోన్ ద్వారా మీరు ఈజీగా వేల రూపాయలు సంపాదించొచ్చు! ప్రస్తుతం మార్కెట్లో సెకండ్ హ్యాండ్ ఫోన్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. మీ పాత మొబైల్‌ను ఆన్‌లైన్‌లో.. మంచి ధరకు అమ్మి సొమ్ము చేసుకునే మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పాత ఫోన్‌తో వేల రూపాయలు :

ఇంట్లో వృథాగా పడి ఉన్న పాత గ్యాడ్జెట్లను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ పాత ఫోన్ డెడ్ అయిపోయినా.. లేదా పని చేస్తున్నా దానికి తగ్గ రీసేల్ విలువ ఉంటుంది. దానిని సరైన పద్ధతిలో ఆన్‌ లైన్‌లో అమ్మడం ద్వారా డబ్బు సంపాదించొచ్చు.

Advertisement

1. పాత ఫోన్ విలువను అంచనా వేయడం :

మీ ఫోన్ బ్రాండ్, మోడల్, అది ఎంత కాలం వాడారనే దానిపై దాని ధర ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో.. ప్రముఖ రీసెల్లింగ్ ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మీ ఫోన్ వివరాలు ఎంటర్ చేస్తే.. కంపెనీలే స్వయంగా.. మీ ఇంటికి వచ్చి ఫోన్‌ను చెక్ చేసి సరైన ధరను ఇస్తాయి. సాధారణంగా మంచి కండిషన్‌లో.. ఉన్న పాత స్మార్ట్‌ ఫోన్‌లకు రూ. 2,000 నుంచి రూ.8,000 వరకు ధర లభిస్తుంది.

2. ఆన్‌లైన్‌లో అమ్మడానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

Advertisement

మీ ఫోన్‌ను వేరే వారికి అమ్మే ముందు కొన్ని అత్యంత కీలకమైన చర్యలు తీసుకోవాలి.

డేటా బ్యాకప్: మీ ఫోన్లోని ఫోటోలు, కాంటాక్ట్స్ , ముఖ్యమైన డాక్యుమెంట్లన్నింటినీ గూగుల్ డ్రైవ్ లేదా కంప్యూటర్‌లోకి బ్యాకప్ చేసుకోండి.

ఫ్యాక్టరీ రీసెట్: మీ పర్సనల్ డేటా ఏదీ ఇతరులకు దొరకకుండా ఫోన్‌ను పూర్తిగా ‘ఫ్యాక్టరీ రీసెట్’ చేయాలి.

సిమ్ ,మెమరీ కార్డ్ తొలగింపు: మీ సిమ్ కార్డ్ , ఎస్‌డీ కార్డ్‌లను కచ్చితంగా బయటకు తీసేయడం మర్చిపోవద్దు.

3. ఫోన్‌ను శుభ్రపరచడం:

మనం ఏదైనా వస్తువును అమ్మేటప్పుడు.. అది చూడటానికి శుభ్రంగా ఉంటే.. కొనాలనుకునే వారు త్వరగా ఆకర్షితులవుతారు. ఫోన్ స్క్రీన్ పై ఉన్న డస్ట్ లేదా మరకలను మైక్రోఫైబర్ క్లాత్‌తో.. నీట్ గా తుడవండి. అలాగే ఒరిజినల్ ఛార్జర్, బాక్స్ , బిల్లు ఉంటే.. వాటిని కూడా కస్టమర్‌కు ఇవ్వండి. దీని వల్ల మీ ఫోన్‌కు మార్కెట్లో అదనపు ధర (రూ. 500 నుంచి రూ. 1,000 వరకు ఎక్కువ) లభించే అవకాశం ఉంది.

4. సరైన ప్లాట్‌ఫారమ్‌ను ఎంచుకోవడం:

పాత ఫోన్లను అమ్మడానికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి.

డెడికేటెడ్ రీసెల్లింగ్ యాప్స్: క్యాషిఫై లేదా లాంజా వంటి యాప్స్ ద్వారా నేరుగా అమ్ముకోవచ్చు. వీరు ఇన్‌స్టాంటెడ్ క్యాష్ లేదా ఆన్‌లైన్ పేమెంట్ ఇస్తారు.

పీర్-టు-పీర్ ప్లాట్‌ఫారమ్స్: ఓఎల్ఎక్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో మీరే.. స్వయంగా ఫోన్ ఫోటోలు పెట్టి ధరను నిర్ణయించి నేరుగా కొనే వారితో బేరం మాట్లాడొచ్చు.

Also Read: బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

5. ధరలు :

మార్కెట్ ట్రెండ్స్ ప్రకారం పాత ఫోన్ల రీసేల్ ధరలు ..

సాధారణ బేసిక్ స్మార్ట్‌ఫోన్‌లకు కండిషన్‌ను బట్టి రూ.1,500 నుంచి రూ.3,500 వరకు వస్తాయి.

మిడ్-రేంజ్ లేదా మంచి బ్రాండెడ్ పాత ఫోన్లకు రూ. 4,000 నుంచి రూ.10,000 వరకు ధర లభిస్తుంది.

ఇవన్నీ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఎలాంటి చార్జీలు లేకుండా.. ఫ్రీగా వాల్యుయేషన్ చేయించుకోవచ్చు.

ఇంట్లో పారేద్దామనుకునే పాత ఫోన్లను ఇలా ఆన్‌లైన్‌లో అమ్మడం ద్వారా పర్యావరణానికి మేలు చేయడంతో పాటు మనకు కొంత అదనపు ఆదాయం కూడా వస్తుంది. ఆన్‌లైన్‌లో అమ్మేటప్పుడు సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని నమ్మకమైన ప్లాట్‌ఫారమ్‌లను మాత్రమే ఎంచుకోవడం చాలా ముఖ్యం.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×