E-Paper
Advertisement

Just Corseca Sound Bar: సరికొత్త సౌండ్‌బార్లను దింపిన జస్ట్ కోర్సెకా.. ఇక 200వాట్ల ఆడియో డివైజ్‌తో ఇంట్లో దబిడదిబిడే!

Just Corseca Sound Bar: సరికొత్త సౌండ్‌బార్లను దింపిన జస్ట్ కోర్సెకా.. ఇక 200వాట్ల ఆడియో డివైజ్‌తో ఇంట్లో దబిడదిబిడే!
Advertisement

Just Corseca Sound Bar: అతి తక్కువ ధరలో 200వాట్ల ఆడియో ఔట్‌పుట్‌తో ప్రముఖ ఎలక్ట్రానిక్‌ తయారీ సంస్థ జస్ట్ కోర్సెకా రెండు సరికొత్త సౌండ్‌బార్‌లను లాంచ్ చేసింది. అవి జస్ట్ కోర్సెకా సోనిక్ బార్, జస్ట్ కోర్సెకా సౌండ్ షాక్ ప్లస్ పేర్లతో మార్కెట్లోకి వచ్చాయి. ఈ డివైజ్‌లు 2.2-ఛానల్ సెటప్, సబ్ వూఫర్‌తో 200W వరకు సౌండ్ ఔట్‌పుట్‌ను అందిస్తాయని సంస్థ తెలిపింది. మరి ఈ న్యూ డివైజ్ ధరెంత? ఎక్కడ కొనుగోలు చేయాలి.. వంటి వివరాలు చూసేద్దామా..

చౌకైన ధరలో:

జస్ట్ కోర్సెకా విడుదల చేసిన ఈ సరికొత్త సౌండ్‌బార్లలో ఒకటైన సోనిక్ బార్ ధర రూ.7,499 కాగా.. రెండోది సౌండ్ షాక్ ప్లస్ ధర రూ.6,499. దీనికి బ్లూటూత్, HDMI ARC, USB వంటి కనెక్టివిటీ ఎంపికలతో పాటు.. సంస్థ ఒక ఏడాది వారంటీని కూడా అందిస్తోంది. మీరు ఈ సౌండ్‌బార్‌లను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లలో కొనుగోలు చేయవచ్చు.

Advertisement

Read Also: వారెవ్వా అనేలా హానర్ కొత్తఫోన్.. 200MP కెమెరా, 7200 mAh బ్యాటరీతో లాంచ్!

జస్ట్ కోర్సెకా సోనిక్ బార్:

ఈ జస్ట్ కోర్సెకా సోనిక్ బార్ 2.2 ఛానల్ లేఅవుట్‌తో కూడిన సబ్ వూఫర్‌ను కలిగి ఉంటుంది. ఇది వైర్‌లెస్, వైర్డ్‌ కనెక్టివిటీ ఎంపికలతో వచ్చింది. ఇది 200W సౌండ్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంటుంది. 120W సౌండ్‌బార్ నుంచి, 80W సబ్ వూఫర్ నుంచి వస్తుంది. కనెక్టివిటీ ఎంపికల్లో బ్లూటూత్ v5.0, HDMI ARC, కోక్సియల్, USB సహా AUX ఉన్నాయి. ఈ సౌండ్‌బార్‌ను టీవీ, ప్రొజెక్టర్, ఫోన్, పీసీ, ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు.

జస్ట్ కోర్సెకా సౌండ్ షాక్ ప్లస్:

Advertisement

ఇక జస్ట్ కోర్సెకా సౌండ్ షాక్ ప్లస్ విషయానికొస్తే.. ఈ సౌండ్‌బార్ 160W సౌండ్ ఔట్‌పుట్‌ను కలిగి ఉంటుంది. సౌండ్‌బార్ నుంచి 90W, సబ్‌ వూఫర్ నుండి 60W ఔట్‌పుట్ అందిస్తుంది. ఈ జస్ట్ కోర్సెకా సౌండ్ షాక్ ప్లస్ సౌండ్‌బార్‌ 2.2 ఛానల్ ఆడియోతోనూ వస్తుంది. కనెక్టివిటీ ఎంపికలను కూడా పొందవచ్చు. ఈ సౌండ్‌బార్‌లో TF కార్డ్, FMని కూడా ఉపయోగించుకోవచ్చు.

Read Also: మైండ్ బ్లోయింగ్ మావా.. అదిరిపోయే డిస్‌ప్లేతో ఒప్పో నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్!

Related News

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

Big Stories

Advertisement
×