E-Paper
Advertisement

Heroine Extra Expenses : నిర్మాతలకు భారంగా మారుతున్న హీరోయిన్… ఆ ఒక్క సక్సెస్ వల్లే ?

Heroine Extra Expenses : నిర్మాతలకు భారంగా మారుతున్న హీరోయిన్… ఆ ఒక్క సక్సెస్ వల్లే ?
Advertisement

Heroine Extra Expenses : సినిమా ఇండస్ట్రీలో అదృష్టం ఎప్పుడు? ఎలా? ఎవరి తలుపు తడుతుందో చెప్పలేని పరిస్థితి. ఇండస్ట్రీలోకి వచ్చి.. మొదటి సినిమాతోనే విజయం సాధించి.. వరుసగా హ్యాట్రిక్ లు అందుకున్న వారు ఉన్నారు. మరి కొంతమంది ఇండస్ట్రీలోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా.. ఆ అదృష్టం లభించక గుర్తింపు లేనివారి గానే చలామణి అవుతూ ఉంటారు. అయితే మరికొంతమంది మొదట్లో సక్సెస్ లు రాక సతమతమవుతూ.. ఆ తర్వాత సక్సెస్ లభిస్తే ఆ సక్సెస్ ని నిలబెట్టుకోవడం కోసం తెగ కష్టపడతారు.. కానీ మరి కొంతమంది మాత్రం వచ్చిన సక్సెస్ ను క్యాష్ చేసుకోవడానికి నిర్మాతలుగా భారంగా మారుతున్నారు అనడంలో సందేహం లేదు.

ఒక్క సక్సెస్ తో భారీ డిమాండ్..

ఈ క్రమంలోనే ఇతర భాష ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ కి వచ్చి ఇక్కడ కూడా రెండు చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది ఒక ముద్దుగుమ్మ. అయితే ఆ రెండు చిత్రాలు కూడా డిజాస్టర్ గా నిలిచాయి. అంతేకాదండోయ్ ఇటీవల తమిళ్ చిత్రంతో కూడా వచ్చి డిజాస్టర్ ను మూటగట్టుకుంది. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా ఒక పాన్ ఇండియా మూవీ ప్రీక్వెల్ లో నటించడమే కాకుండా అందులో విలన్ పాత్ర పోషించి తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.. పైగా ప్రస్తుతం మరో రెండు పాన్ ఇండియా చిత్రాలలో.. బడా స్టార్ హీరోల సరసన నటిస్తోంది కూడా.. ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది విడుదల కాబోతున్నాయి.

నిర్మాతలకు భారంగా మారిన యంగ్ హీరోయిన్..

Advertisement

ఇన్ని రోజులు సక్సెస్ కోసం ఆరాటపడిన ఈ హీరోయిన్ కి సడన్గా మంచి సక్సెస్ లభించడంతో భారీగా డిమాండ్ చేస్తోంది. నిర్మాతలకు చుక్కలు చూపిస్తూ.. నెక్స్ట్ సినిమాలో తీసుకోవాలంటేనే భయపడేలా చేస్తోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.. అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల సూపర్ సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. తీరు దాదాపుగా మారిపోయింది అని సినీ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కొంత రెమ్యూనరేషన్ పెంచడంతోపాటు ఇతర మెయింటెనెన్స్ ఖర్చులు కూడా భారీగా పెంచేసింది. అటు రెమ్యూనరేషన్ తో పాటు ఆమెతో పాటూ వచ్చే బాడీగార్డ్స్ కి భోజనం అలాగే వసతి.. బ్యూటీషియన్, మేకప్ మ్యాన్, హెయిర్ స్టైలిస్ట్ ఇలా తన టీం కి అయ్యే ఖర్చులు కూడా నిర్మాతలే భరించాలి అని కండిషన్లు కూడా పెడుతోందట.

ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్తులో కష్టమే..

ఇవన్నీ చూసిన నిర్మాతలు.. ఈ యంగ్ హీరోయిన్ కి ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇవ్వలేమని.. ఈమె ఖర్చులే ఎక్కువగా ఉన్నాయని వాపోతున్నారు. ఏది ఏమైనా ఇన్ని రోజులు సక్సెస్ కోసం.. అవకాశాల కోసం ఎదురుచూసిన ఒక యంగ్ బ్యూటీ సడన్గా అవకాశాలు వచ్చేసరికి వాటిని సద్వినియోగం చేసుకోకుండా ఇలాంటి డిమాండ్ లు చేస్తూ నిర్మాతలకు భారంగా మారడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒకవేళ ఈ హీరోయిన్ మునుముందు కూడా ఇలాగే డిమాండ్ చేస్తే మాత్రం మళ్లీ నిర్మాతలు ఈమెను పట్టించుకుంటారా అనే అనుమానాలు కూడా ఇండస్ట్రీ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

also read: OTT Platforms: ఏంటీ.. ఏడాదికి ఒక్కో ఓటీటీ ప్లాట్ఫారం ఆదాయం అన్ని వేలకోట్లా?

Related News

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

Big Stories

Advertisement
×