E-Paper
Advertisement

ప్రియుడిపై మోజుతో అవకాశాలను వదులుకుంటున్న స్టార్ హీరోయిన్.. నష్టం తప్పదా?

ప్రియుడిపై మోజుతో అవకాశాలను వదులుకుంటున్న స్టార్ హీరోయిన్.. నష్టం తప్పదా?
Advertisement

Film industry: సాధారణంగా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే అందుకు తగ్గట్టుగా కొంతమంది ఈ సామెతను ఉపయోగించుకుంటూ చక్కగా అవకాశాలు అందుకొని వచ్చిన రెమ్యూనరేషన్ ను వివిధ రంగాలలో పెట్టబడులుగా పెట్టి.. భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటున్న విషయం తెలిసిందే. మరి కొంతమంది అవకాశాలు వచ్చినా సరే ఇతర వ్యామోహాల కారణంగా బంగారం లాంటి అవకాశాలను కోల్పోయి.. భవిష్యత్తులో ఇబ్బందులు పడతారేమో అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి.. ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ ప్రియుడు మోజులో పడి అవకాశాలను కూడా వదులుకుంటోంది. ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఇకపై ఈమె ఇలాగే ప్రవర్తిస్తే భవిష్యత్తులో నష్టపోక తప్పదు అంటూ హెచ్చరిస్తున్నారు..

ప్రియుడి మోజులో పడి అవకాశాలు వదులుకుంటున్న బ్యూటీ..

అసలు విషయంలోకి వెళ్తే.. ఈ హీరోయిన్ కి ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటి నుంచే అవకాశాలు తక్కువ. కాకపోతే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులలో ఆదరణ కూడా పొందింది. అయితే ఇప్పుడు ఈ నటి డేటింగ్ లో ఉంది. ఒక హీరోతో ప్రేమాయణం కూడా సాగిస్తోంది. ఆ హీరో కూడా ఖాళీనే. భారీ విజయం అందుకున్న తర్వాత ఒక్కసారిగా ఆయన చతికిలపడ్డాడు. ఇప్పుడు ఈ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడు. ఇండస్ట్రీలోని కొన్ని సర్కిల్లో వీళ్ళ ప్రేమాయణం ఒక ఓపెన్ సీక్రెట్ అని చెప్పాలి.

భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవా..

Advertisement

ఇక ఆ హీరో సంగతేమో కానీ ఈ హీరోయిన్ మాత్రం తన డేటింగ్ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. వీలైతే తమ బంధాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ఆలోచనలో కూడా ఉంది. ఈ క్రమంలోనే తన ప్రేమాయణాన్ని పెళ్లిగా మార్చుకోవడానికి కెరియర్ ని కూడా పక్కన పెట్టేసింది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే తాజాగా ఒక ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ ఆఫర్ వస్తే సున్నితంగా తిరస్కరించింది. తనకు టైం లేదని చెప్పి వాళ్లను వెనక్కి పంపించేసింది. నిజానికి ఆమె దగ్గర ఎలాంటి సినిమాలు లేవు.. కాకపోతే తన ప్రియుడితో కలిసి ఉండాలనే ఆలోచనతోనే ఆమె అలా తన ఆఫర్లను కూడా రిజెక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె షూటింగ్స్ లో తక్కువగా కనిపిస్తోంది. ఇలా డేటింగ్ లోనే తన సమయాన్ని మొత్తం వృధా చేస్తుందని చెప్పవచ్చు..

ALSO READ:అడివి శేష్ అలాంటి సమస్యతో బాధపడుతున్నారా.. విస్తుపోయే నిజాలు తెరపైకి!

కళ్ళు తెరవాలంటున్న అభిమానులు..

Advertisement

ఇక వీళ్ళ వ్యవహారం చూస్తే త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇద్దరు ఫ్లాపుల్లోనే ఉన్నారు. అందుకే కెరియర్ పరంగా ఎదిగే దశలో ఉన్న కారణంగానే ఇప్పట్లో పెళ్లి చేసుకోరని కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. లేదు పెళ్లి చేసుకొని ఆ తర్వాతే కెరియర్ను కొనసాగిస్తారని మరికొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ హీరోయిన్ ఇప్పుడు ఆ హీరో మోజులో పడి వచ్చిన అవకాశాలను వదులుకుంటూ భవిష్యత్తులో ఇబ్బందులు పడుతుందేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా ఆ హీరోయిన్ కళ్ళు తెరిచి భవిష్యత్తు గురించి ఆలోచించాలని ఆకాంక్షిస్తున్నారు.

Related News

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

Big Stories

Advertisement
×