E-Paper
Advertisement

9వ తేదీన పుట్టరా..? మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా..?

9వ తేదీన పుట్టరా..? మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా..?
Advertisement

Born on the 9th: సంఖ్యాశాస్త్రం (Numerology) ప్రకారం 9వ తేదీన జన్మించిన వ్యక్తులు అత్యంత శక్తివంతులు, అలాగే దయ కలిగిన వారట. 9వ అంకెకు అధిపతి కుజుడు కావడంతో 9వ తేదీన పుట్టిన వారి జీవితం, వారి ప్రత్యేకతలు మరియు వృత్తి రంగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

9వ తేదీన పుట్టిన వారి ప్రత్యేకతలు: 9వ తేదీన పుట్టిన వారికి ఇతరులకు సహాయం చేయాలనే తపన చాలా ఎక్కువగా ఉంటుందట. సమాజంలో ఏదైనా మార్పు తీసుకురావాలని వీళ్లు ఎప్పుడూ ఆరాటపడుతుంటారట. వీరు చాలా ఉదార స్వభావులట. కష్టాల్లో ఉన్నవారిని చూసి చలించిపోతారట. అలాగే వీళ్లు ఒక పని చేపట్టారంటే అది పూర్తయ్యే వరకు విశ్రమించరట. ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనకడుగు వేయరట. వీరికి సహనం తక్కువగా ఉంటుందట. ఏదైనా   జరిగితే వెంటనే స్పందించాలి అనుకుంటారట. ఇదే కొన్నిసార్లు వీరిని ఇబ్బందుల్లోకి నెడుతుందట.

Advertisement

భవిష్యత్తు మరియు జీవిత ప్రయాణం: వీరి జీవితం ప్రారంభంలో కొంత సంఘర్షణతో కూడి ఉంటుందట. కుటుంబ బాధ్యతలు లేదా వ్యక్తిగత లక్ష్యాల కోసం వీరు చాలా పోరాడాల్సి వస్తుందట. అయితే 27 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత వీరి జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుందట. ఆ వయస్సు నుండి వీరికి అదృష్టం కలిసొస్తుందట. ఇంకా వీళ్లు అబద్ధాలను, అన్యాయాన్ని అస్సలు సహించరట. సమాజంలో మంచి పేరు, గౌరవం సంపాదించుకుంటారట.

ఏ రంగంలో స్థిరపడతారు?: 9వ తేదీన పుట్టిన వారిలో ఉండే నాయకత్వ లక్షణాలు, సాహసం మరియు మానవత్వం కారణంగా  వీరికి  ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం ఉంటుందట కాబట్టి వీళ్లు రాజకీయాల్లో లేదా స్వచ్ఛంద సంస్థల్లో (NGOs) గొప్ప పేరు తెచ్చుకుంటారట. అలాగే ఇతరుల బాధను అర్థం చేసుకునే గుణం ఉన్నందున, డాక్టర్లు లేదా నర్సులుగా మంచి గుర్తింపు పొందుతారట. కుజుడి ప్రభావం వల్ల వీరికి సైన్యం, పోలీసు శాఖ లేదా ఏ రకమైన రక్షణ రంగంమైన అద్భుతంగా సరిపోతుందట. అలాగే వీరికి సృజనాత్మకత ఎక్కువగా ఉండటం వల్ల నటులుగా, దర్శకులుగా లేదా క్రీడాకారులుగా పేరు ప్రఖ్యాతులు పొందుతారట.

Advertisement

9వ తేదీ పుట్టిన వారి అదృష్ట విషయాలు: వీరికి ఎరుపు, గులాబీ (Pink), మరియు మెరిసే తెలుపు రంగులు అదృష్టాన్ని ఇస్తాయట.  ఈ రంగులు ధరిస్తే వారికి మానసిక ప్రశాంతత, విజయం లభిస్తాయట. అలాగే మంగళవారం, శుక్రవారం అదృష్టమైన వారాలట.

9వ తేదీలో పుట్టిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: 9వ తేదీన పుట్టిన వారికి కోపం ఎక్కువ. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు ఇబ్బందులకు గురిచేస్తాయట. కాబట్టి కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రాణాయామం లేదా ధ్యానం చేయడం చాలా మంచిదని పండితులు సూచిస్తున్నారు. వీరికి అన్యాయమైన మార్గాల ద్వారా డబ్బు సంపాదించకూడదని గట్టిగా నిర్ణయించుకోవాలట. కష్టపడి సంపాదించినదే వీరికి శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుందట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: కోటీశ్వరులు అయ్యే ముందు ఆలాంటి కలలే వస్తాయట – ఇంకా స్వప్న శాస్త్రం ఏం చెప్తుంది

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×