Youth First Look: ఈ మధ్య వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’ చిత్రం ఎలాంటి సక్సెస్‌ను అందుకుందో తెలియంది కాదు. ఇప్పుడో మరోసారి అలాంటి చిత్రంతో యూత్‌ని ఆకట్టుకునేందుకు ఈ2సీ బ్యానర్ ఓ సినిమాను రెడీ చేస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని గురువారం టాలీవుడ్ యంగ్ హీరో విడుదల చేసి, యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ మూవీ ‘యూత్’ (Youth Movie). ఈ చిత్రాన్ని ఇదే పేరుతో ఈ2సీ బ్యానర్ (E2C Banner)పై తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు హౌస్ ఫుల్ వినీత్, సందీప్. ఈ చిత్రానికి కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ (Ken Karunas and Gang) దర్శకత్వం వహించగా.. త్వరలోనే ఈ చిత్రం తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకురానున్నామని ఈ2సీ బ్యానర్ నిర్మాతలు తెలిపారు.
Also Read- Allu Cinemas: అల్లు సినిమాస్.. టాలీవుడ్ డైరెక్టర్లకు ప్రత్యేక గౌరవం..ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
ఇక ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేసిన యంగ్ హీరో ఎవరో కాదు.. ‘క’, ‘కె ర్యాంప్’ వంటి విజయాలతో దూసుకెళుతోన్న కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). సోషల్ మీడియా వేదికగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ వదిలిన కిరణ్ అబ్బవరం.. ఈ2సీ బ్యానర్ నిర్మాతలు వినీత్, సందీప్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నట్లుగా తెలిపారు. వాళ్ల జర్నీ, సినిమాను వాళ్లు ఎంతగా ప్రేమిస్తారో తనకు తెలుసని అన్నారు. ఈ2సీ అంటూ ప్రొడక్షన్‌లోకి అడుగు పెట్టిన వారికి సక్సెస్ రావాలని కోరారు. వాళ్ల జర్నీనే ‘ఇంజనీరింగ్ టు సినిమా’ అనేలా ప్రొడక్షన్ సంస్థకు పేరు పెట్టడం చాలా నచ్చిందని అన్నారు. ఈ సినిమా పోస్టర్ ఒక వైబ్‌ని తీసుకు వస్తుందని, యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు చెప్పారు. ఈ ఫస్ట్ లుక్ వదిలిన కిరణ్ అబ్బవరంకు నిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు.
Also Read- Harish Shankar: రాశీ ఖన్నాతో కలిసి డ్యాన్స్.. గత్తర లేపిన హరీష్ శంకర్!
ఈ ‘యూత్’ మూవీని తెలుగులోకి తీసుకొస్తున్న వినీత్, సందీప్.. ఇద్దరూ కిరణ్ అబ్బవరంతో చాలాకాలంగా ట్రావెల్ చేస్తున్నారు. కిరణ్ వారికి సపోర్ట్‌గా నిలుస్తూ ఈ విధంగా ప్రమోట్ చేయడం గొప్ప విషయం అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ‘యూత్’ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే.. ఇది మంచి యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌లా అనిపిస్తోంది. మలయాళ బ్లాక్ బస్టర్ ‘ప్రేమలు’ తెలుగులోనూ ఘన విజయాన్ని అందుకుంది. అలాగే ఇలాంటి తరహా కంటెంట్‌తోనే వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’ కూడా పెద్ద సక్సెస్‌ని సాధించింది. ఇప్పుడు తెలుగు ఆడియెన్స్‌కు కావాల్సిన యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ జానర్‌లో వస్తున్న ‘యూత్’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే అలాంటి వైబ్స్‌ని క్రియేట్ చేస్తోంది. ఇందులోని ప్రధాన తారాగణం మొత్తాన్ని ఈ పోస్టర్‌లో కవర్ చేశారు. వారంతా స్కూల్ డ్రస్‌లోనే ఉండటం చూస్తుంటే.. ఇంతకంటే ఈ చిత్ర టైటిల్‌కి జస్టిఫికేషన్ ఏముంటుంది? అనేలా ఈ ఫస్ట్ లుక్‌పై కామెంట్స్ పడుతున్నాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Very happy for you both ❤️@viniithbabu & @Sandeep_tweeton
I know your journey & how much you love Cinema.
Wishing you a big success as you step up into production with @E2CTalkies 🤗
Loved how you summed up your journey from Engineering to Cinema ( E2C ) into the Production… pic.twitter.com/bP6Y6Mx0MU— Kiran Abbavaram (@Kiran_Abbavaram) March 12, 2026
Also Read- Actor Nassar: క్షమాపణలు చెప్పాల్సిందే.. రాజేంద్రప్రసాద్ పై నాసర్ ఫైర్..