E-Paper
Advertisement

Harish Shankar: రాశీ ఖన్నాతో కలిసి డ్యాన్స్.. గత్తర లేపిన హరీష్ శంకర్!

Harish Shankar: రాశీ ఖన్నాతో కలిసి డ్యాన్స్.. గత్తర లేపిన హరీష్ శంకర్!
Advertisement

Harish Shankar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). మార్చి 19న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. మరో వైపు మేకర్స్ ఈ చిత్ర ప్రమోషన్స్‌ని యమా జోరుగా నిర్వహిస్తున్నారు. గురువారం ఈ చిత్రంలోని మూడో పాట ‘కాలరే ఎత్తరా’ లిరికల్ సాంగ్‌ (Collar Ey Etthara Lyric Video)ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. ఈ వేడుకకు దర్శకుడు హరీష్ శంకర్‌తో పాటు హీరోయిన్ రాశీ ఖన్నా (Raashi Khanna), మైత్రీ నిర్మాత రవిశంకర్, లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హరీష్ శంకర్, హీరోయిన్ రాశీ ఖన్నాతో కలిసి తాజాగా విడుదలైన పాటకు డ్యాన్స్ చేశారు.

Also Read- Ustaad Bhagat Singh: ‘కాలరే ఎత్తరా’ సాంగ్.. ఫ్యాన్స్‌కు పవర్ స్టార్ ఫీస్ట్.. సంపేశాడుగా!

డ్యాన్స్‌తో గత్తర లేపిన హరీష్ శంకర్

Advertisement

రాశీ ఖన్నాతో హరీష్ శంకర్ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ముందుగా హరీష్ శంకర్ మాట్లాడుతూ.. స్టేజ్‌పై రాశీ ఖన్నా డ్యాన్స్ చేస్తే చూడాలని అనుకుంటున్నారా? అయితే నా స్పీచ్ తర్వాత ఆమె డ్యాన్స్ చేస్తుందని చెప్పారు. తన స్పీచ్ అయిన వెంటనే రాశీ ఖన్నా డ్యాన్స్‌కు రెడీ అవుతుండగా, యాంకర్ వచ్చి మీరు కూడా కాలు కదిపితే బాగుంటుందని అనగానే.. పవర్ స్టార్ చెప్పినట్లుగా మానవ ప్రయత్నం చేస్తానంటూ.. ఫ్యాన్స్ విసిరిన ఎర్ర టవల్ పట్టుకుని.. రంగంలోకి దిగారు. రాశీ‌తో డ్యాన్స్ మ్యాచ్ చేస్తూ.. నిజంగా పాటలో ఉన్నట్లుగానే గత్తర లేపారు. ఈ మధ్యకాలంలో దర్శకులు స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తున్నట్లుగానే.. హరీష్ శంకర్ కూడా తన సినిమా ప్రమోషన్ కోసం కాలు కదపక తప్పలేదు.

Also Read- Jananayagan Film: విజయ్ జననాయగన్ కు మరో దెబ్బ.. ఈ సినిమాపై ఆశలు వదులుకోవాల్సిందేనా?

ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది

Advertisement

ఇక ఈ వేడుకలో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. నటి రాశీ ఖన్నాకు ధన్యవాదాలు తెలిపారు. పవన్ కళ్యాణ్ డేట్స్ చాలా బిజీగా ఉన్న సమయంలో, ఆమెను షూటింగ్ కోసం పిలవగానే ఏమీ అడగకుండా వెంటనే వచ్చారని ఆయన గుర్తు చేసుకున్నారు. అలాగే ప్రమోషన్స్‌లో కూడా పాల్గొంటున్నందుకు మరోసారి ఆమెకు థ్యాంక్స్ చెప్పారు. ఈ పాట షూట్ చేసే సమయంలో సెట్‌లో దాదాపు 1500 నుండి 2000 మంది జనం మధ్య పవన్ కళ్యాణ్ డ్యాన్స్ చేయాల్సి వచ్చినప్పుడు జరిగిన ఆసక్తికరమైన విషయాన్ని ఆయన పంచుకున్నారు. అంత మంది మధ్య డ్యాన్స్ చేయాలా అని పవన్ కళ్యాణ్ మొదట అడిగారని, కానీ దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన బీట్స్‌కి ఆ మాత్రం ఉండాలని చెప్పగానే ‘మానవ ప్రయత్నం’ చేద్దామంటూ.. ‘సంపేద్దాం పదా’ అని అన్నట్లుగా హరీష్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం కేవలం డేట్స్ ఇవ్వడమే కాకుండా, ఎంతో ప్రాణం పెట్టి పనిచేశారని, అందుకే మొదటి నుంచి ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోతుందని చెబుతూ వస్తున్నానని హరీష్ శంకర్ అన్నారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సీన్లలో ఆయన నటన అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ఈ పాటలో డీఎస్పీ ఇచ్చిన బీట్స్ థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగా అలరిస్తాయో ఊహించుకోవచ్చని ఆయన అన్నారు. మైత్రీ నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా భారీ సెట్లు వేయించారని, సినిమా కోసం వారు అందిస్తున్న సహకారం చూసి, ఇలాంటి నిర్మాతలు దొరకడం తన పూర్వజన్మ సుకృతమని హరీష్ శంకర్ వ్యాఖ్యానించారు.

Also Read- Rashmika Mandanna: రష్మిక మెహందీ చీరపై తంజోరి లక్ష్మి దేవి.. సోషల్ మీడియాలో కాంట్రవర్సీ.. కానీ ఎన్ని ప్రత్యేకతలో!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×