Youth Movie: తెలుగు సంవత్సరాది ‘ఉగాది’ వెళ్లిపోయి, శ్రీరామ నవమి వస్తుంది. ఉగాదికి థియేటర్లలోకి వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) మిక్స్‌డ్ టాక్‌తో థియేటర్లలో రన్ అవుతుంటే, బాలీవుడ్ ఫిల్మ్ ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. ఇక శ్రీరామ నవమికి చిన్న సినిమాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. వీటిలో ‘బ్యాండ్ మేళం’ వంటి స్ట్రయిట్ సినిమాకి పోటీగా ‘హ్యాపీ రాజ్’, ‘యూత్’ అనే డబ్బింగ్ సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి. ఈ సినిమాలన్నింటికి ప్రమోషన్స్‌ని ఓ రేంజ్‌లో నిర్వహిస్తున్నారు. ఈ సినిమాలపై మేకర్స్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాయి. కాకపోతే వీటిలో ఓ సినిమాకు చివరి నిమిషంలో రిలీజ్ డేట్‌ని ఛేంజ్ చేశారు. రిలీజ్ డేట్ ఛేంజ్ అనగానే ఓ వారం, పది రోజులు అనుకుంటారేమో.. అలా ఏం లేదు. కేవలం ఒకే ఒక్క రోజు ఈ సినిమాను వాయిదా వేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read- Anna Lezhneva: చిరంజీవిని పవన్ కళ్యాణ్ వైఫ్ ఏమని పిలిచారంటే? భావోద్వేగంలో మెగా ఫ్యాన్స్!
కెన్ కరునాస్ (Ken Karunaas), అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ మూవీ ‘యూత్’ (Youth Movie). ఈ సినిమాను ఈ నెల 26న రిలీజ్ చేస్తున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించి, ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. కానీ, అనివార్య కారణాలతో ఈ సినిమా ఒక రోజు ఆలస్యంగా, అంటే ఈ నెల 27న థియేటర్స్‌లోకి రాబోతోందని మేకర్స్ సడెన్‌గా ఓ ప్రకటన చేశారు. అలాగే పెయిడ్ ప్రీమియర్స్ పై కూడా ప్రకటన చేస్తామని ప్రొడ్యూసర్స్ వెల్లడించారు. ఇప్పటికే తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఈ2సీ బ్యానర్ పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు హౌస్ ఫుల్ వినీత్, సందీప్. ఇప్పటి వరకు చేసిన ప్రమోషన్స్, వచ్చిన కంటెంట్.. నిజంగానే ఇది యూత్ ఫిల్మ్ అనే ఓ అంచనాని ప్రేక్షకులకు ఇచ్చింది.
Also Read- Anchor Ravi: పెట్రోల్ సమస్యపై యాంకర్ రవి ఆగ్రహం.. ప్రభుత్వం చెప్పలేదంటూ..
మరో ‘లిటిల్ హార్ట్స్’ అవుతుందని అంతా ఊహించుకుంటున్న సమయంలో మేకర్స్ ఈ స్మాల్ ఛేంజ్‌ని ప్రకటించారు. అందుకు కారణాలు ఏంటనేది మాత్రం మేకర్స్ తెలపలేదు. కానీ, ఎప్పుడు విడుదలైనా, గ్యారంటీగా హిట్ అవుతుందని మాత్రం మేకర్స్ యమా ధీమాగా ఉన్నారు. కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ‘కమ్ విత్ యువర్ గ్యాంగ్, నోట్ – నో ఏజ్ లిమిట్’ అనే స్లోగన్‌తో ప్రమోషనల్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈ సినిమాను యూత్ ఆడియెన్స్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామనేలా సోషల్ మీడియాలో రెస్పాన్స్ వస్తుండటం విశేషం. ఒక్క రోజులో ఏం మునిగిపోదు కాబట్టి.. మార్చి 27న ఈ సినిమా కోసం ‘యూత్’ ఎలా థియేటర్ల వద్ద బారులు తీరుతారో.. వెయిట్ అండ్ సీ.
Also Read- Jr NTR: భార్య ప్రణతి బర్తడే..ఎన్టీఆర్ స్పెషల్ సర్ప్రైజ్!