E-Paper
Advertisement

Sreenu Vaitla Land Scam: 7.2 కోట్ల భూ కుంభకోణం..టాలీవుడ్‌లో సంచలనం రేపుతున్న శ్రీను వైట్ల !

Sreenu Vaitla Land Scam: 7.2 కోట్ల భూ కుంభకోణం..టాలీవుడ్‌లో సంచలనం రేపుతున్న శ్రీను వైట్ల !
Advertisement

Sreenu Vaitla Land Scam: రీల్ లైఫ్‌లో విలన్లకి మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్‌లో స్కెచ్‌లు వేసే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల, రియల్ లైఫ్‌లో మాత్రం కేటుగాళ్లు వేసిన ‘రియల్’ స్కెచ్‌కి చిక్కారు. దాదాపు ₹7.2 కోట్ల భారీ భూ కుంభకోణంలో ఆయన మోసపోవడం ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ స్కామ్ వెనుక ఉన్న డీటెయిల్స్ చూస్తుంటే.. అచ్చం ఆయన సినిమాల్లో ఉండే ట్విస్టులనే తలపిస్తున్నాయి.

శ్రీను వైట్లకే ‘దూకుడు’ చూపించిన కేటుగాళ్లు.. 7 కోట్ల ల్యాండ్ స్కామ్ లో అసలేం జరిగింది?

వినిపిస్తున్న సమాచారం ప్రకారం … స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల తన మేనకోడలు శ్వేతతో కలిసి ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం భూమి కొనాలని ప్లాన్ చేశారట . సరిగ్గా ఇదే గ్యాప్‌లో 2019లో కొందరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఎంట్రీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా కడ్మూర్ సమీపంలో అద్భుతమైన ల్యాండ్ ఉందని, తక్కువ ధరకే వస్తుందని నమ్మబలికారు. జెట్టిగారి సుధాకర్ రెడ్డి, కావలి కృష్ణ అనే మధ్యవర్తులు ఈ డీల్‌ని సెట్ చేశారట . నిందితులు జి. ప్రభాకర్ రెడ్డి, మంచంపల్లి ఆనందం సహా పదిమంది గ్యాంగ్‌గా ఏర్పడి, ఆ భూమి తమదేనంటూ నకిలీ పత్రాలను సృష్టించి శ్రీను వైట్లకు చూపించారని సమాచారం.

Advertisement

also read:Car Tips: మీ కారు ‘స్పేర్ టైర్’ ఎందుకు చిన్నగా ఉంటుందో తెలుసా? ఇది కంపెనీ చేసిన పొరపాటు కాదు.. ఒక మాస్టర్ ప్లాన్!

ఇక అవి  నిజమైన డాక్యుమెంట్లలాగే ఉండటంతో శ్రీను వైట్ల వాటిని నమ్మి, సుమారు 7.2 కోట్ల రూపాయలను చెల్లించి తన మేనకోడలి పేరు మీద, తన పేరు మీద సేల్ డీడ్లు చేయించుకున్నారట. అయితే, రీసెంట్‌గా ఆ భూములకు సంబంధించి అసలు నిజాలు బయటపడటంతో ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ భూములు అమ్మిన వాళ్లవి కాదని, వేరే వ్యక్తులకు చెందినవని.. కేవలం నకిలీ పత్రాలతో తనను బురిడీ కొట్టించారని తెలుసుకున్నారట శ్రీను వైట్ల.

సీసీఎస్ పోలీసుల ఎంట్రీ.. ఇన్వెస్టిగేషన్ స్పీడప్!

Advertisement

దీంతో తాను దారుణంగా మోసపోయానని గ్రహించిన శ్రీను వైట్ల, వెంటనే హైదరాబాద్ CCS (Central Crime Station) పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నిందితులు కుట్రపూరితంగా తనను ట్రాప్ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ గ్యాంగ్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? వీరు శ్రీను వైట్ల లాగే ఇంకెవరినైనా బురిడీ కొట్టించారా? అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ప్రధాన నిందితులపై సెక్షన్ల వారీగా కేసులు బుక్ అయ్యాయ్యని తెలుస్తుంది.

కెరీర్ లో లో-ఫేజ్.. వ్యక్తిగత జీవితంలో బిగ్ లాస్!

ఇక శ్రీను వైట్ల అంటేనే తెలుగు ఆడియన్స్‌కి ఒక ఎనర్జీ. ‘ఆనందం’, ‘వెంకీ’, ‘ఢీ’, ‘రెడీ’ లాంటి సినిమాలతో కామెడీలో కొత్త ట్రెండ్ సెట్ చేసిన ఆయన, ‘దూకుడు’తో టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు. అయితే, గత కొన్నేళ్లుగా ఆయనకు కాలం కలిసిరావడం లేదు. ‘ఆగడు’ నుంచి మొదలైన డౌన్ ఫాల్, రీసెంట్‌గా వచ్చిన ‘విశ్వం’ వరకు కొనసాగింది. కెరీర్ లో మళ్ళీ ఫామ్‌లోకి రావాలని గట్టిగా ట్రై చేస్తున్న టైమ్‌లో, ఇలా ఏడు కోట్లకు పైగా మోసపోవడం ఆయనకు పెద్ద దెబ్బే అని చెప్పాలి.

ప్రస్తుతం శ్రీను వైట్ల తన నెక్స్ట్ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టిన సంగతి తెల్సిందే . శర్వానంద్‌తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఒక క్లాస్ అండ్ మాస్ ఎంటర్టైనర్‌ను 2027 సంక్రాంతి టార్గెట్‌గా ప్లాన్ చేస్తున్నారు. రీల్ లైఫ్‌లో ఎన్ని ప్లాపులు వచ్చినా భరించవచ్చు కానీ, రియల్ లైఫ్‌లో ఇలాంటి స్కామ్‌లు జరిగితే తట్టుకోవడం కష్టమే.  ఇక ఈ వివాదం నుంచి ఆయన క్షేమంగా బయటపడాలని, త్వరలోనే తన మార్క్ కామెడీతో రీ-ఎంట్రీ ఇవ్వాలని  కోరుకుంటున్నారు మూవీ లవర్స్ .చూడాలి మరి  నెట్టింట తెగ సర్క్యులేట్ అవుతున్న  ఈ భూ కుంభకోణం ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో !

also read :Relationship Secrets: అత్తింట్లో అడుగుపెడుతున్నారా? ‘క్వీన్’ లా ఉండాలంటే ఈ 5 స్మార్ట్ టిప్స్ మీకోసమే!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×