Anna Lezhneva: ఎన్నికల అనంతరం అన్నయ్య చిరంజీవి (Megastar Chiranjeevi) ఇంటికి వచ్చిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఆయన కళ్లకు సాష్టాంగ నమస్కారం చేసిన తీరుకి అంతా ఫిదా అయ్యారు. అందరినీ ఎమోషనల్‌కి గురిచేసిన ఆ సంఘటన ఇప్పటికీ ఏదో ఒక చోట సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. సేమ్ టు సేమ్ ఇప్పుడు అలాంటి వైబ్‌ని పవన్ కళ్యాణ్ వైఫ్ అన్నా లెజ్నొవా (Anna Lezhneva) మెగా ఫ్యాన్స్‌కు ఇచ్చారు. మెగా ఫ్యామిలీలో బాండింగ్స్ ఎలా ఉంటాయో మరోసారి తెలియజేశారు. ఆ మధ్య చిరంజీవి ఓ ఈవెంట్‌లో ఇంటి నిండా ఆడపిల్లలే ఉన్నారు.. ఒక్కోసారి నాకు వార్డెన్‌గా ఉన్నానని అనిపిస్తుంది అంటూ సరదాగా చెప్పిన విషయాన్ని, సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఆడపిల్లలపై అలా మాట్లాడతారా? అంత చిన్న చూపు చూస్తారా? అంటూ కొందరు డిబెట్స్ కూడా నిర్వహించారు. కానీ, ఇంట్లోని ఆడవారిని చిరంజీవి ఎలా చూసుకుంటారో? తెలిసిన తర్వాత అంతా కామ్ అయ్యారు.
Also Read- Pawan Kalyan: ఇన్‌స్టాలోకి పవన్ కళ్యాణ్ భార్య.. పవర్ స్టార్ ఎలా స్పందించారంటే?
ఇప్పుడు మరోసారి మెగాస్టార్ చిరంజీవి అంటే ఏంటో.. జనాలకు తెలిసేలా చేశారు పవన్ కళ్యాణ్ వైఫ్ అన్నా లెజ్నొవా. అవును, ఇప్పుడిదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నడుస్తుంది. తాజాగా ఆమె సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా ఓపెన్ చేశారు (Anna Lezhneva Instagram Entry). ఆమె అధికారికంగా ఇన్‌స్టాలోకి అడుగు పెట్టడంతో పవర్ స్టార్ కూడా ప్రత్యేకంగా విష్ చేశారు. ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, మెగా ఫ్యాన్స్ అందరూ ఆమెకు స్వాగతం పలుకుతున్నారు. ఇక అన్నింటికీ మించి మెగాస్టార్ చిరంజీవి కూడా ఆమెకు స్వాగతం చెబుతూ.. ‘‘అన్నా.. ఇన్‌స్టాగ్రామ్‌లోకి మీకు స్వాగతం పలుకుతున్నాను. ఇక్కడ మీకు ఎంతో ప్రేమ దక్కాలని కోరుకుంటున్నాను’’ అని తన ఇన్‌స్టా స్టేటస్‌లో తెలిపారు. దీనికి అన్నా లెజ్నొవా స్పందిస్తూ..
Also Read- Pawan Kalyan: రామ్ చరణ్ కు ప్రమాదం.. పవన్ కళ్యాణ్ పోస్ట్ వైరల్..
‘‘మీ సపోర్ట్‌కు ధన్యవాదాలు అన్నయ్యా’’ అంటూ మెగా ఫ్యాన్స్ గుండెల్ని పిండేశారు. నిజంగా మెగా ఫ్యామిలీలో ఇంత బాండింగ్ ఉంటుందా? అంటూ అంతా ఒకటే చర్చలు. వదిన అంటే తల్లితో సమానం అని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చెబుతుంటారు. మరి బావగారు అంటే తండ్రి లేదంటే అన్నయ్యతో సమానం అనేలా ఇప్పుడు అన్నా పోస్ట్ ఉందనేలా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అన్నా స్పందనపై సోషల్ మీడియాలో ఒకటే చర్చలు నడుస్తున్నాయి. మరోవైపు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ‘మీరెందుకు మేడమ్ సోషల్ మీడియాలోకి.. పవన్ కళ్యాణ్ మాజీ వైఫ్ రేణు దేశాయ్ ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో చూసి కూడా.. మళ్లీ ఈ ప్రయత్నాలు ఎందుకు?’ అంటూ హితవు పలుకుతున్నారు. చూద్దాం మరి.. అన్నా సోషల్ మీడియా జర్నీ ఎలా ఉంటుందో?

Also Read- Anna Konidela: ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం సతీమణి.. ఫస్ట్ పిక్ ఎంటంటే?